వారసవాహిక అనేది ఇంగ్లీషులోని 'క్రోమోజోమ్‌' (ఆంగ్లం chromosome) కి తెలుగు సేత. ఇంగ్లీషులో 'క్రోమోజోమ్‌' అన్న మాట గ్రీకు భాషలోని 'క్రోమో' (అంటే రంగు), 'సోమా' (అంటే శరీరం లేదా పదార్థం) అన్న మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక క్రోమోజోమ్‌ అంటే 'రంగు పదార్థం'. ఇది క్రోమోజోముల తత్వం అర్ధం కాని రోజులలో అజ్ఞానం వల్ల పెట్టిన పేరు. 'క్రోమోజోమ్‌' కి ఏ రంగూ ఉండదు. సూక్ష్మదర్శినిలో చూట్టానికి వీలుగా ఉంటుందని చాల పదార్ధాలకి రంగు పులుముతారు. ఈ పద్ధతిని ఇంగ్లీషులో staining అంటారు. జీవకణాలకి రంగు పులిమి సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఆ రంగు కణికలో (nucleus) ఉన్న జన్యు పదార్ధానికి అంటుకొని గాజు పలకకి ఉన్న పారదర్శకమయిన నేపథ్యంలో ఖణిగా కనిపిస్తుంది. అంతే తప్ప ఈ జన్యు పదార్ధానికి ఏ రంగూ లేదు. కనుక జీవకణంలో ఉన్న కణికలో ఉన్న జన్యు పదార్థంలో ఉన్న సన్నటి దారాల లాంటి పదార్ధాన్ని వారసవాహికలు అని తెలుగులో అందాం.

క్రోమోసోము నిర్మాణం: (1) క్రోమాటిడ్, (2) సెంట్రోమియర్, (3) పొట్టి బాహువు, (4) పొడవు బాహువు.

నిర్మాణ సరళిసవరించు

మానవుని శరీరంలో ఉన్న ప్రతి జీవకణం లోనూ 23 జతల వారసవాహికలు ఉంటాయి. వీటిని వారసవాహిక-1,...వారసవాహిక-23, అని పిలవటం రివాజు. ఈ 23 జతలలోనూ ఉన్న జన్యు పదార్థం (genetic matter) అంతటినీ కలిపి డి.ఎన్.ఎ. (DNA) అని కూడా వ్యవహరిస్తారు. కనుక స్థూలంగా మాట్లాడేటప్పుడు డి. ఎన్. ఏ. అన్నా, క్రోమోజోములు అన్నా, వారసవాహికలు అన్నా ఒక్కటే. కాని సూక్ష్మ దృష్టితో చూస్తే వారసవాహికలలో కొంత భాగం డి.ఎన్.ఎ., కొంత భాగం ప్రాణ్యం (protein) ఉన్నాయని వాదించ వచ్చు. కొన్ని వైరస్‌ లలో డి.ఎన్.ఎ. (లేదా ఆర్‌.ఎన్‌.ఎ.) తప్ప ప్రాణ్యం ఉండకపోవచ్చు.

సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇవి ఇంగ్లీషు అక్షరం X ఆకారంలో, బొమ్మలో చూపినట్లు కనిపిస్తాయి. ఇంకా బలవంతమైన సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇవి చుట్టలు చుట్టిన దారాలలాంటివనీ అర్ధం అవుతుంది. వీటి కట్టడిని బణుప్రమాణం (molecular scale) లోనూ, అణుప్రమాణం (atomic scale) లోనూ అర్ధం చేసుకొంటే జంటపెన (double helix) ఆకారంలో అమర్చబడ్డ నూక్లియోటయిడ్ (nucleotide) లనే 'పూసల' దండ అని అర్ధం అవుతుంది. ఇంత సూక్ష్మమైన కొలమానంలో వీటిని డి. ఎన్. ఏ. (DNA) అన్న పేరుతోనే ఎక్కువగా వ్యవహరిస్తారు. ఈ వారసవాహికలని పూసలతో గుచ్చిన దండలా ఊహించుకొంటే, ఆ దండలో అక్కడక్కడ ఉన్న కొన్ని పూసల గుంపులని జన్యువులు (genes) అంటారు. మావవుని జన్యుసంపద (genome) లో దరిదాపు 5000 జన్యువులు ఉంటాయని ఒక అంచనా ఉంది.

ఇతర ప్రాణులలో వారసవాహికల వైనంసవరించు

ఒక్కొక్క జతలోని వారసవాహికలలో ఒకటి తల్లి నుంచి, మరొకటి తండ్రి నుంచి సంక్రమిస్తాయి. పట్టికలో చూపినట్లు వీటి సంఖ్య జాతిని బట్టి నిర్ణీతమై ఉంటుంది. జంతువు జాతిని బట్టి ఎన్ని జతల వారసవాహికలు ఉన్నాయో నిర్ణీతమయినట్లే, ఒకొక్క వారసవాహికలో ఎన్నెన్ని నూక్లియోటయిడ్‌ 'పూసలు' ఉన్నాయో కూడా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి కొన్ని జీవులలో నూక్లియోటయిడ్‌ 'పూసలు' వేలల్లో మాత్రమే ఉంటే కొన్ని జీవులలో మిలియన్ల పైబడి ఉంటాయి.

జంతువులలో వారసవాహికల సంఖ్యసవరించు

కొన్ని జంతువులలో వారసవాహికల సంఖ్య
జాతులు #జతలు జాతులు #జతలు
Common fruitfly ఫలీగ 4 Guinea Pig[1] 32
పావురం 8 తోట నత్త[2] 27
వానపాము Octodrilus complanatus[3] 18 టిబెట్ నక్క 18
పిల్లి 19 పంది 19
చిట్టెలుక 20 ఎలుక 21
కుందేలు 22 Syrian hamster 22
లేడి 23 మానవుడు[4] 23
గొరిల్లా, చింపాంజీ[4] 24 గొర్రె 27
ఏనుగు[5] 28 ఆవు 30
గాడిద 31 గుర్రం 32
కుక్క[6] 39 లకుమికి పిట్ట[7] 66
బంగారు చేప[8] 50-52 పట్టుపురుగు[9] 28

మూలాలుసవరించు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి.
  1. Umeko Semba, Yasuko Umeda, Yoko Shibuya, Hiroaki Okabe, Sumio Tanase and Tetsuro Yamamoto (2004). "Primary structures of guinea pig high- and low-molecular-weight kininogens". International Immunopharmacology. 4 (10–11): 1391–1400. doi:10.1016/j.intimp.2004.06.003. Archived from the original on 2008-03-08. Retrieved 2008-05-31.CS1 maint: multiple names: authors list (link)
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  4. 4.0 4.1 Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  5. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  7. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  8. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
  9. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
"https://te.wikipedia.org/w/index.php?title=వారసవాహిక&oldid=2826387" నుండి వెలికితీశారు