లారెన్స్ ఆఫ్ అరేబియా

లారెన్స్ ఆఫ్ అరేబియా 1962, డిసెంబర్ 9న విడుదలైన చారిత్రక సినిమా. థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ అనే బ్రిటీషు సైనికుడు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వ్రాసిన "సెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్‌డమ్" అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

లారెన్స్ ఆఫ్ అరేబియా
సినిమా పోస్టర్
దర్శకత్వండేవిడ్ లీన్
స్క్రీన్ ప్లే
  • రాబర్ట్ బోల్ట్
  • మైకేల్ విల్సన్
దీనిపై ఆధారితంసెవెన్ పిల్లర్స్ ఆఫ్ విజ్‌డమ్ 
by టి.ఇ.లారెన్స్
నిర్మాతశామ్ స్పీగల్
తారాగణం
  • అలెక్స్ గిన్నిస్
  • ఆంథోని క్విన్
  • జాక్ హాక్సిన్స్
  • జోస్ ఫెర్రర్
  • ఆంథోనీ క్వెయిల్
  • క్లాడ్ రెయిన్స్
  • ఆర్థర్ కెన్నెడి
  • ఒమర్ షరీఫ్
  • పీటర్ ఓ టూల్
ఛాయాగ్రహణంఫ్రెడ్డీ ఎ. యంగ్
కూర్పుఅన్నే వి. కోట్స్
సంగీతంమారిస్ జార్
నిర్మాణ
సంస్థ
హొరైజాన్ పిక్చర్స్[2]
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్[2]
విడుదల తేదీ
10 డిసెంబరు 1962 (1962-12-10)
సినిమా నిడివి
210 నిమిషాలు[3]
దేశంయునైటెడ్ కింగ్‌డమ్[1]
భాషఇంగ్లీషు
బడ్జెట్$15 మిలియన్లు[4]
బాక్సాఫీసు$70 మిలియన్లు[4]

చిత్రం థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ ఒక మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించటంతో మొదలవుతుంది. అతని మెమోరియల్ సర్వీస్ దగ్గర అతన్ని గురించి ఒక విలేఖరి ప్రశ్నించటం కథలో ఒక్కో అంశమూ బయటకొస్తుంది. కైరోలో బ్రిటిష్ సైనిక కార్యాలయంలో పనిచేస్తున్న లారెన్స్‌ను బ్రిటిష్ అరబ్ బ్యూరోకు పంపటం ఒక కీలకాంశం. దానితో లారెన్స్ ఎడారి యాత్రలు ఆరంభమవుతాయి. లారెన్స్‌ను ఎడారిలో తీసుకువెళ్తున్న ఒక గైడ్‌ను, షరీఫ్ ఆలీ చంపేస్తాడు. ఆ గైడ్ చేసిన పాపమంతా, షరీఫ్ అలీకి చెందిన నీటి బుగ్గలోంచి నీరు తాగటమే! ఎడారిలో నీళ్లకు అంత విలువ మరి! తన గైడ్‌ను చంపిన షరీఫ్ అలీతో లారెన్స్ గొడవ పడతాడు. చివరికి షరీఫ్ అలీ, లారెన్స్‌లు మంచి స్నేహితులు అవుతారు. షరీఫ్ అలీ, లారెన్స్‌లు కలిసి ప్రిన్స్ ఫైజల్‌ను కలుస్తారు. ఆయన, తన గెరిల్లా బెదుయూన్ తెగ దళాలను బ్రిటిష్ సైన్యంతో కలిపి పనిచేసేందుకు అంగీకరిస్తాడు. ఇది లారెన్స్ సాధించే తొలి విజయం. తర్వాత బెదుయూన్ తెగ దళాలకు నాయకత్వం వహిస్తూ, లారెన్స్ అప్పటి వరకూ టర్కిష్ దళాల కంట్రోల్లో ఉన్న అకాబా నౌకాశ్రయాన్ని స్వాధీనం చేసుకొంటాడు. అకాబాకు చేరేందుకు లారెన్స్, చాలా కష్టమైన నెపుద్ ఎడారిని దాటుతాడు. ఆ ఎడారిని దాటడమే కష్టం కాగా, దాన్ని దాటి అకాబా వరకు వెళ్లటం లారెన్స్ సాధించిన ఘన విజయాలు అవుతాయి. ఆ తర్వాత లారెన్స్ మళ్లీ, టర్కీ ఆధీనంలో ఉన్న దేరాను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లి, అక్కడ టర్కీ దేశస్థులకు బందీగా దొరికిపోతాడు. వారు అతన్ని అనేక చిత్రహింసల పాలుచేస్తారు. వారు అతన్ని విడిచిపెట్టాక, తిరిగి అతను ఆ ఎడారి పోరాటాల్లో భాగం అవుతాడు. అరబ్బుల స్వయం పాలనాధికారం కోసం తాను ఎంతో కృషి చేసినా, వారిలోవారికి గల వైషమ్యాలతో విసిగిపోయి, ఇంగ్లాండుకు తిరిగి వచ్చేస్తాడు. అక్కడే అతను మరణిస్తాడు.[5]

నిర్మాణం

మార్చు

మొత్తం 220 నిమిషాల ఈ చిత్ర నిర్మాణం 1960 ఫిబ్రవరిలో ఆరంభమయింది. అంతకుమునుపు దీని కోసం స్క్రీన్ ప్లే, స్క్రిప్టుల రచనను మైకేల్ విల్సన్ చేపట్టాడు. అయితే స్క్రిప్టు తను ఆశిస్తున్నట్లు రావటంలేదని భావిస్తూ, ఆ పనిని మైకేల్ విల్సన్ నుంచి తొలగించి, ఆ బాధ్యతను రాబర్ట్ బోల్ట్‌కు డేవిడ్ లీన్ అప్పగించాడు. ఆయన విల్సన్ రాసిన భాగాలను తొలగించి, తను అనుకున్నట్లు స్క్రిప్టు పూర్తిచేశాడు. ఆ ప్రకారమే డేవిడ్ లీన్ చిత్రాన్ని జోర్డాన్, మొరాకో, ఆల్జీరియా, బ్రిటన్లలో షూటింగ్ చేసి పూర్తిచేశాడు. 1962 ఆగస్టు వరకు కూడా చిత్రం షూటింగ్ అంచెలంచెలుగా జరుగుతూనే వచ్చింది. 65 యంయం పానావిజన్లో ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ ఎఫ్.ఏ.యంగ్ చిత్రీకరించాడు. 1962 డిసెంబర్ 9న లండన్ లోని ఓడియన్ థియేటర్లో విడుదలతో ఈ చిత్రం ప్రజల ముందుకు వచ్చింది.[5]

నటీనటులు

మార్చు
 
టి.ఇ.లారెన్స్ పాత్రలో పీటర్ ఓ టూల్
  • పీటర్ ఓ టూల్ - టి.ఇ.లారెన్స్
  • అలెక్ గిన్నిస్ - ప్రిన్స్ ఫైజల్
  • ఆంథోని క్విన్ - ఔదా అబూ తాయి
  • జాక్ హాకిన్స్ - జనరల్ ఎడ్మండ్ అల్లెన్‌బీ
  • ఒమర్ షరీఫ్ - షరీఫ్ అలీ ఇబ్న్ ఎల్ ఖరిష్
  • జోస్ ఫెర్రర్ - టర్కిష్ నాయకుడు
  • ఆంథోనీ క్వెయిల్ - కల్నల్ హారీ బ్రైటన్
  • క్లాడ్ రెయిన్స్ - మిస్టర్ డ్రైడెన్
  • ఆర్థర్ కెన్నెడి - జాక్సన్ బెంట్లీ
  • డోనాల్డ్ ఊల్ఫిట్ - జనరల్ ఆర్చిబల్డ్ ముర్రే
  • ఐ. ఎస్. జోహార్ - గాసిమ్
  • గామిల్ రతిబ్ - మాజిద్
  • మైకేల్ రే - ఫెర్రాజ్
  • జాన్ దిమెక్ - దౌడ్
  • జియా మొయినుద్దీన్ - తఫస్
  • హోవర్డ్ మారియన్ క్రాఫోర్డ్ - వైద్య అధికారి
  • జాక్ గ్విలియం - క్లబ్బు సెక్రెటరీ
  • హగ్ మిల్లర్ - కల్నల్

పురస్కారాలు

మార్చు
అవార్డు విభాగము ప్రతిపాదితుడు (లు) ఫలితం
అకాడమీ పురస్కారాలు[6] ఉత్తమ చిత్రం శామ్ స్పీగల్ గెలుపు
ఉత్తమ దర్శకుడు డేవిడ్ లీన్ గెలుపు
ఉత్తమ నటుడు పీటర్ ఓ' టూల్ ప్రతిప్రాదన
ఉత్తమ సహాయ నటుడు ఒమర్ షరీఫ్ ప్రతిప్రాదన
ఉత్తమ స్క్రీన్ ప్లే రాబర్ట్ బోల్ట్, మైకేల్ విల్సన్ ప్రతిప్రాదన
ఉత్తమ కళా దర్శకుడు - కలర్ జాన్ బాక్స్, జాన్ స్టోల్, డేరియో సిమోని గెలుపు
ఉత్తమ ఛాయాగ్రహణం - కలర్ ఫ్రెడ్డీ యంగ్ గెలుపు
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అన్నే వి. కోట్స్ గెలుపు
ఉత్తమ సంగీతం మారిస్ జార్ గెలుపు
ఉత్తమ శబ్దగ్రహణం జాన్ కాక్స్ గెలుపు
అమెరికన్ సినిమా ఎడిటర్స్ అవార్డులు ఉత్తమ ఎడిటర్ అన్నే వి. కోట్స్ ప్రతిప్రాదన
బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు[7] ఉత్తమ సినిమా గెలుపు
ఉత్తమ బ్రిటిష్ సినిమా గెలుపు
ఉత్తమ బ్రిటిష్ నటుడు పీటర్ ఓ' టూల్ గెలుపు
ఉత్తమ విదేశీ నటుడు ఆంథొనీ క్విన్ ప్రతిప్రాదన
ఉత్తమ బ్రిటిష్ స్క్రీన్ ప్లే రాబర్ట్ బోల్ట్ గెలుపు
బ్రిటిష్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్[8] ఉత్తమ ఛాయాగ్రహణం ఫ్రెడ్డీ యంగ్ గెలుపు
డేవిడ్ డి డొనటెల్లో అవార్డులు ఉత్తమ విదేశీ సినిమా శామ్ స్పీగల్ గెలుపు
ఉత్తమ విదేశీ నటుడు పీటర్ ఓ' టూల్ గెలుపు[a]
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు[9] ఉత్తమ దర్శకుడు డేవిడ్ లీన్ గెలుపు
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు[10] ఉత్తమ చలన చిత్రం - డ్రామా గెలుపు
ఉత్తమ నటుడు - డ్రామా పీటర్ ఓ' టూల్ ప్రతిప్రాదన
ఆంథొనీ క్విన్ ప్రతిప్రాదన
ఉత్తమ సహాయనటుడు ఒమర్ షరీఫ్ గెలుపు
ఉత్తమ దర్శకుడు డేవిడ్ లీన్ గెలుపు
ఉత్తమ నూతన నటుడు పీటర్ ఓ' టూల్ గెలుపు
ఒమర్ షరీఫ్ గెలుపు
ఉత్తమ ఛాయాగ్రహణం - కలర్ ఫ్రెడ్డీ యంగ్ గెలుపు
గ్రామీ పురస్కారాలు [11] ఉత్తమ సంగీతం మారిస్ జార్ ప్రతిప్రాదన
ఇంటర్నేషనల్ ఫిల్మ్ మ్యూజిక్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు[12] బెస్ట్ ఆర్కైవల్ రిలీజ్ ఆఫ్ యాన్ ఎక్జిస్టింగ్ స్కోర్ మారిస్ జార్, నిక్ రైనె, జిం ఫిట్జ్ పాట్రిక్, ఫ్రాంక్ కె.డివాల్డ్ ప్రతిప్రాదన
కినిమా జుంపొ అవార్డులు ఉత్తమ విదేశీ సినిమా డేవిడ్ లీన్ గెలుపు
లారెల్ అవార్డులు టాప్ రోడ్ షో గెలుపు
ఉత్తమ నటుడు పీటర్ ఓ' టూల్ ప్రతిప్రాదన
ఉత్తమ సహాయ నటుడు ఒమర్ షరీఫ్ ప్రతిప్రాదన
ఉత్తమ పాట మారిస్ జార్ (థీమ్ సాంగ్ కొరకు) ప్రతిప్రాదన
నాస్ట్రో డి ఆర్జెంటో ఉత్తమ విదేశీ దర్శకుడు డేవిడ్ లీన్ గెలుపు
నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు[13] టాప్ టెన్ సినిమాలు 4వ స్థానం
ఉత్తమ దర్శకుడు డేవిడ్ లీన్ గెలుపు
నేషనల్ ఫిల్మ్ ప్రిజర్వేషన్ బోర్డు నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ చేర్చబడింది
ఆన్‌లైన్ ఫిల్మ్ & టెలివిజన్ అసోసియేషన్ అవార్డులు [14] హాల్ ఆఫ్ ఫేమ్ - చలనచిత్రం గెలుపు
ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డులు PGA హాల్ ఆఫ్ ఫేమ్ - చలనచిత్రం శామ్ స్పీగల్ గెలుపు
శాటర్న్ అవార్డులు ఉత్తమ డివిడి స్పెషల్ ఎడిషన్ విడుదల లారెన్స్ ఆఫ్ అరేబియా: 50వ యానివర్సరీ కలెక్టర్స్ ఎడిషన్ ప్రతిప్రాదన
రైటర్స్ గిల్డ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అవార్డులు ఉత్తమ బ్రిటిష్ స్క్రీన్ ప్లే రాబర్ట్ బోల్ట్, మైకేల్ విల్సన్ గెలుపు

మూలాలు

మార్చు
  1. "Lawrence of Arabia (1962)". BFI. Retrieved 30 October 2022.
  2. 2.0 2.1 "Lawrence of Arabia (1962)" Archived 27 మార్చి 2019 at the Wayback Machine, AFI Catalog.
  3. "Lawrence of Arabia". British Board of Film Classification. Archived from the original on 8 October 2020. Retrieved 10 February 2023.
  4. 4.0 4.1 "Lawrence of Arabia". The Numbers. Archived from the original on 13 January 2015. Retrieved 13 January 2015.
  5. 5.0 5.1 పాలకోడేటి సత్యనారాయణరావు (1 April 2007). హాలీవుడ్ క్లాసిక్స్ మొదటి భాగం (1 ed.). హైదరాబాదు: శ్రీ అనుపమ సాహితి. pp. 152–155.
  6. "The 35th Academy Awards (1963) Nominees and Winners". oscars.org. Archived from the original on 2 February 2018. Retrieved 23 August 2011.
  7. "BAFTA Awards: Film in 1963". BAFTA. 1963. Retrieved 16 September 2016.
  8. "Best Cinematography in Feature Film" (PDF). Retrieved June 3, 2021.
  9. "15th DGA Awards". Directors Guild of America Awards. Retrieved July 5, 2021.
  10. "Lawrence of Arabia – Golden Globes". HFPA. Retrieved July 5, 2021.
  11. "1963 Grammy Award Winners". Grammy.com. Retrieved 1 May 2011.
  12. IFMCA (2011). "2010 IFMCA Awards". IFMCA. IFMCA. Retrieved May 1, 2020.
  13. "1962 Award Winners". National Board of Review. Retrieved July 5, 2021.
  14. "Film Hall of Fame Productions". Online Film & Television Association. Retrieved May 15, 2021.

నోట్స్

మార్చు
  1. "సెవెన్ డేస్ ఇన్ మే" చిత్రానికి ఫ్రెడ్రిక్ మార్చ్‌తో కలిసి.

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.