లైయర్స్ డైస్
లైయర్స్ డైస్, 2013 అక్టోబరు 5న విడుదలైన హిందీ సినిమా.[1] జార్ పిక్చర్స్ బ్యానరులో అలాన్ మెక్‌అలెక్స్, అజయ్ రాయ్ నిర్మించిన ఈ సినిమాకు గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. ఇందులో గీతాంజలి థప, నవాజుద్దీన్ సిద్ధికి ముఖ్యపాత్రల్లో నటించారు. ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక యువ తల్లి, తప్పిపోయిన తన భర్తను వెతుకుతూ, తనను తాను కోల్పోయిన నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది.
లైయర్స్ డైస్ | |
---|---|
దర్శకత్వం | గీతా మోహన్ దాస్ |
రచన | గీతా మోహన్ దాస్ |
నిర్మాత | అలాన్ మెక్‌అలెక్స్ అజయ్ రాయ్ |
తారాగణం | గీతాంజలి థప నవాజుద్దీన్ సిద్ధికి |
ఛాయాగ్రహణం | రాజీవ్ రవి |
కూర్పు | బి. అజిత్‌కుమార్ |
సంగీతం | జాన్ బోస్టర్స్ |
నిర్మాణ సంస్థ | జార్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 2013, అక్టోబరు 5 (ముంబై ఫిలిం ఫెస్టివల్) 2014, జనవరి 16 (సన్డాన్స్ ఫిలిం ఫెస్టివల్) |
సినిమా నిడివి | 104 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
2008లో తీసిన కెల్కుందో అనే షార్ట్ ఫిల్మ్ కు ప్రశంసలు వచ్చిన తరువాత, గీతా మోహన్ దాస్ తీసిన మొదటి సినిమా ఇది.[2] 2013, అక్టోబరులో ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శన జరిగి, భారతీయ పోటీ విభాగంలో పాల్గొంది.[3] 2014, జనవరిలో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్‌లో ప్రదర్శించబడింది.[4] సోఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు వచ్చింది.[5][6]
61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ నటి (గీతాంజలి థప), జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ (రాజీవ్ రవి) విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 87వ అకాడమీ అవార్డులలో భారతదేశం తరపున అధికారికంగా పంపబడింది, కానీ అందులో నామినేట్ కాలేదు.[7][8] 2014లో వచ్చిన హ్యాపీ జర్నీ వంటి సినిమాలకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ అజయ్ శర్మ, మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నాడు.
నటవర్గం
మార్చు- నవాజుద్దీన్ సిద్ధికి (నవాజుద్ధీన్)
- గీతాంజలి థప (కమల)
- మన్య గుప్త (మన్య)
- విక్రమ్ భాగ్రా (హోటల్ యజమాని)
- మురారి కుమార్ (హోటల్ బాయ్)
నిర్మాణం
మార్చు2012 మార్చిలో తక్కువ మందితో తక్కువ బడ్జెట్‌లో సినిమా షూటింగ్ జరిగింది.[3] సిమ్లా సమీపంలో కిన్నౌర్ జిల్లాలోని చిట్కుల్ గ్రామంలోనూ, ఢిల్లీలోని జామా మసీదుతో సహా వివిధ ప్రాంతాలలో ఈ సినిమా తీశారు.[9][10] సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి (మోహన్ దాస్ భర్త) గతంలో దేవ్.డి (2009), గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ (2012) వంటి సినిమాలకు పనిచేశాడు.[4]
స్పందన
మార్చు"నిశ్శబ్దంగా వచ్చిన ప్రభావవంతమైన తొలి సినిమా ఇది" అని వెరైటీ మ్యాగజైన్ పేర్కొన్నది.[2]
అవార్డులు
మార్చు- 61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[11][12]
- ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు - గీతాంజలి థప
- ఉత్తమ సినిమాటోగ్రఫీకి జాతీయ ఫిల్మ్ అవార్డు - రాజీవ్ రవి
- సోఫియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2014
- ప్రత్యేక జ్యూరీ అవార్డు[13]
- న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2014
- పెసారో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2014
- ఉత్తమ చిత్రంగా లినో మిక్కీ అవార్డు[16]
- గ్రెనడా సినీ డెల్ సుర్ ఫిల్మ్ ఫెస్టివల్
- కాంస్య అల్హాంబ్రా అవార్డు[17]
మూలాలు
మార్చు- ↑ "Nawazuddin's Liar's Dice in Sundance Film Festival - Starblockbuster". Archived from the original on 2018-08-14. Retrieved 2021-08-01.
- ↑ 2.0 2.1 Dennis Harvey (18 January 2014). "'Liar's Dice' Review: Geeta Mohandas' Quietly Effective Debut". Variety. Retrieved 2021-08-01.
- ↑ 3.0 3.1 "Mumbai Film Festival Preview: Liar's Dice". Livemint. 5 October 2013. Retrieved 2021-08-01.
- ↑ 4.0 4.1 "Sundance selection has changed everything for me". Rediff.com Movies. 21 January 2014. Retrieved 2021-08-01.
- ↑ "Liar's Dice wins Special Jury award at Sofia International Film Festival". DearCinema.com. Archived from the original on 21 March 2014.
- ↑ "Top 10 small-budget independent films set to release in 2015". mid-day. 9 January 2015.
- ↑ "Geethu Mohandas' 'Liar's Dice' is India's official entry to the Oscars". CNN-IBN. 23 September 2014. Archived from the original on 24 September 2014. Retrieved 2021-08-01.
- ↑ "Oscars: India Selects 'Liar's Dice' for Foreign-Language Category". Hollywood Reporter. Retrieved 2021-08-01.
- ↑ "Liar's Dice (2014)". IMDb.
- ↑ "Liar's Dice being Geethu's film made no difference to me: Rajeev Ravi". The Times of India. 18 April 2014. Retrieved 2021-08-01.
- ↑ "61st National Film Awards Announced: Live Update". Zee News. Retrieved 2021-08-01.
- ↑ "61st National Film Awards For 2013" (PDF). Directorate of Film Festivals. 16 April 2014. Archived from the original (PDF) on 16 April 2014. Retrieved 2021-08-01.
- ↑ "Международен София Филм Фест 7-17-28 Март, 2019". SIFF. Archived from the original on 30 September 2015. Retrieved 2021-08-01.
- ↑ "Awards - New York Indian Film Festival 2014". IAAC. Archived from the original on 2015-03-24. Retrieved 2021-08-01.
- ↑ "Liar's Dice named Best Film at New York Indian Film Festival". Dear Cinema. 12 May 2014. Archived from the original on 14 May 2014. Retrieved 2021-08-01.
- ↑ "Liar's Dice wins Micciche". Times of India. 3 July 2014. Retrieved 2021-08-01.
- ↑ "Consejería de Cultura - Junta de Andalucía". 8 June 2014. Retrieved 2014-06-08.