లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి

లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి భారతీయ సైనిక కమెండో. ఆయన 11 రోజుల్లో పదిమంది టెర్రరిస్ట్ లను మట్టుపెట్టి పాక్ టెర్రరిస్ట్ ల పాలిట సింహస్వప్నంగా మారారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

ఆయన స్వగ్రామం నైనిటాల్ లోని హల్ ద్వానిలో ఇందిరానగర్. గొస్వామి 2002లో ఆర్మీలో పెరా కమాండోల విభాగంలో చేరాడు.తరువాత పదోన్నతిపై ఆర్మీ ప్రత్యేక దళాల కమాండోల విభాగంలోకి మారాడు.

ఉగ్రవాదుల సింహస్వప్నం

మార్చు

ఆయన గత జమ్మూ - కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు ఏర్పాటు చేసిన అపరేషన్ లో చురుగ్గా పాల్గోన్నాడు.యాంటీ టెర్రర్ మిషన్ లో కీలక పాత్రవహిస్తూ ఆగస్టు 23,2015 న తొలి ఆపరేషన్ – హంద్వారా, ఖర్మూర్ లో పాల్గొన్నాడు.[2]. ఒక్కడే 10 మంది ఉగ్రవాదులను అంతం చేశాడు. ఈ టీం శ్రీనగర్ సమీపంలోని హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే సందర్భంలో ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పులలో గోస్వామి ప్రాణాలు వదిలాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.[4]

11 రోజుల్లో పది మంది ఉగ్రవాదులను అంతం చేసి పై అధికారుల దగ్గర గౌరవం పెంచుకున్నాడు.అయితే మరింత మంది ఉగ్రవాదులను అంతం చెయ్యడానికి ప్రయత్నించిన గో స్వామి చివరికి సెప్టెంబరు 5 2015 న తన ప్రాణాలు కోల్పోయాడు.[5]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు