లవ్ ఇన్ సింగపూర్

లవ్ ఇన్ సింగపూర్ చిరంజీవి, రంగనాథ్, లత నటించిన 1980 నాటి తెలుగు యాక్షన్-డ్రామా చిత్రం [1] [2] ఈ చిత్రం . ఫిల్ంస్ పతాకంపై, ఒ.ఎస్.ఆర్ దర్శకత్వంలో వెంకటరమణకుమార్ నిర్మించాడు. శంకర్ గణేష్ లు ఈ సినిమాకు సంగీతం అందిచారు.

లవ్ ఇన్ సింగపూర్
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓ.ఎస్.ఆర్. ఆంజనేయులు
నిర్మాణం ఎం.వెంకటరమణకుమార్
రచన కె. గోపాలకృష్ణ
తారాగణం చిరంజీవి ,
మెర్లిన్
సంగీతం శంకర్ గణేష్
కూర్పు రవీంద్రబాబు
ఎస్.విరమణ
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్
భాష తెలుగు

కథ మార్చు

రంగనాథ్, చిరంజీవిలు సోదరులు. వారి తండ్రి పోలీసాఫీసరు. వాళ్ళ చిన్నతనంలో ఆయన ఓ నేరస్థుడిని పట్టుకుని జైలుకు పంపిస్తాడు.

ఓ రాత్రి అన్నదమ్ములు ఏదో విషయంపై పోట్లాడూకోగా, తండ్రి చిరంజీవిని కొడతాడు. అందుకు అలిగి అతడు ఇల్లు వదిలి పారిపోతాడు. అదే రాత్రి విలన్ వాళ్ల ఇంటికి వచ్చి జైలుకు పంపినందుకు ప్రతీకారంగా వాళ్ల తండ్రిని చంపేస్తాడు.

అన్న రంగనాథ్ సిబిఐ అధికారి అవుతాడు. సింగపూరు నుండి పనిచేసే మాఫియా ముఠా ఆట కట్టించేందుకు అతణ్ణి అక్కడికి పంపిస్తారు. తమ్ముడు అక్కడే ఉంటాడు, విలన్ల బారిన పోడ్డ అన్నను రక్షిస్తాడు కూడా. అతడు తన అన్న అని తెలుసుకుంటాడు

తమ్ముడికి మెస్లిన్ అనే చైనా స్నేహితురాలు ఉంటుంది. ఇద్దరూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటారు. రంగనాథ్ లత అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పదతాడు. అయితే ఆ అమ్మాయి తండ్రిని తన వద్ద బందీగా ఉంచుకుని విలన్, తాను చెప్పినట్లు ఆమె చేత చేయిస్తూంటాడు. ఆమె రంగనాథ్‌ను విలన్ ఉచ్చులోకి లాగుతుంది. అయితే అత్డు ఈ సంగతిని కనిపెడతాడు. తమ్ముడి సాయంతో విలన్ ఆటకట్టించి తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుని ఇద్దరూ భారత్ తిరిగి వస్తారు. [3]

నటవర్గం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

 • కథ: కె. గోపాల కృష్ణ
 • సంభాషణలు: మోదుకూరి జాన్సన్ & మోదుకూరి చిట్టి బాబు
 • సాహిత్యం: డాక్టర్ సి. నారాయణ రెడ్డి, వెటూరి & సాహితి
 • నేపథ్య గానం సింగర్: పి.సుశీలా, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం & వి. రామకృష్ణ
 • పోరాటాలు: త్యాగరాజన్
 • స్టిల్స్: శ్యామ్ ప్రసాద్
 • ప్రచారం: గంగాధర్
 • ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ రాజు
 • అసిస్టెంట్ డైరెక్టర్: ఎస్.శివశంకర్
 • సంపాదకులు: రవీంద్ర బాబు & ఎస్.వి.రమణ
 • సంగీతం: శంకర్ గణేష్
 • ఛాయాగ్రహణం: ఇంధు & కెపి ధాయలాన్
 • అసోసియేట్ నిర్మాతలు: ఎం. చంద్ర కుమార్, ఎం. విజయ కుమార్ & ఎం. జీవన్ కుమార్
 • నిర్మాత: ఎం. వెంకటరమణ కుమార్
 • దర్శకుడు: OSR

నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు మార్చు

పాటల జాబితా మార్చు

1:నీ నవనవలాడే నవ్వులు చిందే , రామకృష్ణ

మూలాలు మార్చు

 1. "Love In Singapore Preview, Love In Singapore Story & Synopsis, Love In Singapore Telugu Movie - Filmibeat".
 2. "Love in Singapore".
 3. "Love In Singapore Preview, Love In Singapore Story & Synopsis, Love In Singapore Telugu Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-11. Retrieved 2020-08-11.