వంగలపూడి శివకృష్ణ

వంగలపూడి శివకృష్ణ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన కవి, రచయిత,, చరిత్ర పరిశోధకుడు.

వంగలపూడి శివకృష్ణ
జననంఏప్రిల్ 22, 1986
పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్)
నివాస ప్రాంతంపెద్దాపురం
వృత్తిన్యూ పోర్ట్, కాకినాడలో చిరుద్యోగి
ప్రసిద్ధిసాహితీ స్రవంతి పెద్దాపురం కోశాధికారి,
భార్య / భర్తసిద్ధపురెడ్డి చక్రవేణి
పిల్లలురిత్విక్ సూర్య వర్ధన్, మహాన్ష్
తండ్రిసూర్యనారాయణ
తల్లికుమారి

చారిత్రక పరిశోధకుడిగా పేరు పొందిన వంగలపూడి శివకృష్ణ గారు కేవలం పరిశోధకుడిగానే కాక కవిగా, రచయితగా, సామాజిక సేవకుడిగా, సాహితీ స్రవంతి పెద్దాపురం శాఖ కోశాధికారిగా, జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడిగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిగా పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజలకి సుపరిచితుడు.

జీవిత విశేషాలు

మార్చు

వంగలపూడి శివకృష్ణ వంగలపూడి సూర్యనారాయణ, కుమారి దంపతులకు 1986 ఏప్రిల్ 22 న పిఠాపురం క్రిష్టియన్ మెడికల్ సెంటర్ లో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అంబేద్కర్ పురపాలక సంఘ పాఠశాలలోనూ, ఉన్నత విద్య జవహర్ లాల్ నెహ్రూ పురపాలక సంఘ పాఠశాలలోనూ, కళాశాల విద్య మహారాణి కళాశాలలోనూ, ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎమ్.బి, ఏ ఫైనాన్స్ పూర్తి చేసారు. కొంతకాలం బెంగళూరు, తిరువళ్ళూరు, హైదరాబాద్ లలో అకౌంటెంట్ గా పనిచేసి, పెంచి పోషించిన ఊరిపై మమకారంతో పెద్దాపురం వచ్చి సుదీర్ఘ కాలం పాటు పెద్దాపురం చరిత్ర పరిశోధన చేసి చారిత్రక పెద్దాపురం కథలు గాథలు అనే పుస్తకం వెలువరించారు. ప్రస్తుతం సాహితీ స్రవంతి పెద్దాపురం శాఖ కోశాధికారిగా ఉంటూ పెద్దాపురంలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దాపురంలో ఏనుగు లక్ష్మణకవి విగ్రహావిష్కరణకి కృషి చేసారు.

ప్రసిద్ధ పద్యాలు

మార్చు

పెద్దాపురం పట్టణం పేరు ఏర్పడడానికి మూలకారకుడైన పెద్దాపాత్రుడు గురించిన పద్యం.[1]

పద్దెనిమిది పరగణముల్

హద్దులు కిమ్మిరుని సీమ నడవులు మిట్టల్

పెద్దాపాత్రుండమరిచె

పెద్దాపురరాజ్యసిరులు పెంపెక్కువిధిన్

తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే పద్యం

తెలుగది క్షీరపయోనిధి

జిలుగది జనయిత్రి ధాత్రి జేజేలిడగన్

పలుకది తేనెలొలుకునది

వెలుగది వజ్రమకుటమది విజ్ఞులుమెచ్చన్

కరోనా వైరస్ 2019 ఉధృతంగా ఉన్న రోజుల్లో విస్తృతంగా ప్రచారమైన పద్యం

కరుణ యొకింతయుఁజూపక

కరొనా తానిటకుజొచ్చె కర్మఫలముగన్

నిరతము భయపూరితమీ

నరకము తప్పించి గాచు నరులను కృష్ణా

రచనలు

మార్చు
  1. చారిత్రక పెద్దాపురం కథలు గాథలు[2]
  2. ఓటు వదులుకోకు[3]
  3. కళల స్థావరం పెద్దాపురం[4]
  4. హోళీ నీలో నాలో[5]
  5. మాతృభాష[6]
  6. యుద్ధార్థి

అముద్రితాలు

  1. పెద్దాపురం పద్య రత్నాకరం
  2. ద్వారబంధాల చంద్రయ్య చరిత్ర
  3. చామర్లకోట చరిత్ర

మూలాలు

మార్చు
  1. "కళాఖండం చరితకు రూపం". EENADU. Retrieved 2023-03-04.
  2. [అంధ్రప్రభ మెయిన్ సాహితీ గవాక్షంలో 17 జనవరి 2022, https://prajasakti.com/sathaaanaika-caraitaralau-garamthasatham-kaaavaaalai Archived 2023-03-05 at the Wayback Machine ప్రజాశక్తి దినపత్రిక మెయిన్ అక్షరం లో సమీక్ష ఫిబ్రవరి 14 2022, నవమల్లెతీగ మే 2022 మాసపత్రికలో సమీక్ష, నేటి నిజం లో సమీక్ష 27 అక్టోబర్ 2022]
  3. [ఈనాడు దినపత్రిక 16 మార్చి 2019 లో ఆర్టికల్]
  4. [ప్రజాశక్తి దినపత్రిక 18 మే 2016 ఆర్టికల్]
  5. [ప్రజాశక్తి దినపత్రిక 10 మార్చి 2020 ఆర్టికల్]
  6. [ప్రజాశక్తి దినపత్రిక 21 ఫిబ్రవరి 2020 ఆర్టికల్]

బాహ్య లంకెలు

మార్చు

https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/green-group-distributes-rice-toys-and-chocolates-in-exchange-for-plastic/articleshow/72213447.cms

https://www.bbc.com/telugu/india-62505677

https://www.eenadu.net/telugu-news/districts/East-Godavari-news/3/124052722