లాయర్ సుహాసిని వంశీ దర్శకత్వం వహించగా సుహాసిని, భానుచందర్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం. దీనిని జయ కృష్ణ కంబైన్స్ పతాకంపై[1] వంశీ దర్శకత్వంలో డిఎస్ ప్రసాద్ నిర్మించాడు.[2] ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చాడు.[3]

లాయర్ సుహాసిని
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం డి.ఎస్. ప్రసాద్
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం సుహాసిని ,
భానుచందర్,
ఎస్.వరలక్ష్మి
సంగీతం ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
సంభాషణలు తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణం జి.వి.సుబ్బారావు
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ జయకృష్ణా కంబైన్స్
భాష తెలుగు

కథ మార్చు

సుహాసిని (సుహాసిని) ఒక నిరుపేద మహిళ. ఆమెకు ఓ తమ్ముడు ఈ అక్కా ఓ చెల్లీ ఉన్నారు. వీళ్ళకు తోడు బాధ్యతలు పట్టని తాగుబోతు తండ్రి. ఆమె అక్క (సంగీత) సంపాదనే కుటుంబానికి ఆధారం. సుహాసిని తన సోదరి కష్టపడి సంపాదించిన డబ్బుతో లా డిగ్రీ చదువుతుంది. 10,000 రూపాయల డబ్బు కోసం ఆమె ఒక వృద్ధుడిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. శంకర్ (భానుచందర్), ఒక న్యాయవాది. ఈ సన్నివేశానికి అనుకోకుండా వస్తాడు. సుహాసిని ఆత్మగౌరవం అతడికి నచ్చుతుంది. నాటకీయ పరిస్థితిలో అతను సుహాసినిని పెళ్ళి చేసుకుంటాడు. శంకర్ తల్లి లక్ష్మి బాగా డబ్బు మనిషి. కొడుక్కు మంచి కట్నం వచ్చే సంబంధం చెయ్యాలని అనుకుంటోంది. సహజంగానే, ఆమె ఈ పెళ్ళితో షాక్ అవుతుంది. కోడలిని సాధించడం ప్రారంభిస్తుంది. ఆమె భర్త (ప్రభాకరరెడ్డి) మంచి మనిషి. సుహాసిని మంచి స్వభావాన్ని, ఆమె సమయస్ఫూర్తినీ ఇష్టపడతాడు. శంకర్ ఢిల్లీ వెళ్ళినప్పుడు సుహాసిని, శంకర్ల మధ్య విభేదాలు కలగజేయాలని అత్త కుట్ర పన్నుతుంది.

అక్క చనిపోయినప్పుడు అనాథలైన తన తోబుట్టువులను చూసుకోవడానికి అత్త సుహాసినిని వెళ్ళనివ్వదు. తన తోబుట్టువులను రక్షించుకోడానికి సుహాసిని అత్తమామల ఇంటి వదలి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక న్యాయవాది స్నేహితుడు సూర్య ప్రకాశరావు (రాజేంద్ర ప్రసాద్) సుహాసిని తన న్యాయవాద వృత్తిని కొనసాగించడంలో సహాయం చేస్తాడు. వారి స్నేహాన్ని శంకర్ తప్పుగా భావిస్తాడు. సుహాసిని బాధ్యతాయుతమైన మహిళ అనీ, విజయవంతమైన న్యాయవాది అనీ ఎలా రుజువు చేస్తుందనేది మిగతా చిత్రం.

తారాగణం మార్చు

సంగీతం మార్చు

సినిమాకు సంగీత దర్శకత్వం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వహించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. దర్శకుడు వంశీ ప్రత్యేకించి సిరివెన్నెల సీతారామశాస్త్రితో ప్రతి పాదం చివరన "సామజవరగమనా" అన్న పదం రావాలని కోరగా అందుకు అనుగుణంగా "దివిని తిరుగు మెరుపు లలన సామజవరగమనా" అన్న పాట రాశారు.[4]

సం. పాట గాయనీ గాయకులు నిడివి
1 "మహారాజా" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 4:16
2 "తొలిసారి" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 4:11
3 "ఏమండి ఇల్లాలుగారు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:19
4 "సామజవరగమన" ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ 4:30
5 "లెవమ్మా నిద్ర చాలించి" ఎస్పీ శైలజ 1:25

మూలాలు మార్చు

  1. "Lawyer Suhasini (Banner)". IQLIK.
  2. "Lawyer Suhasini (Director)". Spicy Onion.
  3. "Lawyer Suhasini (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2021-01-19. Retrieved 2020-08-11.
  4. పులగం, చిన్నారాయణ (ఇంటర్వ్యూ). "సిరి అరవై... వెన్నెల దొరవై". సాక్షి. Retrieved 19 September 2015.