లింగమనేని రమేశ్

లింగమనేని రమేశ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త. అతను ఎయిర్ కోస్టాకు చైర్మన్‌గా ఉన్నాడు. 1983లో లింగమనేని ఎస్టేట్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. ఈ సంస్ధ ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.[1][2]

లింగమనేని రమేశ్

జీవిత విశేషాలు మార్చు

అతను విజయవాడలో జన్మించాడు. అతను కామర్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తన 19వ యేట నుండి తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలలో పనిచేసాడు. అతను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ-స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేసాడు[3].

దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం మార్చు

గుంటూరు జిల్లా లోని నంబూరు పంచాయతీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్‌లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ భూ సమేత దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం అతనిచే నిర్మించబడినది. పద్దెనిమిదేళ్ల క్రితం 2000లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అతను స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తున్నప్పుడు అతని మనస్సులో తట్టిన ఆలోచనా ఫలితం ఈ ఆలయ నిర్మాణం. 2012లో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి అంతర్భాగంలో, బెజవాడ దుర్గమ్మకు సమీపంలో ఆలయాన్ని నిర్మించారు.[4]

మూలాలు మార్చు

  1. "Story of rise and rise of the Lingamaneni group".
  2. "చంద్రబాబు అధికారిక నివాసం: ఎవరీ లింగమనేని?".
  3. "Ramesh Lingamaneni".[permanent dead link]
  4. "18ఏళ్ల కల నేటికి సాకారం - ఆలయ నిర్మాణకర్త లింగమనేని రమేశ్‌".[permanent dead link]

బయటి లంకెలు మార్చు