వన్డే క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా
ఆట కెరీర్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడాన్ని వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) క్రికెట్‌లో ఒక ముఖ్యమైన విజయంగా పరిగణిస్తారు. [3] 2023 జూలై నాటికి ఆట చరిత్రలో 14 మంది క్రికెటర్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు.[2] పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ 1996 అక్టోబరులో మొదటగా ఇది సాధించాడు. [4] ఈ ఫార్మాట్‌లో 400, 500 వికెట్లు తీసిన తొలి ఆటగాడు కూడా అక్రమే. [3] [5] ముగ్గురు పాకిస్తానీలు, ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు భారతీయులు, ఒక న్యూజిలాండ్, ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు, ఒక బంగ్లాదేశీతో పాటు నలుగురు శ్రీలంక ఆటగాళ్లు 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లుల్లోని ఆటగాళ్ళెవరూ ఇంకా 300 గీత చేరలేదు. [2]
శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 534 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు సాధించాడు.; అతను 10 సార్లు ఐదు వికెట్ల పంట కూడా సాధించాడు. [2] 300 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్ అత్యుత్తమ బౌలింగ్ సగటు (22.02) కలిగి ఉన్నాడు. [6] ఆడిన మ్యాచ్‌ల విషయానికొస్తే, బ్రెట్ లీ ఈ ఘనత సాధించిన అతి తక్కువ మ్యాచ్‌లలో (171) ఇది సాధించాడు. [7] దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షాన్ పొలాక్ ఓవర్‌కు 3.67 పరుగులతో అత్యంత పొదుపైన బౌలరు. బ్రెట్ లీ ఒక వికెట్‌కు 29.4 బంతుల్లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ సాధించాడు. [2] 2001లో జింబాబ్వేపై శ్రీలంకకు చెందిన చమిందా వాస్ 19 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టడం ఒక వన్డేలో బౌలర్ ఎనిమిది వికెట్లు తీసిన ఏకైక సందర్భం. [8] వకార్ యూనిస్ 13 సార్లు సాధించిన ఐదు వికెట్ల పంట 2022 వరకూ రికార్డుగా నిలిచి ఉంది.[2] వన్డేల్లో 300 వికెట్లు తీసి, ఇంకా ఆడుతూ ఉన్న ఏకైక ఆటగాడు షకీబ్ అల్ హసన్. [9]
వన్డేల్లో 300 వికెట్లు తీసిన బౌలర్లలో, వన్డే క్రికెట్‌లో 10,000 పరుగుల క్లబ్‌లో కూడా చేరిన ఏకైక క్రికెటర్ సనత్ జయసూర్య. [10]
కీ
మార్చు
300 వికెట్ల క్లబ్‌లో బౌలర్ల జాబితా
మార్చు- ఒక బౌలర్ ద్వారా అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాను మొదటగా ఏర్పాటు చేస్తారు. ఈ పట్టికను ఏదైనా గణాంకం ద్వారా క్రమబద్ధీకరించడానికి, నిలువు వరుస శీర్షిక పక్కన (ఆన్ కాదు) వర్తించే హెడర్ బాక్స్‌పై క్లిక్ చేయండి.
^ | ICC క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చబడింది |
† | ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్‌ని సూచిస్తుంది |
సం | బౌలరు | జట్టు | మ్యా | ఇన్ని | బంతు
లు |
పరు
గులు |
వికె | సగ | పొదు
పు |
SR. | BBM | 5w/i | Ref(s) |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ముత్తయ్య మురళీధరన్^ | శ్రీలంక | 350 | 341 | 18,811 | 12,326 | 534 | 23.08 | 3.93 | 35.2 | 7/30 | 10 | [12] |
2 | వసీం అక్రమ్^ | పాకిస్తాన్ | 356 | 351 | 18,186 | 11,812 | 502 | 23.52 | 3.89 | 36.2 | 5/15 | 6 | [13] |
3 | వకార్ యూనిస్ ^ | పాకిస్తాన్ | 262 | 258 | 12,698 | 9,919 | 416 | 23.84 | 4.68 | 30.5 | 7/36 | 13 | [14] |
4 | చమిందా వాస్ | శ్రీలంక | 322 | 320 | 15,775 | 11,014 | 400 | 27.53 | 4.18 | 39.4 | 8/19 | 4 | [15] |
5 | షాహిద్ అఫ్రిది | పాకిస్తాన్ | 398 | 372 | 17,670 | 13,632 | 395 | 34.51 | 4.62 | 44.7 | 7/12 | 9 | [16] |
6 | షాన్ పొల్లాక్ | దక్షిణాఫ్రికా | 303 | 297 | 15,712 | 9,631 | 393 | 24.50 | 3.67 | 39.9 | 6/35 | 5 | [17] |
7 | గ్లెన్ మెక్‌గ్రాత్ ^ | ఆస్ట్రేలియా | 250 | 248 | 12,970 | 8,391 | 381 | 22.02 | 3.88 | 34.0 | 7/15 | 7 | [18] |
8 | బ్రెట్ లీ | ఆస్ట్రేలియా | 221 | 217 | 11,185 | 8,877 | 380 | 23.36 | 4.76 | 29.4 | 5/22 | 9 | [19] |
9 | లసిత్ మలింగ | శ్రీలంక | 226 | 220 | 10,936 | 9,760 | 338 | 28.87 | 5.35 | 32.3 | 6/38 | 8 | [20] |
10 | అనిల్ కుంబ్లే^ | భారతదేశం | 271 | 265 | 14,496 | 10,412 | 337 | 30.89 | 4.30 | 43.0 | 6/12 | 2 | [21] |
11 | సనత్ జయసూర్య | శ్రీలంక | 445 | 368 | 14,874 | 11,871 | 323 | 36.75 | 4.78 | 46.0 | 6/29 | 4 | [10] |
12 | జావగల్ శ్రీనాథ్ | భారతదేశం | 229 | 227 | 11,935 | 8,847 | 315 | 28.08 | 4.44 | 37.8 | 5/23 | 3 | [22] |
13 | షకీబ్ అల్ హసన్* | బంగ్లాదేశ్ | 235 | 229 | 11,921 | 8,837 | 305 | 28.97 | 4.45 | 39.0 | 5/29 | 4 | [23] |
14 | డేనియల్ వెట్టోరి | న్యూజీలాండ్ | 295 | 277 | 14,060 | 9,674 | 305 | 31.71 | 4.12 | 46.0 | 5/7 | 2 | [24] |
మూలాలు
మార్చు- ↑ Wisden CricInfo staff (27 January 2003). "All-time W100 ODI Top 10s". ESPNcricinfo. Wisden. Archived from the original on 4 October 2013. Retrieved 8 October 2018.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Record / One-Day Internationals / Bowling record / Most wickets in career". ESPNcricinfo. Archived from the original on 16 June 2013. Retrieved 23 July 2023.
- ↑ 3.0 3.1 Kureishi, Omar (31 January 2000). "Wasim's record – a remarkable feat". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 8 October 2018.
... 400 (plus) wickets in one day internationals ... is a monumental achievement considering that no one else has even crossed the 300 mark.
- ↑ "Wisden – Pakistan vs Zimbabwe". ESPNcricinfo. Archived from the original on 23 January 2011. Retrieved 23 January 2012.
- ↑ "Pakistan labour to victory". BBC Sport. 25 February 2003. Archived from the original on 29 August 2013. Retrieved 23 January 2012.
- ↑ "Record / One-Day Internationals / Bowling record / Best career bowling average". ESPNcricinfo. Archived from the original on 10 December 2011. Retrieved 23 January 2012.
- ↑ "Record / One-Day Internationals / Bowling record / Fastest to 300 wickets". ESPNcricinfo. Archived from the original on 10 January 2012. Retrieved 23 January 2012.
- ↑ "One Day International Bowlng Records – Best figures in an innings". ESPNcricinfo. Archived from the original on 28 November 2014. Retrieved 23 February 2013.
- ↑ "Shakib Al Hasan becomes first Bangladesh bowler to take 300 ODI wickets". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 18 March 2023.
- ↑ 10.0 10.1 "Player Profile: Sanath Jayasuriya". ESPNcricinfo. Archived from the original on 18 January 2012. Retrieved 23 January 2012.
- ↑ "Record / One-Day Internationals / Bowling record / Most wickets in career". ESPNcricinfo. Archived from the original on 16 June 2013. Retrieved 23 July 2023.
- ↑ "Player Profile: Muttiah Muralitharan". ESPNcricinfo. Archived from the original on 13 February 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Wasim Akram". ESPNcricinfo. Archived from the original on 1 January 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Waqar Younis". ESPNcricinfo. Archived from the original on 8 February 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Chaminda Vaas". ESPNcricinfo. Archived from the original on 14 February 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Shahid Afridi". ESPNcricinfo. Archived from the original on 20 January 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Shaun Pollock". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Glenn McGrath". ESPNcricinfo. Archived from the original on 17 November 2013. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Brett Lee". ESPNcricinfo. Archived from the original on 10 February 2012. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Lasith Malinga". ESPNcricinfo. Archived from the original on 8 August 2017. Retrieved 31 August 2017.
- ↑ "Player Profile: Anil Kumble". ESPNcricinfo. Archived from the original on 19 December 2011. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Javagal Srinath". ESPNcricinfo. Archived from the original on 10 December 2011. Retrieved 23 January 2012.
- ↑ "Player Profile: Shakib Al Hasan". ESPNcricinfo. Archived from the original on 29 November 2015. Retrieved 7 March 2023.
- ↑ "Player Profile: Daniel Vettori". ESPNcricinfo. Archived from the original on 29 November 2015. Retrieved 30 December 2015.