నేను పవను మిత్రుడను. నేను వికీపీడీయాలో చేరుదాం అని అనుకుంటుంన్నాను.

స్వాగతం మార్చు

మునేశ్వర్ గారూ! స్వాగతం. మంచి వికీపీడియన్ గా తెవికీ అభివృద్ధికి మీరు సహకరిస్తారని, అందుకు నేను మీకు ఉపయోగపడతానని ఆశిస్తూన్నాను. మీకు అవసరమైన వనరులు సాయంత్రం అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:43, 4 జనవరి 2019 (UTC)Reply

వాడుకరి:Muneswarao గారూ, వాడుకరి:Chaduvari సూచించినదాని ప్రకారం, మనం చర్చించిన ప్రకారం నేను మీ ఆసక్తిని అనుసరించి ఓ జాబితా ఇస్తున్నాను చూడండి:

  1. మూగ మనసులు (1964 సినిమా)
  2. ఎస్.వి. రంగారావు
  3. మంచుమనిషి

ఈ మూడు వ్యాసాలు పరిశీలించండి. సరదాగా చదవండి. ఏవైనా చేర్చదగ్గవి ఉన్నాయేమో, స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయేమో చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 17:32, 4 జనవరి 2019 (UTC)Reply

మూలాలు చేర్చడం మార్చు

వాడుకరి:Muneswarao గారూ, మనం దేని నుంచి తీసుకుని రాస్తున్నామన్నది, మన ఆధారాలు లేక మూలాలు, చేర్చడం వికీపీడియాలో దాదాపు ప్రతీ వాక్యానికి అవసరం. మీరు 2018 నాటికి ప్రముఖ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య ఎంతన్నది చేర్చారు, బావుంది. అయితే వీటికి ఎక్కడో మూలాలు ఉంటాయిగా వాటినీ చేర్చాలి. అదెలాగంటే, ఒక వేళ మనం తీసుకున్నది వెబ్సైట్ నుంచి అనుకుంటే <ref>{{cite web |url= |title= |last1= |first1= |date= |website= |publisher= |accessdate=11 జనవరి 2019}}</ref> అన్నదానిలో last1 అన్నదగ్గర ఆ రచయిత ఇంటిపేరు, first1 అన్నదగ్గర అసలు పేరు, మిగతా వివరాలూ నింపి (ఒకవేళ రచయిత పేరు లేకుంటే ఖాళీగా వదలాలి) మనం ఏ వాక్యాన్ని అయితే ఈ మూలంతో సమర్థించదలిచామో అక్కడ పెట్టాలి. ఓకేనాండీ. ఏవైనా సందేహాలు ఉంటే ఈ సెక్షన్ ఎడిటింగ్ చేసి కింద రాసి --~~~~ అని సంతకం చేసి మార్పులు ప్రచురించండి, నేను సమాధానమిస్తాను (బై ద వే, చర్చా పేజీల్లో మాట్లాడుకునే పద్ధతి ఇది.) ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 15:45, 11 జనవరి 2019 (UTC)Reply