'వారసురాలు' తెలుగు చలన చిత్రం,1973 ఆగస్టు 30. న విడుదల.రామకృష్ణ,విజయనిర్మల , ఎస్.వి.రంగారావు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎస్.శ్రీరామ్ అందించారు .

వారసురాలు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.హరి నారాయణ
తారాగణం రామకృష్ణ,
విజయ నిర్మల
సంగీతం ఎం.ఎస్.శ్రీరాం
నిర్మాణ సంస్థ విక్రమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, నిర్మాత: బి.వి.కృష్ణమూర్తి
  • మాటలు, పాటలు: మైలవరపు గోపి
  • ఛాయాగ్రహణం: పార్థసారథి
  • నృత్యాలు: జయరాం
  • స్టంట్స్: ఎ.ఆర్.బాషా
  • కళ: ఇ.శ్రీనివాసరావు
  • సంగీతం: ఎం.ఎస్.శ్రీరాం
  • కూర్పు, దర్శకత్వం: బి.హరినారాయణ

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను గోపి రచించగా ఎం.ఎస్.శ్రీరాం స్వరకల్పన చేశాడు.[1]

వరుస సంఖ్య పాట పాడిన వారు
1 జామురేతిరి కాడ జాజిమల్లె పొద నీడ ఎస్.జానకి, జిక్కి
2 హాయ్ గుండెలు తీసిన బంటులు సైతం డంగైపోవాలీ ఎల్.ఆర్.ఈశ్వరి
3 నాదం వింటే లోకం మరచీ నాట్యం చేసే నాగూ ఎస్.జానకి
4 ఓ... సన్నజాజి తీగవంటిదానరా ఎస్.జానకి

కథాసంగ్రహం

మార్చు

జమీందారు చక్రవర్తి కూతురు మాలతి తండ్రిని ఎదిరించి తను మనసిచ్చిన మనిషితో పెళ్ళి చేసుకుని తండ్రికి దూరంగా వెళ్ళిపోతుంది. ఒక్కగానొక్క బిడ్డకు దూరమైన చక్రవర్తి ఆత్మీయతకోసం అలమటించసాగాడు. పట్టుదలతో ఇల్లు విడిచిన మాలతి దురదృష్ట వశాన భర్తను కోల్ఫోయింది. కన్నబిడ్డ శోభను దిక్కులేనిదానిగా చేసి తనూ కన్ను మూసింది. లక్షలాది ఆస్తికి వారసురాలైన ఆ చిన్నారిపాప, ఒక దయామయుడి నీడలో పెరిగి పెద్దదయ్యింది. తనను పెంచి పెద్దచేసిన ఆ పేద కుటుంబంకోసం కష్టపడుతూ ఆ కుటుంబానికి ఎన్నో సేవలు చేసింది. శోభ, జమీందారు చక్రవర్తి కళ్ళముందు పరిచితులుగా తాతగారని శోభ, తన మనవరాలని జమీందారు గుర్తించుకోలేకపోతారు. అయినా ఏదో తెలియని అనుబంధం, ఆ ఇద్దర్నీ హృదయాలను స్పందింపచూస్తుంది. చక్రవర్తి తమ్ముడు కొడుకు రమేష్ ఆస్తికి వారసుడు కావాలని శోభను చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. తనెవరో తెలియకున్నా సంబంధం లేకపోయినా శోభను అడుగడుగునా కాపాడుతుంటాడు రత్తిగాడు. అతడు గతంలో ఒక యువతిని మానభంగం చేసి జైలుకెళ్ళి వచ్చాడు. శోభ అడుగడుగునా అపాయాలు తప్పించుకుంటూ ఆశయసిద్ధికోసం పాటుపడుతూ, చివరికి తాతగారైన చక్రవర్తిని కలుసుకుంటుందా? ఆమెకు ప్రాణరక్షణ చేస్తున్న రౌడీ రత్తిగాడు ఎవరు? అతని ఆశయమేమిటి? లక్షలాది ఆస్తికి వారసులు ఎవరు? మొదలైన ప్రశ్నలకు సమాధానం పతాకసన్నివేశంలో తెలుస్తుంది[1].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మనోహర్. వారసురాలు పాటల పుస్తకం. p. 8. Retrieved 18 September 2020.