రాధాకుమారి

నటి

రాధాకుమారి (Radha Kumari) తెలుగు సినిమా నటి. ఈమె ప్రముఖ రచయిత మరియు సినీ నటుడు రావి కొండలరావు గారి సతీమణి. గయ్యాళితనం, సాత్వికత్వం ఇవి రెండూ కలబోసిన పాత్రల్లో నటించి మెప్పించారు. సహాయనటిగా, హాస్యనటిగా తెలుగు తెరపై తనదైన ముద్రవేసారు. ఇప్పటి వరకు ఈమె సుమారు 400కి పైగా సినిమాలలో నటించి అందరి మన్ననలు పొందింది.కేవలం చలనచిత్రాల్లోనే కాకుండా పలు ధారావాహికల్లోను నటించారు. అనువాద కళాకారిణిగానూ ఆమె వంద సినిమాలకు పనిచేసారు.

రాధాకుమారి
Radhakumari.jpg
జననంరాధాకుమారి
విజయనగరం
మరణంమార్చి 8, 2012
జీవిత భాగస్వామిరావి కొండల రావు

ఈమె మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణ కు సవతి తల్లిగా నటించి మెప్పించింది.

కొంతకాలం విరామం తర్వాత మరla 2002 నుండి తిరిగి డి. రామానాయుడు పిలుపు మేరకు నువ్వు లేక నేను లేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.

నటించిన సినిమాలుEdit

2010 : డాన్ శీను, వరుడు

2009 : ఆర్య 2, ఓయ్, మహాత్మ

2008 : రక్ష, స్వగతం

2005 : ధన 51

2003 : ఒకరికి ఒకరు

2002 : నువ్వులేక నేనులేను, హోలీ

1996 : శ్రీకృష్ణ విజయం

1977 : కథానాయిక మొల్ల

1972 : విచిత్రబంధం

1971 : నమ్మకద్రోహులు

1968 : వింత కాపురం

1966 : కన్నె మనసులు రంగుల రాట్నం

1965 : తేనె మనసులు

1962 : మహామంత్రి తిమ్మరుసు

టీ వి ధారావాహికలు (సీరియల్)Edit

2006-2008 : రాధ మధు

బయటి లింకులుEdit