వజ్రోత్సవం
(వజ్రోత్సవము నుండి దారిమార్పు చెందింది)
వజ్రోత్సవం ఒక వ్యక్తి 60 సంవత్సరాలు లేదా ఒక సంస్థ 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. ఎక్కువగా సంస్థలకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.[1][2][3][4][5]
వజ్రోత్సవం జరుపుకున్నవారు
మార్చు- శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం (1901-1962): భాషానిలయ వజ్రోత్సవాలు 1962 సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు.
- శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం (1907-1977): 1977లో ఈ గ్రంథాలయ వజ్రోత్సవం జరిగింది. పాతూరి నాగభూషణం, ఎం.ఆర్. అప్పారావు, భాష్యం అప్పలాచార్యులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మొదలైన వారు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- భారతి (మాస పత్రిక) (1924-1984): 1984లో వజ్రోత్సవం జరిగింది.
- శ్రీ నన్నయ భట్టారక పీఠం (1931-2006): 2006లో వజ్రోత్సవం జరుపుకుంది.
- తెలుగు సినిమా వజ్రోత్సవం: తెలుగు సినిమా పరిశ్రమ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 2007, జనవరి 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు వజ్రోత్సవం జరిగింది. ఈ మూడు రోజులు సినీ పరిశ్రమలో పనిచేసే వారందరికీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెలవు దినాలుగా ప్రకటించింది. హైదరాబాదులోని హైటెక్స్ లో జరిగిన ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల నుంచి అనేకమంది పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కె. రాఘవేంద్రరావు కల్చరల్ కమిటీకి అధ్యక్షుడిగా, కె. ఎస్. రామారావు ముఖ్య కన్వీయర్ గా వ్యవహరించారు.[6]
- విశాలాంధ్ర దినపత్రిక (1952-2012): 2012లో వజ్రోత్సవం జరుపుకుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "75th Anniversary Diamond Jubilee". Augusta University. Retrieved 11 July 2020.
- ↑ "Impactful publishing: the Journal of Neurosurgery and its diamond anniversary (1944–2019)". Journal of Neurosurgery. 130 (1). doi:10.3171/2018.9.JNS182570.
- ↑ "NDTA 75th Anniversary Funds Campaign". National Defense Transportation Association. Retrieved 11 July 2020.
- ↑ "ASMP's 75th Anniversary". American Society of Media Photographers. Archived from the original on 17 జూన్ 2019. Retrieved 11 July 2020.
- ↑ "Anniversary Celebration History". Hallmark Cards, Inc. Retrieved 9 November 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-24. Retrieved 2020-07-11.
ఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Diamond jubileesకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.