లక్షణ సండకన్

శ్రీలంక క్రికెటర్

పత్తంపెరుమ అరాచ్చిగే డాన్ లక్షణ రంగిక సండకన్, శ్రీలంక క్రికెటర్, క్రికెట్ లోని మూడు ఫార్మాట్‌లలో శ్రీలంక జాతీయ జట్టు కోసం ఆడుతున్నాడు.

లక్షణ సండకన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పత్తంపెరుమ అరాచ్చిగే డాన్ లక్షణ రంగిక సండకన్
పుట్టిన తేదీ (1991-06-10) 1991 జూన్ 10 (వయసు 33)
రాగమ, శ్రీలంక
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమ చేయి అసాధారణ స్పిన్
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 136)2016 26 July - Australia తో
చివరి టెస్టు2018 23 November - England తో
తొలి వన్‌డే (క్యాప్ 174)2016 21 August - Australia తో
చివరి వన్‌డే2021 20 July - India తో
తొలి T20I (క్యాప్ 69)2017 22 January - South Africa తో
చివరి T20I2021 26 June - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
CCC
Saracens Sports Club
Southern Express CC
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I
మ్యాచ్‌లు 11 31 20
చేసిన పరుగులు 117 64 23
బ్యాటింగు సగటు 10.63 5.33 7.66
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 25 16* 10
వేసిన బంతులు 2,063 1,488 460
వికెట్లు 37 27 23
బౌలింగు సగటు 34.48 57.00 24.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/95 4/52 4/23
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 8/– 6/–
మూలం: Cricinfo, 21 July 2021

జీవిత విశేషాలు

మార్చు

పత్తంపెరుమ అరాచ్చిగే డాన్ లక్షణ రంగిక సండకన్ 1991, జూన్ 10న శ్రీలంకలోని రాగమలో జన్మించాడు. మట్టుమగల కరుణరత్నే బౌద్ధ కళాశాల, కందానాలోని డి మజెనోడ్ కళాశాలలో చదువుకున్నాడు. 17 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[1] 2022లో వంశిక కేటిపెరాచ్చిని వివాహం చేసుకున్నాడు.

దేశీయ క్రికెట్

మార్చు

కొలంబో క్రికెట్ క్లబ్‌కు ఆడే ఫస్ట్-క్లాస్ క్రికెట్ అడాడు.[2] 2015–16 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో 10 మ్యాచ్‌లు, 18 ఇన్నింగ్స్‌లలో మొత్తం 52 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీశాడు.[3]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[4][5] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో కూడా ఎంపికయ్యాడు.[6] టోర్నమెంట్‌లో కొలంబో తరఫున ఐదు మ్యాచ్‌ల్లో పన్నెండు మంది అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[7]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2016 జూలైలో ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో అతను ఎంపికయ్యాడు.[8] 2016 జూలై 26న ఆస్ట్రేలియాపై శ్రీలంక తరపున తన టెస్టు క్రికెట్ లోని అరంగేట్రం చేసాడు.[9]

2016 ఆగస్టు 21న ఆస్ట్రేలియాపై శ్రీలంక తరపున వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి ఓవర్‌లోనే మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి మొదటి వన్డే వికెట్‌ను తీసుకున్నాడు.[10]

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో ఇతను ఒకడు.[11][12] 2021 అక్టోబరు 1న 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో చేర్చబడ్డాడు.[13]

మూలాలు

మార్చు
  1. "Sandakan – a dream debut". Ceylon Today. 28 July 2016. Archived from the original on 27 జనవరి 2017. Retrieved 24 ఆగస్టు 2023.
  2. "Lakshan Sandakan". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  3. "Records: AIA Premier League Tournament, 2015/16: Most wickets". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  4. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
  5. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-24.
  6. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-24.
  7. "2018 Super Provincial One Day Tournament: Colombo Batting and Bowling Averages". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  8. "Siriwardana left out of Sri Lanka squad for first Test". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  9. "Australia tour of Sri Lanka, 1st Test: Sri Lanka v Australia at Pallekele, Jul 26-30, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  10. "Australia tour of Sri Lanka, 1st ODI: Sri Lanka v Australia at Colombo (RPS), Aug 21, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  11. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-24.
  12. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  13. "Sri Lanka World Cup Squad: 5 additional players to join". Sri Lanka Cricket. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

మార్చు