భరత్ రెడ్డి (క్రికెటర్)

భరత్ రెడ్డి (జననం 1954 నవంబరు 12) మాజీ భారత అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు.[1] 1954 నవంబరు 12న చెన్నైలో జన్మించిన భరత్ రెడ్డి, 4 టెస్టులు, 3 వన్‌డేలలో భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా ఆడాడు.

భరత్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1954-11-12) 1954 నవంబరు 12 (వయసు 69)
చెన్నై
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 144)1979 జూలై 12 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1979 ఆగస్టు 30 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 27)1978 జనవరి 3 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే1981 జనవరి 18 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 4 3 95 18
చేసిన పరుగులు 38 11 1,743 120
బ్యాటింగు సగటు 9.50 17.78 17.14
100లు/50లు 0/0 0/0 0/9 0/0
అత్యుత్తమ స్కోరు 21 8* 88 36
క్యాచ్‌లు/స్టంపింగులు 9/2 2/0 171/50 10/2
మూలం: Cricinfo, 2020 మే 10

క్రికెట్ కెరీర్

మార్చు

ఇంగ్లాండ్ పర్యటన

మార్చు

రెడ్డి 1973 జూలై, ఆగస్టు లలో ఇండియన్ స్కూల్స్ XIతో కలిసి ఇంగ్లండ్‌లో పర్యటించాడు. మిడ్‌ల్యాండ్ కౌంటీస్ స్కూల్స్ జట్టుపై సెంచరీ చేశాడు. [2] కొన్ని వారాల తర్వాత 18 సంవత్సరాల వయస్సులో వజీర్ సుల్తాన్ టొబాకో కోల్ట్స్ XI జట్టులో తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. మరో తొమ్మిది మంది తొలి ఫస్ట్-క్లాస్ ఆటగాళ్ళున్న జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. [3] 1973 ముగిసేలోపు అతను ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున, దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ తరఫున, తమిళనాడు తరపున రంజీ ట్రోఫీలో ఆడాడు. 1973-74 సీజన్ ముగిసే ముందు అతను రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇండియన్ XI కోసం రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. పోచయ్య కృష్ణమూర్తికి రిజర్వ్ వికెట్ కీపర్‌గా భారత జట్టుతో శ్రీలంకలో ఒక చిన్న పర్యటన చేసాడు. శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ XIతో మ్యాచ్ ఆడాడు. [4]

ఆ తర్వాత కొద్దికాలానికే ఫరోఖ్ ఇంజనీర్ టెస్ట్ క్రికెట్‌ నుండి రిటైర్ అయినప్పుడు రెడ్డి గాని, కృష్ణమూర్తి గానీ జట్టు లోకి రాలేదు. సెలెక్టర్లు సయ్యద్ కిర్మాణిని తీసుకున్నారు. రెడ్డి 1975-76లో శ్రీలంకతో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకదానిలో కీపరుగా ఆడాడు. కిర్మాణికి డిప్యూటీగా అతను 1977-78లో ఆస్ట్రేలియా, 1978-79లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. కిర్మాణిని తొలగించినప్పుడు అతనికి టెస్ట్ క్రికెట్‌లో అవకాశం లభించింది. 1979లో మొదటి ఎంపిక వికెట్-కీపర్‌గా రెడ్డి ఇంగ్లాండ్‌లో పర్యటించాడు . భారత్‌ 1-0 తో ఓడిపోయిన సిరీస్‌లో అతను నాలుగు టెస్టుల్లోనూ ఆడాడు గానీ ఆకట్టుకోలేకపోయాడు. [5] రెడ్డి 1980–81లో కిర్మాణికి డిప్యూటీగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు గానీ అక్కడ టెస్టులు ఆడలేదు.

అంతర్జాతీయ కెరీర్

మార్చు

అతను 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.

బ్యాట్‌తో అతని అత్యుత్తమ సీజన్ 1981–82. అతను మూడు అర్ధసెంచరీలతో 32.60 సగటుతో 326 పరుగులు చేశాడు. [6] కేరళపై అతని కెరీర్‌లో అత్యధిక స్కోరు 88 కూడా అప్పుడే చేసాడు. [7]

అతను 1982-83 నుండి 1985-86 వరకు తమిళనాడుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1982-83లో కేరళకు వ్యతిరేకంగా అతను రెండో ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు, మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది క్యాచ్‌లు తీసుకున్నాడు. [8]

క్రికెట్ తర్వాత

మార్చు

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్‌లో పనిచేశాడు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో తోడ్పడ్డాడు. అక్కడ అతను భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చాడు. [9]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన కుమార్తె శ్రీయా రెడ్డి దక్షిణ భారత చలనచిత్రాలలో నటి.

మూలాలు

మార్చు
  1. "Bharath Reddy". ESPN Cricinfo. Retrieved 9 May 2020.
  2. Wisden 1974, p. 833.
  3. Hyderabad Cricket Association XI v Vazir Sultan Tobacco Colts XI 1973–74
  4. Sri Lanka Board President's XI v Indians 1973–74
  5. Wisden 1980, p. 329.
  6. Bharath Reddy batting by season
  7. Tamil Nadu v Kerala 1981–82
  8. Kerala v Tamil Nadu 1982–83
  9. "Bharath Reddy" by Abhishek Mukherjee