వద్దంటే డబ్బు [1] 1954 లో వచ్చిన హాస్య చిత్రం. రోహిణి పిక్చర్స్ పతాకంపై YR స్వామి దర్శకత్వంలో మూలా నారాయణ స్వామి నిర్మించాడు.[2] ఇది బ్రూస్టర్స్ మిలియన్స్ (1902) అనే ఆంగ్ల నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, షావుకారు జానకి, జమున ముఖ్య పాత్రల్లో నటించారు. టిఎ కళ్యాణం సంగీతం సమకూర్చాడు. మొదట మిశ్రమ స్పందనకు వచ్చినప్పటికీ, ఇది తెలుగు సినిమాలో కల్ట్ హోదాను పొందింది. బాబాయి-అబ్బాయి (1985) పేరుతో మళ్ళీ నిర్మించారు కూడా.

వద్దంటే డబ్బు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.ఆర్. స్వామి
నిర్మాణం హెచ్.ఎమ్.రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
పేకేటి శివరాం,
జానకి,
జమున ,
రాజనాల
సంగీతం టి.ఎ.కళ్యాణం
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు

కథ సవరించు

శ్యామ్ (ఎన్.టి.రామారావు) రామారావు (పేకేటి శివరాం) సన్నిహితులు. కలిసి జీవిస్తూంటారు. అప్పులు చేయడం, రుణదాతల నుండి తప్పించుకోవడం - ఇదీ వారి రోజువారీ కార్యక్రమం. శ్యామ్ ఒక చిత్రకారుడు. సరోజ (షావుకారు జానకి) కోటీశ్వరుడు రావు సాహెబ్ హేమాచలపతి (రాజనాల) కుమార్తె. అతని చిత్రాలను ఆరాధిస్తుంది. ఆమె తన చిత్తరువును గీయించుకోడానికి అతన్ని కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. రావు సాహెబ్ లక్ష రూపాయల భారీ మొత్తం శ్యామ్‌కు ఇచ్చి 30 రోజులలో ఖర్చు చేయమని చెబుతాడు. అతను ఆ డబ్బును విరాళంగా ఇవ్వకూడదు, నాశనం చేయకూడదని కొన్ని షరతులను కూడా విధిస్తాడు. శ్యామ్ తన మిత్రుడు రామారావు ఆలోచనలైన గుర్రప్పందాలు, జూదం, నాటకాలాడడం, ఇల్లు కట్టడం మొదలైన పనులు చేస్తూ డబ్బు ఖర్చు చేయడం ప్రారంభిస్తాడు. కానీ వారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. శ్యామ్ ఈ డబ్బుతో విసుగు చెందుతాడు. చివరగా, అతను మొత్తం డబ్బును రావు సాహెబ్కు తిరిగి ఇచ్చేస్తాడు. శ్యామ్ తత్వాన్ని అధ్యయనం చేయడానికీ, డబ్బు ఎంత ప్రమాదకరమైనదో కూడా అతను అర్థం చేసుకోవాలనీ తాను ఈ పనిని ఇచ్చానని రావు సాహెబ్ అతనికి వివరిస్తాడు. శ్యామ్, సరోజల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

నటవర్గం సవరించు

పాటలు సవరించు

ఎస్. పాట పేరు సాహిత్యం సింగర్స్ పొడవు
1 "నా ప్రియా" దేవులపల్లి కృష్ణశాస్త్రి జిక్కి 3:14
2 "అల్లది అవతలా" వెంపటి సదాశివబ్రహ్మం జిక్కి 3:05
3 "చదవాలి" వెంపటి సదాశివబ్రహ్మం ఎ.ఎమ్.రాజా, పి.సుశీల
4 "ఎవరో దోషులు" వెంపటి సదాశివబ్రహ్మం రోహిణి
5 "ఎందుకోయీ" దేవులపల్లి కృష్ణశాస్త్రి రావు బాలసరస్వాతి 2:49
6 "థింథళాంగుతోం" శ్రీ శ్రీ రావు బాలసరస్వాతి, రోహిణి, వి.రామకృష్ణ, ఎస్పీ కోదండపాని, ఎం.వి.రాజు
7 "ఆలకించవోయీ" దేవులపల్లి కృష్ణశాస్త్రి జిక్కి 3:33
8 "మనసేమో చలించేనయో" శ్రీ శ్రీ రావు బాలసరస్వాతి 2:55

మూలాలు సవరించు

  1. Ramachandran, Naman (2012). Rajinikanth: The Definitive Biography. Penguin Books. pp. 170–171.
  2. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopaedia of Indian Cinema (PDF). Oxford University Press. p. 654. ISBN 0-19-563579-5.