విజయనిర్మల
విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.
విజయనిర్మల | |
---|---|
జననం | నిర్మల ఫిబ్రవరి 20, 1946 |
మరణం | జూన్ 27, 2019 [1] |
మరణ కారణం | అనారోగ్యం |
ఇతర పేర్లు | నిర్మల |
వృత్తి | నటి, దర్శకురాలు |
జీవిత భాగస్వామి | ఘట్టమనేని కృష్ణ |
పిల్లలు | విజయ నరేష్ |
తల్లిదండ్రులు |
|
జీవిత విషయాలు
మార్చువిజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
సినిమారంగం
మార్చుపాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్లో ఎక్కారు.[2] నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు.[3]
విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు
మార్చు- సాక్షి
- మంచి కుటుంబం
- సర్కార్ ఎక్స్ ప్రెస్
- అత్తగారు కొత్తకోడలు
- లవ్ ఇన్ ఆంధ్రా
- టక్కరి దొంగ చక్కని చుక్క
- విచిత్ర కుటుంబం
- బందిపోటు భీమన్న
- అక్కా చెల్లెలు
- మా నాన్న నిర్దోషి
- మళ్లీపెళ్లి
- విధివిలాసం
- అమ్మకోసం
- తాళిబొట్టు
- పెళ్లి సంబంధం
- పెళ్లికూతురు
- పగ సాధిస్తా
- అగ్నిపరీక్ష
- రెండు కుటుంబాల కథ
- అల్లుడే మేనల్లుడు
- మాస్టర్ కిలాడి
- అనురాధ
- మోసగాళ్లకు మోసగాడు
- భలే మోసగాడు
- పండంటి కాపురం
- ప్రజా నాయకుడు
- మంచివాళ్లకు మంచివాడు
- దేవుడు చేసిన మనుషులు
- మీనా
- గాలిపటాలు
- అల్లూరి సీతారామరాజు
- ధనవంతులు గుణవంతులు
- దేవదాసు
- సంతానం - సౌభాగ్యం
- పాడిపంటలు
- రామరాజ్యంలో రక్త పాతం
- దేవుడే గెలిచాడు
- పంచాయితీ
- పట్నవాసం
- మూడు పువ్వులు ఆరు కాయలు
- హేమాహేమీలు
- అంతం కాదిది ఆరంభం
- రక్తసంబంధం
- సాహసమే నా వూపిరి
- ప్రజల మనిషి
- బొబ్బిలి దొర
- శ్రావణమాసం
- నేరము-శిక్ష
- శ్రీశ్రీ (2016)
మరణం
మార్చుగతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, జూన్ 27 గురువారం ఉదయం మరణించారు.[4][5][6]
వంశవృక్షం
మార్చుమూలాలు
మార్చు- ↑ English: మూస:Description/i18nVeteran actor-directorVijaya Nirmala passes away at 73, http://www.thenewsminute.com.
- ↑ ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) Vijayanirmala enters the Guinness Archived 2006-09-25 at the Wayback Machine శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
- ↑ BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్సకురాలిగా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021.
- ↑ "Actress-Director Vijaya Nirmala Dies at 75; Jr NTR and Others Post Tributes".
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (28 June 2019). "విజయనిర్మల ఇకలేరు". Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (28 June 2019). "విజయ నిర్మల ఇకలేరు". Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.