లంగ్‌లై
లంగ్‌లై, మిజోరాం రాష్ట్రంలోని లంగ్‌లై జిల్లా ముఖ్య పట్టణం. లంగ్‌లై అంటే 'రాక్ వంతెన' అని అర్థం. ఇది రాష్ట్ర రాజధాని ఐజాల్ తరువాత అతిపెద్ద పట్టణం. ఇది, ఐజాల్ పట్టణానికి దక్షిణాన 165 కి.మీ. (102 మైళ్ళు) దూరంలో ఉంది.
లంగ్‌లై | |
---|---|
పట్టణం | |
Nickname: లీట్లాంగ్‌పుయి | |
Coordinates: 22°53′N 92°44′E / 22.88°N 92.73°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మిజోరాం |
జిల్లా | లంగ్‌లై |
Elevation | 1,222 మీ (4,009 అ.) |
జనాభా (2001) | |
• Total | 57,011 |
భాషలు | |
• అధికారిక | మిజో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 796701 |
Vehicle registration | ఎంజెడ్-02 |
వాతావరణం | Cwa |
చరిత్ర
మార్చు1888 నుండి 10 సంవత్సరాలపాటు లంగ్‌లై పట్టణం దక్షిణ లుషాయ్ కొండ జిల్లాల రాజధానిగా ఉంది.[1] మిజోరాంలో రెండవ అతిపెద్ద పట్టణం ఇది. ఇది బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నగరానికి ఈ పట్టణం నుండి ప్రవేశం ఉంది. ఈ పట్టణం వాణిజ్య, విద్యాకేంద్రంగా నిలిచింది.[2] 1912 నుండి 1922 వరకు ఇక్కడ కేవలం 2 షాపులు మాత్రమే ఉండేవి. 1922లో 4 షాపులు ఏర్పాటు చేయబడ్డాయి. 1950లలో లంగ్‌లై పట్టణానికి మొట్టమొదటి రహదారి వేశారు.[3]
భౌగోళికం
మార్చులంగ్లై పట్టణం 22°53′N 92°44′E / 22.88°N 92.73°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[4] ఇది సముద్రమట్టానికి 1,222 మీటర్లు (4,009 అడుగులు) ఎత్తులో ఉంది.
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] లంగ్‌లై పట్టణంలో 57,011 జనాభా ఉంది. ఈ జనాభాలో పురుషులు 52% మంది, స్త్రీలు 48% మంది ఉన్నారు. లంగ్‌లై సగటు అక్షరాస్యత రేటు 84% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీల అక్షరాస్యత 83% గా ఉంది. మొత్తం జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
పరిపాలన
మార్చుఈ జిల్లాలో దక్షిణ తుయిపుయి, ఉత్తర లంగ్‌లై, తూర్పు లంగ్‌లై, పశ్చిమ లంగ్‌లై, దక్షిణ లంగ్‌లై, తోరాంగ్, పశ్చిమ తుయిపుయి అనే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లంగ్‌లై పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడింది.[6]
మీడియా
మార్చువార్తాపత్రికలు
మార్చు- హమ్నాదమ్నా
- జోచియార్
- లుంగ్లీ టైమ్స్
- డైఫిమ్
- రాల్వెంగ్టు[7]
- వుల్మావి[8]
- లుంగ్లీ ట్రిబ్యూన్
- మాకెడోనియా (ఆదివారం)
- డైలీ పోస్ట్
- జున్జామ్
లంగ్‌లై 35 కిలోమీటర్ల దూరంలో తలాబుంగ్ అనే పట్టణం ఉంది. ఇక్కడున్న కర్నాఫులి నది 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టగాంగ్‌కు కలుపుతుంది. 1940వ దశకంలో లంగ్‌లై నుండి షిల్లాంగ్ లేదా కోల్‌కతాకు చిట్టగాంగ్ రహదారి ఏర్పడింది.[9]
కేబుల్ నెట్‌వర్క్‌లు
మార్చు- ఎల్.డి.ఎఫ్. కేబుల్ నెట్‌వర్క్
- జెబి కేబుల్ నెట్‌వర్క్
రవాణా
మార్చులంగ్లై పట్టణం నుండి ఐజాల్ నగరానికి పవన్ హన్స్ (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[10] లంగ్‌లై, ఐజ్‌వాల్ మధ్య 200 కి.మీ.ల (120 మైళ్ళ) దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[11] లంగ్‌లై నుండి 25 కి.మీ. (16 మైళ్ళ) దూరంలో ఉన్న ఖాజాల్ పట్టణంలో ఒక చిన్న విమానాశ్రయాన్ని నిర్మించే ప్రణాళికలు కూడా ఉన్నాయి.[12]
పరిసరాలు
మార్చు- ఏఓసి
- బజార్ వెంగ్
- చన్మారి-1
- చన్మారి-2
- చన్మారి-3
- కళాశాల వెంగ్
- ఎలక్ట్రిక్ వెంగ్
- వ్యవసాయ వెంగ్
- ఫాల్కన్
- హౌరాంగ్
- హ్రాంగ్‌చల్‌కాన్
- కికాన్
- లుయాంగ్మువల్
- లంగ్లాన్
- లంగ్పుయిజాల్
- కరుగు
- పుక్పుయి
- రహసీవెంగ్
- రామ్‌తార్ వెంగ్
- రామ్‌జోట్‌లాంగ్
- సేలం వెంగ్
- సజైకాన్
- సెర్కాన్
- సేథ్లున్
- తెరియాట్
- వాన్హ్నే
- వెంగ్లున్
- వెంగ్లై
- జోబాక్ నార్త్
- జోబాక్ సౌత్
- జోహ్నుయ్
- జోట్లాంగ్
ఈ పట్టణం విస్తీర్ణంలో 9.97% అటవీ భూమి ఉంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కాఫీ, రబ్బరు వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. ఇక్కడి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వరి పంట ప్రధాన పాత్ర వహిస్తోంది. చేనేత, ఫర్నిచర్, వ్యవసాయ పరికరాలు, వస్త్రాలు, వెదురు, చెరకు వంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ Prakas, Col Ved (2007). Encyclopaedia of North-East India, Volume 4. Atlantic Publishers. ISBN 9788126907069.
- ↑ K. C. Kabra (2008). Economic Growth of Mizoram: Role of Business & Industry. Concept Publishing Company. ISBN 9788180695186.
- ↑ Pachuau, Joy (13 April 2015). The Camera as a Witness. Cambridge University. pp. 165. ISBN 9781107073395.
- ↑ Falling Rain Genomics, Inc - Lunglei
- ↑ "Census of India 2011: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 28 December 2020.
- ↑ "District Profile". Lunglei District. Archived from the original on 14 డిసెంబరు 2012. Retrieved 28 December 2020.
- ↑ "Ralvengtu". Archived from the original on 26 June 2012. Retrieved 28 December 2020.
- ↑ "Vulmawi". Archived from the original on 3 సెప్టెంబరు 2012. Retrieved 28 December 2020.
- ↑ Pachuau, Joy (13 April 2015). The Camera as a Witness. Cambridge University. pp. 150. ISBN 9781107073395.
- ↑ "Mizorama Helicopter Service Hmasa Ber Aizawl-Lunglei". Vulmawi. Archived from the original on 5 February 2013. Retrieved 28 December 2020.
- ↑ "Aizawl to Lunglei". Mizoram NIC. Retrieved 28 December 2020.
- ↑ "Second airport for Mizoram". The Telegraph. Retrieved 28 December 2020.