ప్రభ (నటి)

సినీ నటి, నర్తకి

ప్రభ (కోటి సూర్య ప్రభ) తెలుగు సినీ నటీ, నర్తకి.

సినీరంగ ప్రస్థానం మార్చు

ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది.[1] దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].

చిత్ర సమాహారం మార్చు

అవార్డులు మార్చు

  1. నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు - వేగుచుక్కలు (2003)

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-03-21.
  2. http://www.idlebrain.com/movie/archive/eventlist2.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-21.
  4. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రభ_(నటి)&oldid=3834260" నుండి వెలికితీశారు