వజీర్ సుల్తాన్ టొబాకో క్రికెట్ జట్లు
వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI, వజీర్ సుల్తాన్ టోబాకో XI అనేవి 1960 - 1970లలో మోయిన్ - ఉద్ - దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్లో పాల్గొన్న రెండు మొదటి తరగతి క్రికెట్ ఆడిన జట్లు. వీటిని వజీర్ సుల్తాన్ టొబకో అనే భారతీయ కంపెనీ స్పాన్సర్ చేసింది.
వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI
మార్చు1966 - 67లో వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI జట్టు లో నే సునీల్ గవాస్కర్ 17 సంవత్సరాల వయస్సులో మొదటి తరగతి క్రికెట్ ప్రారంభించాడు. ఈ జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారని అతను గుర్తు చేసుకున్నారు[1]. వారు పాఠశాల, అంతర విశ్వవిద్యాలయ స్థాయిలో బాగా రాణిస్తున్నారు, వీరు భారత దేశపు మొదటి తరగతి క్రికెట్ లో తమధైన ముద్ర వేశారు.[2]
ఈ జట్టు 1964 - 65లో నవాబు పటౌడీ టెస్ట్ కెప్టెన్గా ఉన్నప్పుడు తమ తొలి మ్యాచ్ ఆడింది. 1965 - 66,1966 - 67 సంవత్సరాల్లో కూడా అతను ఈ జట్టుకు నాయకత్వం వహించాడు, ఆ సమయంలో జట్టు ప్రతి సారి ఒక మ్యాచ్ ఆడింది. మ్యాచ్ కి ఒకటిగా పటౌడీ మూడు శతకాలు సాధించాడు. 1964 - 65లో రామ్‌నాథ్ పార్కర్, 1965 - 66లో ఏక్నాథ్ సోల్కర్ మొదటి తరగతి క్రికెట్ లో ఆడడం మొదలుపెట్టారు. 1966 - 67లో మొహిందర్ అమర్ నాధ్, 16వ ఏట గవాస్కర్తో కలిసి మొదటి తరగతి క్రికెట్ తొలిసారిగా ఆడాడు. వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం లభించినా మిగిలిన మూడు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
1967- 68లో అంబర్ రాయ్ వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI, జట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ XI జట్టును , హైదరాబాద్ బ్లూ స్ జట్టును ఓడించి సెమీఫైనల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఆడి 57/7 స్కోర్ చేసింది. [3] 1968- 69లో వారు మళ్లీ సెమీఫైనల్ చేరుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఓడిపోయారు - ఈ జట్టులో దిలీప్ దోషి కూడా ఉన్నాడు.[4]
1969 - 70లో తొమ్మిది మంది మొదటి తరగతి క్రికెట్ ఆరంభించిన జట్టుకు శ్రీనివాసరాఘవన్ నాయకత్వం వహించాడు. [5] 18 ఏళ్ల భరత్ రెడ్డి మొదటిసారిగా మ్యాచ్ లో 1973 - 74లో పది మంది మొదటి తరగతి తొలి ఆటగాళ్ల జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే , రెడ్డి తప్ప ఈ తొలి ఆటగాళ్లలో ఎవరూ టెస్ట్ క్రికెట్ కొనసాగించలేదు.[6]
మొత్తం మీద వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI 10 మొదటి తరగతి మ్యాచ్ లు ఆడింది , రెండు గెలిచింది , రెండు ఓడిపోయింది, ఆరు డ్రా అయ్యాయి.
వజీర్ సుల్తాన్ టొబాకో XI
మార్చు1970 - 71లో వజీర్ సుల్తాన్ టొబాకో XI తమ మొదటి మ్యాచ్ ల ను ఆడినప్పుడు కోల్ట్స్ XI యువతకు ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా, వారి జట్టులో ఏడుగురు టెస్ట్ ఆటగాళ్ళు ముప్ఫైల చివరిలో ఉన్నారు, వీరిలో సలీం దుర్రాని, విజయ్ మంజ్రేకర్, చందు బోర్డే లు ఉన్నారు. [7] 1971- 72లో వెంకటరాఘవన్ నాయకత్వంలో ఎంపిక విధానం కొద్దిగా మారింది. ముగ్గురు ఆటగాళ్లు కొత్తగా మొదటి తరగతి క్రికెట్లోకి అడుగుపెట్టారు.
తమ మొదటి మ్యాచ్ ను మఫతలాల్ స్పోర్ట్స్ క్లబ్తో గెలిచారు [8] అయితే 1970 - 71, 1972 - 73 సంవత్సరాల మధ్య వారి ఇతర నాలుగు మ్యాచ్ లు డ్రా అయ్యాయి.
ఇతర జట్లు
మార్చువజీర్ సుల్తాన్ టొబాకో సంస్థ కొన్నిసార్లు మొయిన్ - ఉద్ - దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్లో జట్లను స్పాన్సర్ చేసింది. ఎందుకంటే ఈ టోర్నమెంట్ 1973 - 74 సీజన్ తరువాత మొదటి తరగతి హోదాను కోల్పోయింది, ఇంకా ఇతర పోటీలలో కూడా ఓడిపోయింది.
సూచనలు
మార్చు- ↑ Dungarpur XI v Vazir Sultan Tobacco Colts XI 1966-67
- ↑ Sunil Gavaskar, M.A.K. Pataudi Lecture 2013 Archived 2016-03-04 at the Wayback Machine Retrieved 16 March 2014.
- ↑ State Bank of India v Vazir Sultan Tobacco Colts XI 1967-68
- ↑ State Bank of India v Vazir Sultan Tobacco Colts XI 1968-69
- ↑ R.K. Mody's XI v Vazir Sultan Tobacco Colts XI 1969-70
- ↑ Hyderabad Cricket Association XI v Vazir Sultan Tobacco Colts XI 1973-74
- ↑ R.K. Mody's XI v Vazir Sultan Tobacco XI 1971-72
- ↑ Mafatlal Sports Club v Vazir Sultan Tobacco XI 1970-71