వందవాసి
వందవాసి (బ్రిటిషు వారు వండివాష్ అనేవారు[2]) తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలో ఒక ప్రధానమైన పట్టణం, మునిసిపాలిటీ.[3] ఈ పట్టణం కర్ణాటక (కర్ణాటిక్) చరిత్రలో వండివాష్ యుద్ధానికి ప్రసిద్ధి చెందింది. వందవాసి పట్టణంలో చాపలు, శాలువాలు, పాత్రలతో సహా కోరా హస్తకృతులు పెద్దయెత్తున తయారవుతాయి. 2011 నాటికి, పట్టణ జనాభా 74,320.
వందవాసి | |
---|---|
పట్టణం | |
Coordinates: 12°30′N 79°37′E / 12.5°N 79.62°E | |
దేశం | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | తిరువణ్ణామలై |
Elevation | 74 మీ (243 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 74,320 |
భాషలు | |
• అధికారిక | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 604408 |
దక్షిణాసియాపై నియంత్రణ కోసం ఫ్రాన్స్, బ్రిటిషు సామ్రాజ్యాల మధ్య 18వ శతాబ్దపు కర్నాటిక్ యుద్ధాలలో వండివాష్ వద్ద నిర్ణయాత్మక యుద్ధం జరిగింది. వండివాష్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసినందున భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. 1760 జనవరి 22 న, ఐర్ కూట్ నేతృత్వంలోని బ్రిటిషు సైన్యం జనరల్ థామస్ లాలీ నేతృత్వంలోని ఫ్రెంచి దళాన్ని ఓడించింది.[4]
భౌగోళికం, వాతావరణం
మార్చువందవాసి, తిండివనం - ఆర్కాట్‌లను కలిపే SH5 రాష్ట్ర రహదారిపై ఉంది. ఇది రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతి దిశలో 110 కి.మీ., కాంచీపురం నగరానికి దక్షిణంగా 40 కి.మీ., తిరువణ్ణామలైకి ఈశాన్యంగా 80 కి.మీ., అరణికి ఆగ్నేయంగా 42 కి.మీ, వేలూరు నుండి 80 కి.మీ దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 74 మీటర్లు (242 అడుగులు) ఎత్తున ఉంది. వందవాసి వాతావరణ పరిస్థితి చెన్నై మాదిరిగానే ఉంటుంది, ఇది ఉష్ణ భూమధ్యరేఖపై తీరానికి దగ్గరగా ఉంటుంది. సంవత్సరంలో ఎక్కువ భాగం వాతావరణం వేడిగా, తేమగా ఉంటుంది.[5]
జనాభా వివరాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, వందవాసి జనాభా 74,320. ప్రతి 1,000 మంది పురుషులకు 1,012 మంది స్త్రీలున్నారు. జాతీయ సగటైన 1,000 మంది పురుషులకు 929 మంది మహిళలు కంటే ఇది చాలా ఎక్కువ.[6] ఆరేళ్లలోపు పిల్లలు మొత్తం 3,337 మంది ఉండగా, ఇందులో 1,740 మంది బాలురు, 1,597 మంది బాలికలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 13.54%, 1.31% ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 77.3%, జాతీయ సగటు 72.99%తో పోలిస్తే ఇది ఎక్కువ.[6] పట్టణంలో మొత్తం 7326 గృహాలు ఉన్నాయి. 10,553 మంది కార్మికులు ఉండగా, వీరిలో 152 మంది రైతులు, 302 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 309 గృహ పరిశ్రమలు, 9,093 మంది ఇతర కార్మికులు, 697 సన్నకారు కార్మికులు, 8 సన్నకారు రైతులు, 27 మంది ఉపాంత వ్యవసాయ కార్మికులు, 52 మంది ఉపాంత కార్మికులు ఉన్నారు.[7] 2011 మతపరమైన జనాభా లెక్కల ప్రకారం, వందవాసి జనాభాలో 60.86% హిందువులు, 34.73% ముస్లింలు, 3.03% క్రైస్తవులు, 1.28% జైనులు, 0.02% సిక్కులు, 0% బౌద్ధులు, 0.08% ఇతర మతాలను అనుసరించేవారు ఉన్నారు.[8]
ఆసక్తికరమైన ప్రదేశాలు
మార్చువందవాసి కోట ఇక్కడ జరిగిన నిర్ణయాత్మకమైన వండివాష్ యుద్ధానికి సాక్షి. ఇది వందవాసిలో ఒక ముఖ్యమైన మైలురాయి. మద్రాసు నగరాన్ని నిర్మించడం కోసం బ్రిటిషు వారికి చంద్రగిరి ప్రభువు నుండి భూమిని మంజూరు చేయించడంలో విజయనగర సామంతుడైన వందవాసి నాయకుడు కీలకపాత్ర పోషించాడు.
అరహంత్‌గిరి జైన మఠం 1998 ఆగస్టులో తిరువణ్ణామలైలోని పురాతన జైన ప్రదేశంలో స్థాపించబడిన జైన మఠం.[9] ఈ సముదాయంలో 3 జైన గుహలు, 4 జైన దేవాలయాలు, 12 వ శతాబ్దానికి చెందిన నేమినాథుని 16 మీటర్ల ఎత్తైన శిల్పం ఉన్నాయి. ఇది తమిళనాడులోకెల్లా ఎత్తైన జైన విగ్రహం. వెంగుండ్రం కొండపై ఉన్న శ్రీ థవళగిరీశ్వర ఆలయం ఇక్కడి గుర్తించదగిన ఆలయం.
రాజకీయం
మార్చు2009 లో డీలిమిటేషన్ జరిగే వరకు వందవాసి లోక్‌సభ నియోజకవర్గం ఉండేది. ఇది ఇప్పుడు వందవాసి రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం, అరణి లోక్‌సభ నియోజకవర్గాలలో భాగంగా ఉంది.[10]
ఇవి కూడా చూడండి
మార్చు- కందియనల్లూరు
సూచనలు
మార్చు- ↑ "Census of India: Search Details". censusindia.gov.in. Retrieved 2014-07-12.
- ↑ Subburaj, V. (December 2006). Tourist Guide to Chennai (in ఇంగ్లీష్). Sura Books. p. 17. ISBN 978-81-7478-040-9. Retrieved 21 March 2024.
- ↑ N, Shyamsundar (7 April 2023). "State archaeology department begins excavation of 'stone circles' at Kilnamandi village in TN". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 21 March 2024.
- ↑ Chisholm, Hugh, ed. (1911). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press. .
- ↑ "About city". Vandavasi Municipality. 2011. Archived from the original on 2008-04-05. Retrieved 2013-07-07.
- ↑ 6.0 6.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 2014-01-26.
- ↑ "Census Info 2011 Final population totals - Vandavasi". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 2014-01-26.
- ↑ "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
- ↑ "Arihantagiri - Tirumalai". Archived from the original on 2012-11-07. Retrieved 2012-04-10.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-08.