లింగమంతుల స్వామి జాతర
విశేషాలు
మార్చునల్లొండ జిల్లా లోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి లో యాదవు ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నల్లొండ జిల్లా దురాజ్ పల్లిలో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.[2]
లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలుపట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఓలింగా... ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు.
లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. ఈ ఉత్సవాలు రెండేళ్లకోసారి జరుగుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతీయేటా సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.
చౌడమ్మ పల్లకిలో..
మార్చుఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు.
ఆదివారం జాతర తొలిరోజు. భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. నేడు రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పించారు. ఇక జంతుబలి ఉండనే ఉంది. జాతరిక జనసంద్రమవుతుంది. ఇక మూడో రోజైన మంగళవారం చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు.
ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉందని కొందరు.. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు మరికొందరు చెప్తుంటారు. దురాజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.
చేరుకోవడం ఇలా...
మార్చుపెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి (65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో ఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం. ప్రత్యేక బస్సులుంటాయి.