వరంగల్ విమానాశ్రయం
వరంగల్ విమానాశ్రయం (IATA: WGC, ICAO: VOWA) వరంగల్ వద్ద ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందిన విమానాశ్రయం.[1] నిజాం కాలంలో ఏర్పాటుచేయబడిన ఈ విమానాశ్రయం 1981 వరకు సేవలనందించింది.
Warangal Airport వరంగల్ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
యజమాని | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
కార్యనిర్వాహకత్వం | ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా | ||||||||||
ప్రదేశం | వరంగల్ | ||||||||||
ఎత్తు AMSL | 935 ft / 285 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 17°55′00″N 079°36′00″E / 17.91667°N 79.60000°E | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
|
చరిత్ర
మార్చుభారత స్వాంతంత్ర్యానికి పూర్వం ఉన్న అతి పెద్దదైన విమానాశ్రయం వరంగల్ విమానాశ్రయం. దీనిని 1930 లో వరంగల్ జిల్లా లోని మమ్‌నూర్ లో నిర్మించారు. దీనిని చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద్వారా అప్పగించబడింది. ఇది షోలాపూర్ లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజ్ నగర్ లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం, వరంగల్ లోని అజాం జాహి మిల్స్ ల సేవలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది.
అనేకమంది ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడినది. ఇండో చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ విమానాశ్రయం శత్రువులు లక్ష్యంగా చేసుకున్నపుడు ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు సేవలందించింది. ఈ విమానాశ్రయంలో అనేక కార్గో సేవలు, వాయుదూత్ సేవలు అందజేయబడ్డాయి.
వసతులు
మార్చువరంగల్ విమానాశ్రయం ఆ కాలంలో భారతదేశంలో అతి పెద్ద విమానాశ్రయంగా ఉండేది. ఇది 1875 ఎకరాల స్థలంలో 6.6 కి.మీ రన్ వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణా కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్ళు ఉండేవి.
విమాన సేవలు
మార్చుప్రస్తుతం వాణిజ్య విమాన సేవలు షెడ్యూలు లేదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు చేపట్టాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం, దీని నిర్మాణం గురించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులతో చర్చలు జరిపింది. పెద్ద విమానాలు రాకపోకలు సాగించాలంటే మరో 438 ఎకరాల భూమి అవసరం అవుతుంది కనుక, చిన్న ఎయిర్‌క్రాప్ట్‌ల రాకపోకలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, దానికి ఏఏఐ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-13. Retrieved 2014-10-05.
- ↑ telugu, NT News (2022-08-22). "మామునూర్‌లో గాలిమోటర్ గాలులు!". Namasthe Telangana. Archived from the original on 2022-08-22. Retrieved 2022-08-22.
- BS Reporter / Chennai/ Hyderabad 18 January 2007. Andhra to sign MoUs with Airports Authority India