లావుడ్యా రాములు నాయక్

ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు

లావుడ్యా రాములునాయక్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి, రాజకీయ నాయకుడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

లావుడ్యా రాములునాయక్‌
లావుడ్యా రాములు నాయక్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018 - ప్రస్తుతం
ముందు బానోతు మదన్ లాల్

ఎమ్మెల్యే
నియోజకవర్గం [wyra శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 21 జూన్ 1955
పాపకొల్లు, ఖమ్మం జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బాలు, సోమాలి బాయి
జీవిత భాగస్వామి రాంబాయి
బంధువులు శిప్రా శ్రీవాస్తవ్‌, ఐపీఎస్‌ అధికారి (కోడలు)
సంతానం జీవన్ లాల్, ఝాన్సీబాయి, జయశ్రీ
నివాసం పాండురంగాపురం, ఖమ్మం

జననం, విద్యాభాస్యం

మార్చు

రాములునాయక్‌ 1955, జూన్ 21న తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, జూలూరుపాడు మండలం, పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామంలో బాలు, సోమాలి బాయి దంపతులకు జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.

కుటుంబం

మార్చు

లావుడ్యా రాములునాయక్‌ భార్య రాంబాయి, కుమారుడు జీవన్‌, కుమార్తెలు ఝాన్సీబాయి, జయశ్రీ ఉన్నారు. ఆయన కుమారుడు జీవన్ (ఐఆర్‌ఎస్‌) ముంబై‌లోని ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్‌ కమిషనర్‌గా పని చేస్తున్నాడు.ఆయన కోడలు జీవన్ భార్య శిప్రా శ్రీవాస్తవ్‌ (ఐపీఎస్‌ అధికారి) ముంబయ్‌లోని ఓఎన్‌జీసీ సీనియర్‌ పోలీస్‌ కమాండంట్‌గా పని చేస్తుంది.[2] రాములు నాయక్ పెద్ద కుమార్తె ఝాన్సీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా, రెండో కుమార్తె జయశ్రీ ఆబ్కారీ శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుంది.[3]

రాజకీయ జీవితం

మార్చు

రాములునాయక్‌ పోలీస్‌ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్డ్ అయినా తరువాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్ ఆశించాడు, కానీ ఆ ఎన్నికల్లో మహాకూటమి ఒప్పందంలో భాగంగా వైరా నియోజకవర్గాన్ని సీపీఐ కి కేటాయించడంతో నిరాశ చెందాడు. ఆయన తరువాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. రాములునాయక్‌ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ ఆశించిన మరోసారి పొత్తుల్లో భాగంగా సీపీఐ కె కేటాయించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై 2013 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.[4][5][6] లావుడ్య రాములు నాయక్‌ 15 డిసెంబర్ 2018లో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరాడు.[7][8]

మూలాలు

మార్చు
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. News18 Telugu (27 January 2021). "కోడలికి పోలీస్ మెడల్.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (16 June 2019). "అప్పుడు నా జీతం రూ.147 : ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  4. NDTV (2018). "WYRA Election Result 2018, Winner, WYRA MLA, Telangana" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  5. DNA India (11 December 2018). "Telangana election results: Why Wyra may be Telangana's most dramatic constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  6. Andrajyothy (11 July 2021). "కాంగ్రెస్‌లో వైరాగ్యం." andhrajyothy. Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  7. Sakshi Post (16 December 2018). "Independent MLA Ramulu Naik From Wyra Joins TRS" (in ఇంగ్లీష్). Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.
  8. Mana Telangana (15 December 2018). "గులాబి గూటికి వైరా ఎంఎల్ఏ…". Archived from the original on 14 July 2021. Retrieved 14 July 2021.