లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (2015 సినిమా)
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 2015లో వచ్చిన సైబర్ క్రైమ్ కామెడీ సినిమా. ఈ సినిమాలో అడవి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ బేసిన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈసినిమాకి పి.బి.మంజునాథ్[1] దర్శకత్వం వహించగా, మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించాడు. 2015 జనవరి 30న 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' విడులైంది.[2]
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ | |
---|---|
దర్శకత్వం | పిబి మంజునాథ్ |
స్క్రీన్ ప్లే | పిబి మంజునాథ్ |
కథ | సంజీవ్ రెడ్డి |
నిర్మాత | మధుర శ్రీధర్ రెడ్డి ఎంవికె రెడ్డి |
తారాగణం | అడివి శేష్, మహాత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, స్వాతి దీక్షిత్, నిఖిత నారాయణ్, జాస్మిన్ భాసిన్ |
ఛాయాగ్రహణం | జగన్ చావాలి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | రఘు కుంచె |
నిర్మాణ సంస్థలు | పి.ఎల్ క్రియేషన్స్ షిర్డీ సాయి కంబైన్స్ |
విడుదల తేదీ | 30 జనవరి 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ సినిమా కథ ముగ్గురు విభిన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.డబ్బంటే పిచ్చి ఉన్న విజయ్(మహాత్ రాఘవేంద్ర) బ్లాక్ మనీ కోసం సోషల్ నెట్వర్క్స్ ని ఎలా వాడి ఇబ్బందుల్లో పడ్డాడన్నది అతని కథ. ఇక కృష్ణ మూర్తి(చైతన్య కృష్ణ)కి అమ్మాయిలంటే అమితమైన పిచ్చి. అలాంటి కృష్ణ మూర్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయి ద్వారా కృష్ణ మూర్తి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఇక చివరి కథ ఆనంద్ (కమల్ కామరాజు) – ప్రియ (నిఖిత నారాయణ్) లది.. ఆనంద్ తన బిజీ లైఫ్ లో వైఫ్ కి సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోతే దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.? వీరిద్దరి మధ్యలోకి అడవి శేష్ ఎలా వచ్చాడు.? ఇలా ముగ్గురు విషయాల్లో చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
నటీనటులు\ సినిమాలో పాత్ర పేరు
మార్చు- అడివి శేష్ - రాహుల్
- నికితా నారయణ్ - ప్రియా
- చైతన్య కృష్ణ - కృష్ణమూర్తి
- కమల్ కామరాజు - ఆనంద్
- మహాత్ రాఘవేంద్ర - విజయ్
- స్వాతి దీక్షిత్ - దీపా
- జాస్మిన్ భాసిన్ - అంజలి
- లోహిత్ కుమార్
మూలాలు
మార్చు- ↑ http://www.thehindu.com/features/cinema/writer-manjunath-makes-his-directorial-debut-with-ladies-and-gentlemen/article6830481.ece
- ↑ Teluguwishesh (9 May 2015). "Ladies and Gentlemen | 100 days | Movie news". Archived from the original on 23 ఏప్రిల్ 2021. Retrieved 23 April 2021.