వల్లూరు (టంగుటూరు)

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం లోని గ్రామం


వల్లూరు, టంగుటూరు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామం.[1]

వల్లూరు
రెవిన్యూ గ్రామం
వల్లూరు is located in Andhra Pradesh
వల్లూరు
వల్లూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E / 15.35; 80.05Coordinates: 15°21′N 80°03′E / 15.35°N 80.05°E / 15.35; 80.05 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంటంగుటూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,414 హె. (5,965 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523272 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

ఈ గ్రామం, ఒంగోలు పట్టణానికి దక్షిణంగా 8 కి.మీ.దూరంలో జాతీయ రహదారి ప్రక్కన ఉంది.బంగాళాఖాతానికి సుమారు 8 కి.మీ దూరములో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

మల్లవరపాడు 2.6 కి.మీ, పాలేటిపాడు 3.1 కి.మీ, తుమ్మడు 3.6 కి.మీ, మర్లపాడు 4.2 కి.మీ, వావిలేటిపాడు 4.8 కి.మీ.

సమీప మండలాలుసవరించు

సమీప పట్టణాలుసవరించు

జరుగుమిల్లి 7 కి.మీ, టంగుటూరు 8.2 కి.మీ, కొండపి 13.1 కి.మీ, ఒంగోలు 14.9 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

వల్లూరు గ్రామానికి రోడ్డు,రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి.వల్లూరు గ్రామాన్ని ఆనుకుని జాతీయ రహదారి నెం.5 పోవుచున్నది.ఒంగోలు పట్టణము నుండి కందుకూరు,కావలి,కొండేపి,మడనూరు,చాకిచర్ల, కారుమంచి వంటి తెలుగు వెలుగు బస్సుల ద్వరా అరగంటలో విజయవాడ,గూడురు రైలు సూరారెడ్డిపాలెం రైల్వే స్టేషన్ వల్లూరుకు సుమారుగా కిలోమీటరు దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

వల్లూరు గ్రామంలో 1 నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలు (హై స్కూల్) ఉన్నాయి.ఉన్నత పాఠశాల పేరును టంగుటూరి ప్రకాశం పంతులు గారి గుర్తుగా ఆంధ్రకేసరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పేరు పెట్టారు.ఒకప్పుడు బడులు పిల్లలతో కలకలలాడేవి.కాని తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలల వ్యామోహం వలన వీటి భవితవ్యం ప్రమాదంలో పడింది.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామంలో దాదాపుగా ప్రతి బజారుకి సిమెంటు రోడ్లు,కరూర్ వైశ్యా బ్యాంక్,ఓవర్ హెడ్ టాంక్,R.O వాటర్ ప్లాంట్ ఉన్నాయి.గ్రామ పరిధిలో Rise Krishna Sai Group of Institution, Pace Institute of technology వంటి కళాశాలలు ఉన్నాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

వల్లూరు గ్రామానికి పెద్ద చెరువు ఉంది.చెరువుకి తూర్పుగా గ్రామం, పంట పొలాలు విస్తరించి ఉన్నాయి.చెరువుకి పడమరగా మెట్ట భూములు ఉన్నాయి.ఇందులో ఎక్కువగా జామాయిల్,మినప,మిరప వంటివి సాగులో ఉన్నాయి.ఇక్కడే మామిడి తోట కూడా ఉంది.చెరువుకి తూర్పుగా ఉన్న మాగాణిలో ఎక్కువగా వరి సాగు చేస్తారు.ఈ సాగు పూర్తిగా చెరువు నీటిపై ఆధారపడి ఉంది.కానీ చెరువు వర్షం వచ్చినపుడు మాత్రమే నిండుతుంది.కావున ప్రతి సంవత్సరం వరి పండదు.ఇక్కడి నేలలు తక్కువ సారవంతమైనవి.

గ్రామ పంచాయతీసవరించు

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చుండి సుబ్బమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. []

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ వల్లూరమ్మ దేవస్థానంసవరించు

  1. కార్యనిర్వహణాధికారి
  2. వల్లూరమ్మ దేవాలయం ప్రకాశం జిల్లా లోనే కాక నెల్లూరు,గుంటూరు జిల్లాలలో మంచి పేరు కలిగి ఉంది.దసరా,సంక్రాంతి వంటి పండుగలు బాగా జరుపుతారు.

శివాలయంసవరించు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వల్లూరు గ్రామంలో అనేక కులవృత్తులు కలవారు నివసిస్తున్నారు.ఒకప్పుడు బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు.కాని వారి పట్టణ వలసల వలన వారి సంఖ్య నేడు తగ్గినది.ఇక వృత్తి కులాలలో చాకలి,మంగలి,కంసాలి,కుమ్మరి వంటి కులాల వారు ఉన్నారు.ఇంకా రెడ్డి,యాదవ,బలిజ,వడ్డెర,మరాఠి,కోమటి శెట్టి,మాల,మాదిగ,సాయిబులు,ఎరుకలు మొదలయిన కులస్తులు గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం, కూలి పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు.కూలి పనులకు సమీప పట్టణమైన ఒంగోలుకు వెళతారు.చాలా మంది పశుపోషణ కూడా జీవనాధారంగా కలిగి ఉన్నారు.

గ్రామ ప్రముఖులుసవరించు

  • ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి సొంత గ్రామం వల్లూరు.వీరి పూర్వీకులు టంగుటూరు నుంచి ఇక్కడకి వలస వచ్చారు.ప్రకాశంగారి బాల్య విద్యాభ్యాసం కొంతకాలం ఇక్కడే గడిచింది.ఈయన గుర్తుగా ఒంగోలు జిల్లాకి,విజయవాడ వద్ద కృష్ణ నదిపై గల బ్యారేజికి ఈయన పేరు పెట్టారు.
  • టంగుటూరి ఆదిశేషయ్య, భక్తకవి, ఉత్తమ ఉపాధ్యాయులు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 3,476 - పురుషుల సంఖ్య 1,683 - స్త్రీల సంఖ్య 1,793 - గృహాల సంఖ్య 931

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,391.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,687, మహిళల సంఖ్య 1,704, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,414 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18