వాటెల్ (సినిమా)
వాటెల్ (Vatel) 2000వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చారిత్రాత్మక చిత్రం. రోలాండ్ జోఫే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గెరార్డ్ డిపార్డ్యూ, ఉమా థుర్మాన్, టిమ్ రోత్, తిమోతి స్పాల్, జూలియన్ గ్లోవర్, జూలియన్ సాండ్స్ తదితరులు నటించారు. 17 వ శతాబ్దపు ఫ్రెంచ్ చెఫ్ ఫ్రాంకోయిస్ వాటెల్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం, ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఈ చిత్రం 2000 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తొలిసారిగా ప్రదర్శితమైనది.[2]
వాటెల్ | |
---|---|
![]() వాటెల్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | రోలాండ్ జోఫ్ఫ్ |
నిర్మాత | రోలాండ్ జోఫ్ఫ్, అలైన్ గోల్డ్మన్ |
రచన | జీన్ లాబ్రూన్, టామ్ స్టాపార్డ్ |
నటులు | గెరార్డ్ డిపార్డ్యూ, ఉమా థుర్మాన్, టిమ్ రోత్, తిమోతి స్పాల్, జూలియన్ గ్లోవర్, జూలియన్ సాండ్స్ |
సంగీతం | ఎనియోయో మొర్రికన్ |
ఛాయాగ్రహణం | రాబర్ట్ ఫ్రాయిస్సే |
కూర్పు | నోయెల్లీ బోయిసన్ |
నిర్మాణ సంస్థ | లెజెండే ఎంటర్ప్రైజెస్, గౌమౌంట్, కెనాల్ +, నోమాడ్ ఫిల్మ్స్, TF1 ఫిల్మ్స్ ప్రొడక్షన్, తిమోతి బుర్రిల్ ప్రొడక్షన్స్ |
పంపిణీదారు | గౌమౌంట్ |
విడుదల | మే 2000(కేన్స్ ఫిలిం ఫెస్టివల్) 10 మే 2000 (బెల్జియం) |
నిడివి | 103 నిముషాలు |
భాష | ఆంగ్లం |
బాక్సాఫీసు | $51,080 (డాలర్)[1] |
కథసవరించు
1671లో ఫ్రాంకో-డచ్ యుద్ధ కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న లూయిస్ గ్రాండ్ కొండే రాజ్యంలోని చెటెవ్ డి చన్టిలీలో జరుగుతున్న మూడు రోజుల ఉత్సవాలకు కింగ్ లూయిస్ XIV అతిథిగా విచ్చేస్తాడు. కింగ్ లూయిస్ XIVను ఆకట్టుకోవడానికి తక్కువ వ్యయంలో కార్యక్రమాలను నిర్వహించే బాధ్యతను ఫ్రాంకోయిస్ వాటెల్ అనే వ్యక్తికి అప్పగిస్తారు. వాటెల్ నిరుపేద కుటుంబంలో జన్మించిన అత్యంత ప్రతిభ కలిగిన మనిషి. ఇతరుల ఎత్తుగడల కారణంగా తనకు కేటాయించిన పనులు సరిగా జరుగక వాటెల్ తరచూ అగౌరవపాలౌతూ, తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు.
కింగ్ లూయిస్ XIV పర్యటన యొక్క చివరి రోజున, వాటెల్ తన అధికారుల చేతిలోని తోలుబొమ్మ కన్నా తానేమి ఎక్కువ కాదని తెలుసుకుంటాడు. ఇద్దరు రాజులకు జరిగిన కార్డుల ఆటలో కింగ్ లూయిస్ XIV గెలుపొందడంతో వాటెల్, కింగ్ సేవకుడిగా వెలుతాడు. అక్కడ వాటెల్ తన కత్తితో ఆత్మహత్య చేసుకుంటాడు. వాటెల్ మరణవార్త విన్న వాటెల్ ప్రియురాలు అన్నే మాంటౌసియర్ చాలా బాధపడుతుంది. వాటెల్ ఆత్మహత్య కేసును కోర్టు కొట్టివేయడంతో, ఆమె నిశ్శబ్దంగా కోర్టునుంచి వెళ్లిపోతుంది.
నటవర్గంసవరించు
- గెరార్డ్ డిపార్డ్యూ
- ఉమా థుర్మాన్
- టిమ్ రోత్
- తిమోతి స్పాల్
- జూలియన్ గ్లోవర్
- జూలియన్ సాండ్స్
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: రోలాండ్ జోఫ్ఫ్
- నిర్మాత: రోలాండ్ జోఫ్ఫ్, అలైన్ గోల్డ్మన్
- రచన: జీన్ లాబ్రూన్, టామ్ స్టాపార్డ్
- సంగీతం: ఎనియోయో మొర్రికన్
- ఛాయాగ్రహణం: రాబర్ట్ ఫ్రాయిస్సే
- కూర్పు: నోయెల్లీ బోయిసన్
- నిర్మాణ సంస్థ: లెజెండే ఎంటర్ప్రైజెస్, గౌమౌంట్, కెనాల్ +, నోమాడ్ ఫిల్మ్స్, టి.ఎఫ్.1 ఫిల్మ్స్ ప్రొడక్షన్, తిమోతి బుర్రిల్ ప్రొడక్షన్స్
- పంపిణీదారు: గౌమౌంట్
మూలాలుసవరించు
- ↑ Box Office Mojo "Vatel"
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 30 July 2018.