లడ్డు
(లడ్లు నుండి దారిమార్పు చెందింది)
లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే మిఠాయి. శనగ పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు.[1] [2] బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.
మూలము | |
---|---|
మూలస్థానం | దక్షిణ ఆసియా |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | శనగపిండి, పాలు,చక్కెర |
వైవిధ్యాలు | రవ్వ , |
ఇతర సమాచారం | పండగలు లేదా మతపరమైన కార్యక్రమాలు |
కావలసిన పదార్ధాలు
మార్చుకావలసిన పరికరాలు
మార్చు- బూందీ చట్రాలు
- బూరెల మూకుడు
- రెండు వెడల్పాటి కళాయి గిన్నెలు.
తయారుచేయు విధానం
మార్చు- శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
- చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
- ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
- నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
- శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరువాత చట్రం ముద్దలో ఉంచాలి.
- బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
- శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
- బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
- తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
- చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sweet shops make hay in Diwali shine". The New Indian Express. Archived from the original on 2016-04-21. Retrieved 2015-09-20.
- ↑ Sangeetha Devi Dundoo. "As good as home". The Hindu.