చాంద్రమాన కేలండర్
చాంద్రమాన కేలండర్ (ఆంగ్లం : Lunar calendar) ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూర్యమాన కేలండర్ కంటే ఈ కేలండర్ లో 11 రోజులు (లీపు సంవత్సరంలో 12 రోజులు) తక్కువ. సూర్యమాన, చాంద్రమాన కేలండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకొకసారి వస్తాయి. ఈ కేలండర్ ప్రత్యేకంగా ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వాణిజ్యావసరాలకునూ ఈ కేలండర్ ను ఉపయోగిస్తున్నారు.
హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్రమాన విధముగానే వుంచి చంద్రగమన చక్రాలను లెక్కిస్తారు, తరువాత అంతర్-నెలలను కొలిచి, సూర్యమాన సంవత్సరంతో మమేకం చేస్తారు.
ఎందుకనగా, ఒక సూర్యమాన సంవత్సరంలో 12 చంద్రమాన నెలలు (synodic months) వుంటాయి, దీనినే సాంప్రదాయికంగా చంద్రమాన సంవత్సరం అని అంటారు. దీనిలో 354.37 దినములు వుంటాయి.
ఇవీ చూడండి
మార్చు- పట్టికరూప ఇస్లామీయ కేలండర్
- కంప్యూటస్
- సెక్టిక్ కేలండర్
- న్యూ ఎరా
- ఇపాక్ట్ - (చాంద్రమాన-సూర్యమాన సంవత్సరాల మధ్య తేడాల విషయాలు)
- జోస్ ఆర్గుల్లెస్
- హార్మోనిక్ కన్వర్జెన్స్
- సూర్యుడు
- చంద్రుడు
- భూమి
- గ్రహాలు