లాయర్ విశ్వనాథ్
లాయర్ విశ్వనాథ్ 1978, నవంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు , జయసుధ నటించారు.[1] రవి చిత్ర ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ [2] పై వై.వి.రావు నిర్మించాడు.[3] సత్యం సంగీతం సమకూర్చాడు.[4] ఈ చిత్రం విశ్వనాథ్ (1978) అనే హిందీ చిత్రానికి రీమేక్.[5]
లాయర్ విశ్వనాథ్ (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
నిర్మాణం | వై.వి.రావు |
కథ | ముక్తా ఘాయ్ |
చిత్రానువాదం | రాం కేల్కర్ |
తారాగణం | నందమూరి తారక రామారావు , జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
ఛాయాగ్రహణం | పి. దేవరాజ్ |
కూర్పు | డి రాజగోపాలరావు |
నిర్మాణ సంస్థ | రవి చిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చువిశ్వనాథ్ (ఎన్.టి.రామారావు) ఒక మధ్యతరగతికి కుటుంబీకుడు. పబ్లిక్ ప్రాసిక్యూటరుగా పనిచేస్తూంటాడు. అత్యాచారం, హత్య ఆరోపణలపై పారిశ్రామికవేత్త జిఎన్‌కె (ప్రభాకర్ రెడ్డి) కుమారుడు ప్రభు (శరత్ బాబు), అతని అనుచరుడు షక్కా (శ్రీలంక మనోహర్) కు జీవిత ఖైదు వేయిస్తాడు. జిఎన్‌కె కూడా అన్ని రకాల నేర కార్యకలాపాలకు పాల్పడే అండర్‌వరల్డ్ డాన్ అని నగరంలో చాలామందికి తెలియదు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం, అన్ని రకాల పన్నాగాలనూ పన్ని, విశ్వనాథ్‌ను లంచం కేసులో ఇరికించి, స్వల్పకాలిక జైలు శిక్ష పడేలా చేస్తాడు. అతను విడుదలై, ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, జిఎన్‌కె వ్యాపార ప్రయోజనాలపై క్రమపద్ధతిలో దాడి చేయడం మొదలుపెడతాడు. తద్వారా జిఎన్‌కెకు వ్యతిరేకంగా యుద్ధాన్ని మొదలు పెడతాడు, ఈ పనిలో అతడికి కచేరీ కొండయ్య (సత్యనారాయణ) సహాయం చేస్తాడు.
నటీనటులు
మార్చు- ఎన్.టి.రామారావు
- జయసుధ
- రాజనాల
- ప్రభాకరరెడ్డి
- అల్లు రామలింగయ్య
- త్యాగరాజు
- ధూళిపాళ
- కన్నడ ప్రభాకర్
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: ఎస్.డి.లాల్
నిర్మాత: వై.వి.రావు
నిర్మాణ సంస్థ: రవి చిత్ర ఫిలిమ్స్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
కధ: ముక్తా ఘాయి
మాటలు: గొల్లపూడి మారుతీరావు
నేపథ్య గానం: ఎస్.పి .బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎం.రమేష్
చిత్రానువాదం: రాం కేల్కర్
ఫోటోగ్రఫి: దేవరాజ్
కూర్పు: డి.రాజగోపాల్
కళ: చలం
విడుదల:17:11:1978.
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "పిలిచే పిలిచే" | పి. సుశీల | 4:30 |
2. | "షరాబీ" | ఎస్. జానకి | 3:41 |
3. | "రాముడెప్పుడో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 3:59 |
4. | "కలకాలం" | పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 3:52 |
5. | "భం భం భం" | పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 5:30 |
మూలాలు
మార్చు- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర. "సినీ స్నిప్పెట్స్: ఎన్టీయార్‌తో గొల్లపూడి అనుభవాలు". telugu.greatandhra.com. ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016). Retrieved 3 November 2017.
- ↑ "Lawyer Viswanath (Banner)". Chitr.com.[permanent dead link]
- ↑ "Lawyer Viswanath (Director)". Spicy Onion.
- ↑ "Lawyer Viswanath (Cast & Crew)". Know Your Films.
- ↑ "Lawyer Viswanath (Review)". The Cine Bay.[permanent dead link]