స్వాగతం

మార్చు
BENJOHNSON SIDDANTHAPU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

BENJOHNSON SIDDANTHAPU గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli ([:Nrgullapalli|చర్చ]]) 00:40, 25 జూన్ 2021 (UTC)Reply

బెన్ జాన్సన్ విద్యావంతులైన ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు .1967 జూన్ 22 న తొండంగి లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తొండంగి ప్రాధమిక పాఠశాలలోను , ఉన్నత పాఠశాల విద్య తొండంగి, దివిలిమరియు  ఉప్పాడ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ విద్య ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఠాపురం నందు జరిగింది. కాకినాడలోని  పి . ఆర్ ప్రభుత్వ కళాశాలలో బిఎస్సి బోటనీ మెయిన్ సబ్జెక్టుతో చదవడం జరిగింది . కాకినాడలోని సెయింట్ మేరీ కాలేజీ నందు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదవడం జరిగింది. పెరియార్ యూనివర్సిటీ నుండి ఎం ఏ ఇంగ్లీష్ లో పట్టా పొందారు.

     1995 డీఎస్సీ బ్యాచ్ కు చెందిన సిద్ధాంత బెన్ జాన్సన్ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా తొండంగి మండలం  కొత్త పెరమాళ్ళపురం లో జూలై 1 న చేరడం జరిగింది. చిన్నతనం నుండి సాంఘిక సేవ  పట్ల ఆసక్తి కలిగిన మాస్టారు అదే  ఒరవడిని ఉపాధ్యాయ వృత్తిలోనూ  కొనసాగించారు. వీరి జీవిత కాలంలో ఎక్కువగా సముద్రతీర ప్రాంతాలు  పెరుమాళ్ళపురం ,ఉప్పాడ, పొన్నాడ  మత్స్యకార గ్రామాలలో ఉపాధ్యాయునిగా పని చేశారు. మత్స్యకార విద్యార్థులను ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.

  కొత్త పెరుమాళ్ళపురం ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయునిగా  పనిచేస్తూ అదే పాఠశాలను 2000 లో ప్రాథమికోన్నత పాఠశాల గానూ  2003వ సంవత్సరంలో ఉన్నత పాఠశాల గాను  అప్ గ్రేడ్ చేసి అధికారుల మన్ననలు పొందారు.

    గడ్డిపేట గ్రామస్తులనుండి ఐదు ఎకరాల స్థలమును పాఠశాలకు సేకరించి పాఠశాల భవనాలను నిర్మించారు. హేచరీస్  వారినుండి రెండు లక్షల రూపాయలు విరాళాలను సేకరించి పాఠశాల ప్రహారీలను , ఐరన్ మెష్ లను నిర్మించి పాఠశాలను అభివృద్ధి పరిచారు. గ్రామస్తులను కూడగట్టి 2000 సంవత్సరంలో పాఠశాల 60వ వార్షికోత్సవం  నిర్వహించారు.

      స్వంత నిధులను వెచ్చించి పాఠశాలకు బీరువా ,కుర్చీలు మొదలగు ఫర్నిచర్ పాఠశాలకు సమకూర్చారు. సొంత నిధులతో తీర గ్రామాలలో మొట్టమొదటిసారిగా మండల స్దాయి విద్యా వైజ్ఞానిక  ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

    పాఠశాల విద్యా కమిటీ తో పనిచేస్తూ డ్రాపౌట్స్ అయిన  విద్యార్థులను 200 మందిని తిరిగి పాఠశాలలో చేర్చడం జరిగింది . అక్షర గోదావరి లో తీర గ్రామాలలోని  డ్వాక్రాగ్రూపు నిరక్షరాస్య  మహిళలను విద్యావంతులను చేయడం జరిగింది.

   సముద్ర తీర గ్రామమైన  పెరుమాళ్ళపురంలో గ్రామస్తుల నుండి పదివేల రూపాయలు సేకరించి ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటిసారిగా నిరంతర విద్యా కేంద్రం ప్రారంభించడం జరిగింది.

  2003 నందు కొత్తపల్లి మండలం ప్రాథమిక పాఠశాల నందు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా బదిలీపై చేరిన జాన్సన్ మాస్టారు . ప్రజల సహకారంతో 15 వేల రూపాయల విరాళం సేకరించి రాష్ట్రంలోనే తొలిసారిగా మధ్యాహ్న భోజన పథకము సమర్థవంతంగా అమలు కొరకు భోజనశాల నిర్మించడం జరిగింది . మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు కొరకు వంటపాత్రలను సొంత నిధులతో సమకూర్చడం జరిగింది.

  కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొందిన  సిద్ధాంతపు బెన్ జాన్సన్ మాస్టారు కాకినాడ రోటరీ క్లబ్ వారి సహకారంతో మధ్యాహ్న భోజనం సమర్థవంతంగా అమలు చేయుటకు లక్ష రూపాయల విలువైన హ్యాండ్ వాష్ స్టేషన్ ను నిర్మించడం జరిగింది.

కొత్త పల్లి కి చెందిన సూర్య వాటర్ ప్లాంట్ వారి సహకారంతో నిరంతరం మంచినీటి మినరల్ వాటర్ సదుపాయం కల్పించి విధ్యార్దులు స్వచ్చమైన నీటిని త్రాగేలా చేయడం జరిగింది.

స్వచ్చభారత్ కార్యక్రమమును విధ్యార్దులు, గ్రామస్దులతో చైతన్యవంతంగా నిర్వహిస్తున్నారు.

   పూర్వ విద్యార్థుల నుండి పాఠశాలకు 25 వేల రూపాయల విలువైన  క్రీడలు మరియు పాఠశాల దినోత్సవములు నిర్వహించునప్పుడు అలంకరణకు అనువైన స్టీలు జెండా ఫోలులు 20 సేకరించడం జరిగింది.

    ఎన్ వి ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా బాల కార్మిక విమోచన వేదిక టీచర్ ఫార్మ్ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తూ వందల మంది బాలకార్మికులను బడిలోనికి చేర్చడం జరిగింది. అనేక మంది బాల కార్మికులకు యూనిఫారంలు,నోట్స్ పుస్తకములు సొంత నిధులతో సమకూర్చి పాఠశాలలో చేర్చడం జరిగింది. ఎందరో ఎయిడ్స్ రోగులకు మందులు, బట్టలు, రేషను  విరాళంగా ఇవ్వడం జరిగింది. సునామి మరియు కరోనా వంటి విపత్తులలో అనేక మంది నిరుపేదలకు వస్త్రదానములు, అన్నదానములు విద్యార్థులతో కలసి చేయడం జరిగింది.

  కళాకారుడైన జాన్సన్ మాస్టారు ఎందరో విద్యార్థులను సాంస్కృతిక కళా రంగం పట్ల ఆకర్షితులు చేశారు. పాటలు పాడడం,

లోనూ, నాటకములు వేయడం లోనూ, డాన్సులు చేయడంలోనూ శిక్షణ ఇచ్చారు .

     విధ్యార్దులతో వైద్యానికి జీవం అనే లఘుచిత్రాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి  లఘు చిత్ర ఫోటీలలో  విద్యార్థులు బహుమతులు గెలుచుకునేలా ప్రొత్సహించారు.

  అనేక పాఠశాల వార్షికోత్సవం లోనూ పాఠశాల దినోత్సవాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మండల స్థాయిలలో విద్యార్థులు ప్రదర్శనలు చేయించి బహుమతులు పొందేలా చేసారు.విద్యార్దులెందరికో  రచనారంగంలో   తర్ఫీదు నిచ్చారు .

పాఠశాల వార్షికోత్సవాలలోను పాఠశాల దినోత్సవాలలోనూ, మండల స్థాయి స్థాయిలలోనూ క్విజ్ మరియు వకృత్వ పోటీల్లో విధ్యార్దులు పాల్గొనెలా  తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు .

  కాకినాడ క్రియా రాష్ట్రస్థాయి పోటీలలో చిత్రలేఖనం ,కథ చెప్పడం, మట్టితో బొమ్మలు చేయడం, భోధనోపకరణాల ఫోటీ, బృందనాట్యం, నాటకం, అనేక అంశాలలో విద్యార్థుల పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు.

    

  మండల స్థాయి గణిత మేళా,  బోధనోపకరణాల మేళ వంటి పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకునే లా విద్యార్థులను ప్రోత్సహించారు. మండలస్దాయి

సైన్స్ ఫేర్ నందు బహుమతులు గెలుచుకునేలా ప్రోత్సహించారు.

      విద్యార్థులతో పాఠశాల పత్రిక ధ్రువతారను ప్రారంభించి రాష్ట్రస్థాయిలోనే మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్రికను ప్రారంబించి అధికారుల మన్ననలు పొందారు. విద్యార్థులు స్వయంగా రచించిన కథలను ,చిత్రించిన బొమ్మలను , కవితలను పాఠశాల వార్తలను ,ప్రతి నెల పాఠశాల పత్రిక రూపంలో ముద్రించి రాష్ట్రస్దాయిలో మన్ననలు పొందారు.


  స్కౌట్ గైడ్  శిక్షణ పొందిన జాన్సన్ మాస్టారు కొమ్మనాపల్లి  జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులుచే స్కౌట్  ను ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరితో చుట్టు పక్కల గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు .

  పెరుమాళ్ళపురంలో  కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి  వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. ఉప్పాడలో కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులతో  ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు .

 

పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టిక్ నిషేదం కొరకు  గ్రామాలలో అనేక ర్యాలీలు చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తూ పర్యావ పరిరక్షణపై  అనేక  అవగాహన తరగతులు నిర్వహించారు. క్లీన్ అండ్ గ్రీన్ భాగంగా అనేక మొక్కలను విద్యార్థులతో నాటించారు.

 

స్వతహాగా రచయిత అయిన  బెన్ జాన్సన్ మాస్టారు తూర్పుగోదావరి జిల్లా బాలసాహితీ నందు కథావాచకాల విభాగానికి కన్వీనర్ గా పనిచేసి స్వయంగా అల్లరి ,పద కదంబం , తూర్పు గోదావరి జిల్లా జానపద కళారూపాలు వంటి పుస్తకాలను విద్యార్దుల కొరకు రచించారు వీటిని రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ రాష్ట్రవ్యాప్తంగా ముద్రించి పాఠశాలలకు పంపడం జరిగింది.

   సి సి ఈ ఆర్ టి రాజస్థాన్లో పప్పెట్రీలో శిక్షణ పొందిన జాన్సన్ మాస్టారు  పప్పెట్ మేకింగ్ అనే పుస్తకాన్ని రచించారు. బడి గంటలు హ్యాండ్ బుక్ ఆఫ్ హెడ్మాస్టర్ అనే పుస్తకాన్ని రచించారు.

యూనిసెఫ్ వారు ముద్రించిన కమ్యూనికేట్ ఇన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్  అనే  అంతర్జాతీయ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించారు.  చెట్టు నా బొమ్మలు అనే  పుస్తకాన్ని ప్రాధమిక పాఠశాల విద్యార్థుల కొరకు రచించారు.

   పదవ తరగతి విధ్యార్దుల కొరకు ఆంగ్ల  స్టడీ మెటీరియల్  రూపొందించారు . ఈ స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ముద్రించి పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది.

  ఆన్ లైన్ ద్వారా క్రియేటివ్ బడ్డీస్ అనే బ్లాగులను సృష్టించి విద్యార్థుల యొక్క టాలెంట్లను  ప్రదర్శింప చేస్తున్నారు. వియ్ విన్   యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి విద్యార్థులే స్వయంగా ఛానల్  నిర్వహించేలా ప్రోత్సహిస్తూ ఆ చానల్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నారు .

  పాఠశాల లైబ్రరీను  బలోపేతం చేస్తూ గ్రామంలోని విద్యావంతుల నుండి విలువైన పుస్తకాలను సేకరించి పాఠశాల లైబ్రరీ ను బలోపేతం చేస్తున్నారు.

2010 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, 2018 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగాను, ప్రభుత్వ అవార్డులు పొందారు. అనేక సంస్దలు  జిల్లాస్దాయిలోను, రాష్ట్ర స్దాయిలోనూ, నేషనల్ స్దాయిలోను అవార్డులు ఇచ్చి బెన్ జాన్సన్ మాస్టారును సత్కరించాయి.

 

    [:SIDDANTHAPU BEN JOHNSON|SIDDANTHAPU BEN JOHNSON]] (:SIDDANTHAPU BEN JOHNSON|]]) 07:23, 4 మే 2023 (UTC)