1947 డిసెంబర్ 22గుజరాత్ లోని రాజ్‌కోట్లో జన్మించిన దిలీప్ దోషి (Dilip Rasiklal Doshi) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1979 నుంచి 1983 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 33 టెస్టులు, 15 వన్డేలు ఆడినాడు. 30 సంవత్సరాల వయస్సులో టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించి 100 టెస్ట్ వికెట్లు సాధించిన వారిలో ఇతడు రెండో బౌలర్. భారతీయులలో ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్ ఇతడే. టెస్ట్ క్రికెట్ లో దిలీప్ మొత్తం 114 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 6 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 102 పరుగులకు 6 వికెట్లు.