వంశీకృష్ణ శ్రీనివాస

చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

వంశీకృష్ణ శ్రీనివాస్‌

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం
నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 5 ఫిబ్రవరి 1974
విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి పద్మజ
సంతానం సాయిసందీప్, లహరిప్రవల్లిక

జననం, విద్యాభాస్యంసవరించు

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 5 ఫిబ్రవరి 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన ఎంఏ వరకు చదువుకున్నాడు.[1]

రాజకీయ జీవితంసవరించు

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి, 2011లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేశాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన తరువాత పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా నియమితుడై పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 2019లో టికెట్ దక్కలేదు. ఆయన 2021లో మహా విశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచాడు. ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 12 నవంబర్ 2021న వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రకటించింది. ఆయన 21 నవంబర్ 2021న నామినేషన్ దాఖలు చేశాడు.[2]

వంశీకృష్ణ శ్రీనివాస్‌ 27 నవంబర్ 2021న ఏకగ్రీవంగా ఎన్నికై[3], 8 డిసెంబర్ 2021న శాసనమండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4]

మూలాలుసవరించు

  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Andhrajyothy (21 November 2021). "ఎమ్మెల్సీ పదవులకు వంశీకృష్ణ, కళ్యాణి నామినేషన్‌". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Prajasakti (27 November 2021). "'స్థానిక' ఎమ్మెల్సీలుగా వంశీకృష్ణ, కల్యాణి ఏకగ్రీవం | Prajasakti". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.