వందేమాతరం (1985 సినిమా)
వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమా పేరుతో వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.[1]
వందేమాతరం (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. కృష్ణ |
---|---|
తారాగణం | రాజశేఖర్, విజయశాంతి , రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
భాష | తెలుగు |
1985 వసంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
కథ
మార్చుఅభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.
తారాగణం
మార్చుపాటలు
మార్చు- ఆకాశమా, నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ?
- వందేమాతరం, వందేమాతరం, వందేమాతరగీతం వరుస మారుతున్నది
మూలాలు
మార్చు- ↑ ఎం. ఎల్, నరసింహం. "'Vandemataram', the song that became a surname for singer Srinivas". thehindu.com. Retrieved 29 December 2017.