నాథురాం గాడ్సే:

నాథూరామ్ గాడ్సే:

(మే 19, 1910- నవంబరు 15, 1949) గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇతను మహారాష్ట్రలోని పూనే జిల్లా బారామతి పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన హిందు మహాసభ వారి హిందు రాష్ట్ర అను వారపత్రిక కు సంపాదకుడుగానుండెను

గాంధీ హత్యా:

భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ భారత్ పాకిస్తాన్ కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే నారాయణ్ ఆప్తే, , గోపాల్ గాడ్సే మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యానాలోని అంబాలా జైలులో ఉరి తీశారు.

1.    నారాయణ్ ఆప్తే:

ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త మరియు గాంధీ హత్యకేసు నిందితులలో ఒకరు. నాథూరామ్ గాడ్సేతో పాటు ఇతను కూడా ఉరి తియ్యబడ్డాడు. ఇతను పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించాడు. ఇతను స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అదే సమయంలో ఇతను గాంధీ మితవాద విధానాలని వ్యతిరేకించాడు. నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతోకలిసి హిందూ మహాసభలో ఆరేళ్ళు పనిచేశాడు. భారత్-పాకిస్తాన్ విభజన విషయంలో గాంధీ పాకిస్తాన్ వైపు నిలబడడం వల్ల నారాయణ్ ఆప్తే నాథూరామ్ గాడ్సేతో కలిసి గాంధీ హత్యలో పాల్గొన్నాడు. గాంధీ చనిపోతే భారత్-పాకిస్తాన్ పునరేకీకరణ చెందే అవకాశం ఉందనుకున్నాడు..


2.    గోపాల్ గాడ్సే:

ఆర్.ఎస్.ఎ.స్. కార్యకర్త. ఇతను గాంధీ హత్య కేసులోని నిందితులలో ఒకరు. ఇతను నాథూరామ్ గాడ్సేకి తమ్ముడు. ఇతన్ని పూనేలోని ఇతని స్వగృహంలో అరెస్ట్ చేశారు. గాంధీ హత్యలో ఇతను తన అన్నకి సహకరించినందుకు ఇతనికి 18 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇతను జైలు నుంచి బయటకి వచ్చిన తరువాత తాను గాంధీని చంపినందుకు ఏమాత్రం విచార పడడం లేదని చెప్పుకున్నాడు. గోపాల్ గాడ్సే మొదట ఢిల్లీలో ప్రార్థనా సభ వద్ద బాంబు పెట్టి గాంధీని హత్య చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. ఈ హత్యాయత్నం కేసులో మదన్ లాల్ పాహ్వా అనే పంజాబీయుడు దొరికిపోయాడు. తాను కూడా దొరికిపోయేలోపే గాంధీని చంపాలనుకుని తన అన్న నాథూరామ్ గాడ్సేకి గాంధీ పై కాల్పులు జరపడానికి సహాయం చేశాడు.