లక్ష్మణ్ శివరామకృష్ణన్

1965, డిసెంబర్ 31న చెన్నైలో జన్మించిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ (Laxman Sivaramakrishnan) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. శివ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధుడైన ఇతడు భారత క్రికెట్ జట్టు తరఫున 9 టెస్టులలో రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు.

Laxman Sivaramakrishnan
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం (RHB)
బౌలింగుకుడిచేతి leg break and googly
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 9 76
చేసిన పరుగులు 130 1,802
బ్యాటింగు సగటు 16.25 25.02
100లు/50లు 0/0 5/3
అత్యధిక స్కోరు 25 130
వేసిన బంతులు 2,367 10,436
వికెట్లు 26 154
బౌలింగు సగటు 44.03 38.49
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 6
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 1
అత్యుత్తమ బౌలింగు 6/64 7/28
క్యాచ్‌లు/స్టంపింగులు 9 60
మూలం: [1]

ప్రారంభ క్రీడా జీవితం మార్చు

శివ 15 సంవత్సరాల ప్రాయంలోనే 1980లో రవిశాస్త్రి నేతృత్వంలో శ్రీలంక పర్యటించిన అండర్-19 జట్టులో పిన్నవయస్కుడిగా ప్రాతినిధ్యం వహించాడు. 16 సంవత్సరాల వయస్సులోనే తన తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడినాడు. 1981-82 రంజీ ట్రోఫిలో ఢిల్లీ జట్టుపై జరిగిన ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్సులో 28 పరుగులకే 7 వికెట్లు పడగొట్టి ఆ తరువాత దులీప్ ట్రోఫి టోర్నమెంటుకై సౌత్ జోన్ తరఫున ఎంపికైనాడు. అందులోనే రెండో ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించాడు. అందులో సునీల్ గవాస్కర్కు చెందిన వికెట్టు కూడా ఉంది.

టెస్ట్ క్రీడా జీవితం మార్చు

దేశవాళి క్రికెట్‌లో చూపిన ప్రతిభ కారణంగా 1982-83లో పాకిస్తాన్ పర్యటించిన భారత జట్టులోకి ఎంపికైనాడు. ఆ తరువాత వెస్టీండీస్తో జరిగిన సీరీస్‌లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో పాల్గొనే వరకు కేవలం 3 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలనే ఆడటం గమనార్హం. తొలి టెస్ట్ ఆడే అవకాశం మాత్రం సెయింట్ జాన్స్ లోని ఆంటిగ్వా స్టేడియంలో లభించింది. అప్పటికి అతని వయస్సు కేవలం 17 సంవత్సరాల 118 రోజులు మాత్రమే. 1984లో రవిశాస్త్రి నేతృత్వంలో జింబాబ్వే పర్యటించాడు. కాని టెస్టులో అతను సరైన ప్రతిభ చూపని కారణంగా మళ్ళీ అండర్-25 జట్టులో ఆడవలసి వచ్చింది.

శివ తన రెండో టెస్టును ఇంగ్లాండుపై ముంబాయిపై ఆడినాడు. గ్రేమ్ ఫ్లవర్ను ఔట్ చేసి తన తొలి టెస్ట్ వికెట్టును సాధించాడు. ఫుల్‌టాస్ బంతికి బ్యాట్స్‌మెన్ ఇచ్చిన బంతికి అతనే పట్టుకొన్నాడు. తొలి ఇన్నింగ్సులో 64 పరుగులకు 6 వికెట్లు, రెండో ఇన్నింగ్సులో 117 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఆ టెస్ట్ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో భారత్‌కు విజయం అందించాడు. తరువాత ఢిల్లీ టెస్టులో మరో పర్యాయం ఇన్నింగ్సులో 6 వికెట్లు పడగొట్టినాడు. కాని ఆతరువాత సరైన బౌలింగ్ విశ్లేషణ నమోదు చేయలేకపోయాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లు సాధించడం ఈ మూడు సార్లు మాత్రమే.

ప్రపంచ కప్ క్రికెట్ మార్చు

కపిల్ దేవ్ నేతృత్వంలో 1987లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంటులో శివ భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు