తెలంగాణ విమానాశ్రయాలు

వికిపీడియా జాబితాల వ్యాసము

భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. కొన్ని విమానాశ్రయాలు ఉపయోగించకుండా అత్యవసర వినియోగానికి ఉపయోగపడేవిధంగా కూడా ఉన్నాయి. ఈ విమానాశ్రయాలన్ని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వారి అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నవి.[1][2]

రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ప్రపంచంలోని వివిధ దేశాలకు విమానాల ద్వారా ప్రయాణీకులకు ప్రయాన సౌకర్యాలను అందిస్తున్నది.

జాబితాసవరించు

ఈ క్రింది జాబితాలో డొమెస్టిక్, మిలిటరీ, నాన్ ఆపరేషనల్ విమానాశ్రయాలను వాటి ICAO, IATA కోడ్లతో ఇవ్వడం జరిగింది.

విమానాశ్రయాల జాబితా
వరుస సంఖ్య. ప్రదేశం విమానాశ్రయ సంఖ్యAirport Name ICAO IATA ఆపరేటర్ వర్గం పాత్ర
1 శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం VOHS HYD ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య
వాణిజ్య సేవలు లేని విమానాశ్రాయాలు
2 బేగంపేట బేగంపేట విమానాశ్రయం VOHY BPM ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాణిజ్య సేవలు షెడ్యూలు లేదు
మూతబడిన విమానాశ్రయాలు
3 వరంగల్ వరంగల్ విమానాశ్రయం VOWA WGC ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 1981 వరకు సేవలో ఉండేది.
4 రామగుండం రామగుండం విమానాశ్రయం VORD RMD ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఆదిత్య బిర్లా (బిర్లా సిమెంట్ గ్రూపు) ఇది 1995 వరకు సేవలో ఉండేది.
ప్రత్యేక విమానాశ్రయాలు
5 దుండిగల్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ భారతీయ వాయుసేన వాయుసేన
6 హకీంపేట హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషను VODG భారతీయ వాయుసేన వాయుసేన

మూలం: Airports Authority of India[3]

మూలాలుసవరించు

  1. "Airports governance in AP". Airport Authority of India. Archived from the original on 25 జూన్ 2014. Retrieved 23 June 2014.
  2. "Airport map locator". Airports Authority of India. Archived from the original on 12 డిసెంబర్ 2009. Retrieved 23 June 2014.
  3. "List of Airports in Southern India:". Airports Authority of India. Archived from the original on 24 జూన్ 2014. Retrieved 23 June 2014.