వలిగొండ మండలం
వలిగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] వలిగొండ, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.వలిగొండ మూసీ నది పశ్చిమతీరంపైన ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
వలిగొండ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°22′34″N 79°01′18″E / 17.3761973°N 79.0216541°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | వలిగొండ |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 56,098 |
- పురుషులు | 28,596 |
- స్త్రీలు | 27,502 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.52% |
- పురుషులు | 71.24% |
- స్త్రీలు | 45.68% |
పిన్‌కోడ్ | 508112 |
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 56,098 పురుషులు 28,596 - స్త్రీలు 27,502. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 314 చ.కి.మీ. కాగా, జనాభా 59,285. జనాభాలో పురుషులు 30,213 కాగా, స్త్రీల సంఖ్య 29,072. మండలంలో 14,723 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- పహిల్వాన్పూర్
- కంచన్‌పల్లి
- పులిగిళ్ల
- మొగిలిపాక
- ఎం.తుర్కపల్లి
- అర్రూరు
- గంగాపూర్
- లోతుకుంట
- వెల్వర్తి
- కేర్చిపల్లి
- మల్లేపల్లి
- శుంకిశాల
- రెడ్ల రేపాక
- పొద్దటూరు
- లింగరాజుపల్లి
- ముద్దాపూర్
- ఏదుళ్ళగూడెం
- నాతాళ్ళగూడెం
- వలిగొండ
- నాగారం
- గొల్నేపల్లి
- నెమిలికాలవ
- గోకారం
- వరకటపల్లి
- మునగాల
- వెంకటాపూర్
- గురునాథపల్లి
- వేమలకొండ
- గోపరాజుపల్లి
- టేకులసోమారం
- సంగం
- చిత్తాపూర్
- నరసాపురం
- దుప్పల్లి
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.