వర్గం చర్చ:వరంగల్ జిల్లా పటములు

తాజా వ్యాఖ్య: ఈ వర్గంలోని అన్ని పటాలు తొలగించాలి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

ఈ వర్గంలోని అన్ని పటాలు తొలగించాలి

మార్చు
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వర్గంలోని పటాలు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు పువర్య్వస్థీకరణ జరగకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మండలాలు పటాలు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2016, అక్టోబరులో 33 కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పూర్వపు వరంగల్ జిల్లా, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్, మహబూబాబాద్ అనే 5 కొత్త జిల్లాలుగా విభజించారు. అయితే, ప్రజల డిమాండ్ మేరకు 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లాను 13 మండలాలతో వరంగల్ జిల్లాగా, వరంగల్ అర్బన్ జిల్లాను 14 మండలాలతో హన్మకొండ జిల్లాగా తిరిగి మార్చారు.అందువలన మండలాలు భౌగోళికంగా ఊహించని మార్పులు జరిగాయి.వాటి ప్రకారం కొత్త భౌగోళిక మార్పులతో మండల పటాలు తయారు చేసుకోవాలి తప్ప , ఈ వర్గంలోని ఏ ఒక్క పటం భవిషత్తు లో కూడా ఉపయోగించటానికి అవకాశం లేనందున అన్ని పటాలు తొలగించాటానికి ప్రతి పాదిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:15, 22 అక్టోబరు 2021 (UTC)Reply

@యర్రా రామారావు గారూ, చాలా ముఖ్యమైన అంశాన్ని వెలుగు లోకి తెచ్చారు. మీరు చెప్పినట్టు, తెలంగాణ లోని మండలాలన్నింటి పటాలనూ మార్చుకోవాలిప్పుడు. కాకపోతే ఒక్క సవరణ: ప్రస్తుతమున్న పటాలను తొలగించకుండా వాటిని పాత పటాలనే వర్గం లోకి చేర్చాలి. ఆ పాత పటాలను కూడా ఆయా మండలాల పేజీల్లో పెట్టాలి. వాటికి చారిత్రిక ప్రాధాన్యత ఉంది కదా! పరిశీలించండి.
పోతే, ఈ పటాల తయారీ, మండలాల పేజీల్లో పాత కొత్త పటాల చేర్పూ ఓ పెద్ద ప్రాజెక్టు అవుతుంది. __ చదువరి (చర్చరచనలు) 08:26, 25 అక్టోబరు 2021 (UTC)Reply

రచ్చబండలో ఈ విషయమై చర్చ జరిగింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లకు చెందిన పాత పటాలనన్నిటినీ తగు విధమైన పేరుకు కామన్సు లోకి తరలించడం చాలావరకు పూర్తైంది. మరికొద్ది రోజుల్లో మిగతా పని అయిపోతుంది. ఇక ఈ సమస్య పరిష్కారమైనట్టే. ఆయా పేజీల్లో చారిత్రిక సమాచారాన్ని ఇచ్చే చోట ఈ పటాలను కామన్సు నుండి తెచ్చి పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:10, 16 జూన్ 2022 (UTC)Reply

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.
Return to "వరంగల్ జిల్లా పటములు" page.