ఇస్లామీయ కేలండర్

ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు, దాదాపు 354 దినాలు గలవు.

కేలండర్
(జాబితా)
విశాల వాడుక అంతరిక్ష · గ్రెగోరియన్ కేలండర్ · ISO
కేలండర్ రకాలు
చాంద్ర-సూర్యమాన · సూర్యమాన · చాంద్రమాన కేలండర్

ఎంపిక చేయబడి వాడుక అసిరియన్ · ఆర్మీనియన్ · అట్టిక్ · అజ్‌టెక్ (తొనాల్‌పొహుల్లిజియుపొహుఅల్లి) · బాబిలోనియన్ · బహాయి · బెంగాలీ · బెర్బెర్ · బిక్రంసంవాత్ · బౌద్ధుల · బర్మీస్ · సెల్టిక్ · చైనీస్ · కాప్టిక్ · ఈజిప్టియన్ · ఇథియోపియన్ · కేలండ్రియర్ రీపబ్లికన్ · జర్మనిక్ · హెబ్ర్యూ · హెల్లెనిక్ · హిందూ కేలండర్ · భారతీయ · ఇరానియన్ · ఐరిష్ · ఇస్లామీయ కేలండర్ · జపనీస్ · జావనీస్ · జుచే · జూలియన్ · కొరియన్ · లిథువేనియన్ · మలయాళం · మాయ (జోల్కిన్హాబ్) · మింగువో · నానక్‌షాహి · నేపాల్ సంబత్ · పవుకోన్ · పెంటెకోంటాడ్ · రపా నుయి · రోమన్ · రూమి · సోవియట్ · తమిళ · తెలుగు కేలండర్ · థాయి (చంద్రమానసూర్యమాన) · టిబెటన్ · వియత్నామీస్· జోసా · జొరాస్ట్రియన్
కేలండర్ రకాలు
రునిక్ · మిసోఅమెరికన్ (లాంగ్ కౌంట్కేలండర్ రౌండ్)
క్రిస్టియన్ వేరియంట్లు
జూలియన్ · సెయింట్స్ · ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటర్జికల్ · లిటర్జికల్
అరుదుగా వాడుక డేరియన్ · డిస్కార్డియన్
ప్రదర్శనా రకాలు, వాడుక అనంత కేలండర్ · గోడ కేలండర్ · ఆర్థిక కేలండర్
వ్యాసముల క్రమము

Allah1.png

ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

హిజ్రీ శకంసవరించు

"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.

వలస జరిగిన క్రమంసవరించు

  • దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, 9 సెప్టెంబరు 622
    • మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని తూర్ గుహలో మూడు రోజులు గడిపారు.
  • దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 13 సెప్టెంబరు 622
    • మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
  • దినము 12: సోమవారం 8 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 20 సెప్టెంబరు 622
    • మదీనా దగ్గరలోని "ఖుబా" ప్రాంతానికి చేరుక.
  • దినము 16: శుక్రవారం 12 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 24 సెప్టెంబరు 622
    • ఖుబా నుండి మదీనా ప్రయాణం, శుక్రవారపు ప్రార్థనలు.
  • దినము 26: సోమవారం 22 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 4 అక్టోబరు 622
    • మదీనా మొదటి దర్శనం

హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.

ఇస్లామీయ మాసాలుసవరించు

1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)

2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)

3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول

4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني

5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول

6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني

7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)

8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)

9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)

10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)

11. జుల్-ఖాదా: ذو القعدة

12. జుల్-హిజ్జా: ذو الحجة

వారములోని దినాలుసవరించు

ఇస్లామీయ వారము తెలుగువారములానేవుంటుంది. వారములోని మొదటిదినము ఆదివారము 'ఇత్వార్' తో ప్రారంభము అవుతుంది. ముస్లింలకు పవిత్రదినం శుక్రవారము. శుక్రవారము ముస్లింలు 'జుమా' ప్రార్థనలకు హాజరవుతారు. "يوم" (యౌమ్) అనగా దినము.

తెలుగు లిప్యాంతరీకరణ
అరబ్బీ పేరు
తెలుగు పేరు
ఉర్దూ పేరు
పర్షియన్ పేరు
యౌమ్ అల్-అహద్ يوم الأحد (మొదటి దినము - ఆదివారము) ఇత్వార్ اتوار ఎక్-షుంబా یکشنبه
యౌమ్ అల్-ఇస్నైన్ يوم الإثنين (రెండవ దినము - సోమవారము) పీర్ پير దో-షుంబా, دوشنبه
యౌమ్ అల్-సలాస يوم الثُّلَاثاء (మూడవ దినము - మంగళవారము) మంగల్ منگل సెహ్-షుంబా, سه شنبه
యౌమ్ అల్-అర్బియా يوم الأَرْبِعاء (నాలుగవ దినము - బుధవారము) బుధ్ بدھ చహార్-షుంబా, چهارشنبه
యౌమ్ అల్-ఖమిస్ يوم الخَمِيس (ఐదవ దినము - గురువారము) జుమేరాత్ جمعرات పంజ్-షుంబా, پنجشنبه
యౌమ్ అల్-జుమా يوم الجُمُعَة (ఆరవదినము - శుక్రవారము) జుమా جمعہ జుమా, جمعه లేదా ఆదీన آدينه
యౌమ్ అల్-సబ్త్ (సబత్) يوم السَّبْت (ఏడవ దినము - శనివారము) హఫ్తా ہفتہ షుంబా లేక షంబా, شنبه


ఇవీ చూడండిసవరించు