చౌటుప్పల్ రెవెన్యూ డివిజను

చౌటుప్పల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. యాదాద్రి భువనగిరి జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజన్ పరిపాలనలో 5 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ ప్రధాన కార్యాలయం చౌటుప్పల్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఈ రెవెన్యూ డివిజను ఏర్పాటయింది.[1] ఈ రెవెన్యూ డివిజను భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం, మునుగోడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉంది.

చౌటుప్పల్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాయాదాద్రి భువనగిరి

జిల్లా వివరాలు

మార్చు

జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉండగా, అందులో 12 మండలాలు భువనగిరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో, 5 మండలాలు చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి. జిల్లా జనాభా 7,70,833 కాగా భౌగోళికంగా 3,795 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 మండలాలు, 321 రెవెన్యూ గ్రామాలు, 421 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి.[2]

పరిపాలన

మార్చు

చౌటుప్పల్ డివిజను లోని మండలాలు:

క్ర.సం చౌటుప్పల్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 భూదాన్ పోచంపల్లి మండలం 23 రెవెన్యూ గ్రామాలు
2 రామన్నపేట మండలం 21 రెవెన్యూ గ్రామాలు
3 వలిగొండ మండలం 35 రెవెన్యూ గ్రామాలు (ఒకటి నిర్జన గ్రామం)
4 చౌటుప్పల్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు
5 నారాయణపూర్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 27 January 2022.
  2. "కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఆలేరు!". andhrajyothy. Archived from the original on 2022-01-28. Retrieved 27 January 2022.