లచ్చిందేవికీ ఓలెక్కుంది

లచ్చిందేవికీ ఓలెక్కుంది 2016 తెలుగు సినిమా.

లచ్చిందేవికీ ఓలెక్కుంది
తారాగణంనవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి
సంగీతంఎం. ఎం. కీరవాణి
విడుదల తేదీ
జనవరి 26, 2016 (2016-01-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న అన్ క్లెయిమ్డ్ అకౌంట్స్‌లోని డబ్బును ఖాతాదారుల వారసులకు అందించాలని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అన్ క్లెయిమ్డ్ అకౌంట్స్ వివరాలను వెబ్‌సైట్స్‌లో పెట్టాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశిస్తుంది. దీంతో బ్యాంకుల్లో అనాధగా పడిఉన్న సొమ్మును కొట్టేయాలని విలన్ మహేష్ (అజయ్) పథకం వేస్తాడు. అతడి పథకంలో జనతా బ్యాంకులో పనిచేసే హీరో నవీన్ (నవీన్ చంద్ర), హీరోయిన్ దేవి (లావణ్య త్రిపాఠి) పావులుగా మారుతారు. అయితే జనతా బ్యాంకు మేనేజర్ సోమయాజులు (జయప్రకాష్ రెడ్డి) విలన్‌కు షాక్ ఇస్తాడు. విలన్లు కొట్టేయాలనుకున్న అకౌంట్లు ఒకటి దేవతకు, మరొకటి దెయ్యానికి సంబంధించినదిగా కట్టుకథ చెబుతాడు. అయితే ఆ కట్టుకథను నిజం చేయడంలో హీరోయిన్ దేవి త్రిముఖ నటనను ప్రదర్శిస్తుంది. బ్యాంకులో నిజాయితీగా పనిచేసే దేవి విలన్‌కు ఎందుకు సహరిస్తుంది?. జయప్రకాష్ రెడ్డి అల్లిన కట్టుకథ గుట్టు ఎలా బయటపడుతుంది?. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు క్లయిమాక్స్‌లో ఎలా ఎంటరవుతాడు? అనేది మిగిలిన కథ.

నటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  • సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
  • సంగీతం: ఎమ్.ఎమ్ కీరవాణి
  • నిర్మాత: సాయిప్రసాద్ కామినేని
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జగదీష్ తలశిల

కీరవాణి మ్యూజిక్ సినిమాకి ఆకర్షణగా నిలిచింది. సినిమాకి తగ్గట్టుగా నేపథ్య సంగీతం కుదిరింది. రెండు పాటలు మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కెమెరామెన్ ఈశ్వర్ పనితనం బాగుంది. ఎటిడింగ్ పర్వాలేదు. అసలు కథ 10 నిమిషాలకే పరిమితమై, కథనం ఆసక్తికరంగా లేకపోవటంతో మిగిలిన గంటా నలభై నిమిషాల సమయం ఈ సినిమాకి ఎక్కువైందని అనుకుంటాడు ప్రేక్షకుడు. ఇక నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాలో ఉన్నది తక్కువ పాత్రలే అయినా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు.

చిత్రపరిశ్రమలో రాజమౌళి దగ్గర మాత్రమే పనిచేసిన జగదీష్ తలశిల తన సినిమాలో రాజమౌళి మార్క్‌ను చూపించడంలో విఫలమయ్యాడు. అయితే తాను అనుకొన్న కాన్సెప్ట్‌ను యథాతథంగా తెరకెక్కించాడు. కానీ కాన్సెప్టుకు మూవీలోని సన్నివేశాలకు ఏ మాత్రం లెక్కసరిపోలేదు. లావణ్య త్రిపాఠి పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. జయప్రకాష్‌రెడ్డి పాత్రమీదే దర్శకుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు అనిపిస్తోంది. ‘అందాల రాక్షసి’ని రాక్షసిగా చూపించడం ఇష్టంలేకో లేదా ప్రేక్షకులను భయపెట్టడం ఇష్టంలేకో లావణ్య త్రిపాఠిని అందమైన దెయ్యంగా చూపించి హార్రర్ సీన్లను నార్మల్ సీన్లుగా మార్చేశారు. జగదీష్ తలశిల సరైన కథను ఎంచుకొని ఉంటే సక్సెస్ అయ్యుండేవాడేమో.[1]

మూలాలు

మార్చు

లింకులు

మార్చు