రోషనార 1921లో కొప్పరపు సుబ్బారావు రచించిన చారిత్రక దేశభక్తి నాటకం.[1] మహరాష్ట్రవీరుల శౌర్యపరాక్రమాలను, దేశభక్తిని ప్రబోధించిన ఈ నాటకాన్ని, హిందూముస్లిం ఐకమత్యానికి భంగం కలిగిస్తుందనే నెపంతో ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది.[2]

రోషనార
కృతికర్త: కొప్పరపు సుబ్బారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: శ్రీ సత్యానంద ప్రెస్, రాజమహేంద్రవరం
విడుదల: 1936
పేజీలు: 106

కథానేపథ్యం

మార్చు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సోదరి రోషనారా శివాజీని ప్రేమిస్తుంది. శివాజీచే తిరస్కరించబడిన రోషనార ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకొని శివాజీతో యుద్ధంచేసి మరణిస్తుంది.[3]

పాత్రలు

మార్చు
  1. శివాజీ (కథానాయకుడు)
  2. రోషనార (కథానాయకి)
  3. మోరోపంతు (శివాజీ ముఖ్యమంత్రి)
  4. రామోజీ
  5. తానాజీ
  6. నేతాజీ
  7. గంగాధరుడు
  8. మోఅజీము (ఔరంగజేబు కొడుకు)
  9. రామసింహుడు
  10. జయసింహుడు
  11. విక్రమసింహుడు
  12. మీర్ జుమ్లా
  13. దావూద్
  14. ద్వారాపాలకులు
  15. సైనికులు
  16. సేవకులు
  17. దిల్ కుష్
  18. హుషారీ

ఇతర వివరాలు

మార్చు
  1. ఇందులోని హాస్యపాత్రలు రజాక్, దావూర్ కలకాలము నిలిచిపోయే పాత్రలు.
  2. శివాజీగా మాధవపెద్ది వెంకటరామయ్య, రామసింహునిగా పిల్లలమర్రి సుందరరామయ్య, రోషనారగా స్థానం నరసింహారావు విరివిగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు.[4]
  3. రామ విలాస సభ ఈ నాటకాన్ని జహ్వారిబాయి పేరుతో ప్రదర్శించినా కూడా బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది.
  4. 1959లో మద్రాసు నగరంలోని పచ్చియప్ప కళాశాలలో జరిగిన ప్రదర్శనలో ధూళిపాళ సీతారామశాస్త్రి రామసింహుడుగా నటించగా, ఎ. వి. సుబ్బారావు శివాజీ పాత్ర పోషించాడు.

మూలాలు

మార్చు
  1. నవతెలంగాణ, దీపిక-స్టోరి (1 July 2015). "ఆంధ్రనాటక పితామహుడు ఎవరు?". NavaTelangana. Archived from the original on 21 అక్టోబరు 2018. Retrieved 3 November 2019.
  2. తెలుగు నాటక సంక్షిప్త చరిత్ర, రంగస్థల శాస్త్రము-ప్రథమ భాగము, తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1970, పేజీ. 126
  3. దేశభక్తిని ప్రబోధించిన రోషనార, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 30 ఏప్రిల్ 2018, పుట.2
  4. సాక్షి, ఫన్ డే (1 July 2018). "నటస్థానం". Sakshi. డా. గోపరాజు నారాయణరావు. Archived from the original on 3 నవంబరు 2019. Retrieved 3 November 2019.

ఇతర లంకెలు

మార్చు