లక్ష్మీ కళ్యాణం
లక్ష్మీకళ్యాణం దర్శకుడు తేజ చాలాకాలం తరువాత పల్లె నేపథ్యంలో మంచి సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రం.
లక్ష్మీ కల్యాణం (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తేజ |
---|---|
నిర్మాణం | కె.చంద్రశేఖర్ (జీతు) |
తారాగణం | కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, సుహాసిని, సాయాజీషిండే, అవినాష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, శకుంతల, దువ్వాసి మోహన్, తులసి |
సంగీతం | ఆర్పీ పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథాగమనం
మార్చురాయవరం, కొండపల్లి అనే రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది.. రాము కళ్యాణ్ రామ్ రాయవరంలో రెండేకరాల రైతు. మొరటోడు అయినా నిజాయితీ పరుడైన రాముకి మేనమామ చెంచురామయ్య షాయాజీ షిండే కూతురు లక్ష్మి కాజల్ అగర్వాల్ మీద ప్రేమ. ఆమె కూడా రాముని ప్రేమిస్తుంది కాని చెంచురామయ్యకు ఈ వ్యవహారం నచ్చదు. రాముకి బుజ్జి అనే స్నేహితుడు ఉంటాడు. అతడు దేవదాసీ కుటుంభానికి చెందిన పంకజం కూతురు పారిజాతాన్ని సుహాసిని ప్రేమిస్తాడు. సుహసిని కూడా బుజ్జిని ప్రేమిస్తుంది. కొండపల్లి ప్రెసిడెంటు కొడుకు గిరిధర్ అజయ్. అతడి స్నేహితుడి కోరికమీద పారిజాతాన్ని రాత్రికి రెడీచేసి ఉంచమని పంకజానికి చెపుతాడు గిరి. పారిజాతం తనకు బుజ్జితో గల ప్రేమను చెప్పడంతో కూతురితో వ్యభిచారం చేయించాలనే ప్రయత్నాన్ని విరమించి వాళ్ళిద్దరకూ పెళ్ళి చేయాలనుకొంటుంది. దానికి కోపగించిన గిరి బుజ్జిని చంపాలనుకొని కాలేజీకి వెళతాడు. అక్కడ లక్ష్మిని అడ్డుపెట్టుకొని బుజ్జి తప్పించుకుంటాడు. లక్ష్మిని చూసిన గిరి ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. అక్కడినుండి రామూకు గిరికి వివాధం మొదలవుతుంది. చెంచురామయ్య గిరికీ రాముకూ ఎడ్లపందాలలో ఆమెను ఎవరు గెలుచుకొంటే వారికే తన కూతురు చెందుతుందని చెప్తాడు. బుజ్జిని పారిజాతంతో పెళ్ళి చేస్తానని చెప్పి తన వైపు తిప్పుకొని అతని సహాయంతో మోసంతో రామును ఓడిస్తాడు గిరి. తరువాత బుజ్జిని చంపే ప్రయత్నం చేస్తాడు. బుజ్జి పారిపోయి రాముకు జరిగినది చెప్తాడు. రాము గిరిని కొడుతుండగా గిరి తండ్రి రామును పొడిచే ప్రయత్నంలో రాము ప్రక్కకు జరగగా గిరినే పొడిచేస్తాడు. తరువాత రాము లక్ష్మిల కల్యాణం జరుగుతుంది.
చిత్ర విశేషాలు
మార్చుదర్శకుడు తేజకు కొన్ని ప్లాప్ సినిమాల తరువాత వచ్చిన హిట్ ఈ సినిమా. పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. కళ్యాణ్ రామ్ పల్లెటూరి వాడుగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రంలో అతని కేశాలంకరణ, మీసం, వస్త్రాలంకరణ, మాట తీరులను పూర్తిగా మార్చడం జరిగింది. పాత తరం కథానాయికలయిన ప్రభ, తులసిలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.