వాలుజెడ తోలు బెల్టు

తెలుగు కామెడీ చలన చిత్రం - 1992

వాలుజడ తోలుబెల్టు 1992 లో వచ్చిన తెలుగు కామెడీ చిత్రం. MRC మూవీ క్రియేషన్స్ పతాకంపై, విజయ బాపినేడు దర్శకత్వంలో గుత్తా మధుసూదన రావు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కనక నటించారు. ప్రసన్న స్వరాజ్ సంగీతం సమకూర్చారు.[1][2] ఈ చిత్రం 1990 నాటి మలయాళం సినిమా నన్మా నిరంజవన్ శ్రీనివాసన్కు రీమేక్.

వాలుజెడ తోలు బెల్టు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయబాపినీడు
నిర్మాణం గుత్తా మధుసూదనరావు
కథ విజయబాపినీడు
ఎం.వి.వి.ఎస్.బాబూరావు
చిత్రానువాదం విజయబాపినీడు
తారాగణం రాజేంద్ర ప్రసాద్
కనక
సంగీతం ఎం. ఎం. కీరవాణి
సంభాషణలు వి. ఆనంద శంకరం
ఛాయాగ్రహణం బాబు
కూర్పు త్రినాథ్
నిర్మాణ సంస్థ ఎం.ఆర్.సి. క్రియెషన్స్
భాష తెలుగు

కథసవరించు

ఈ చిత్రం ఒక గ్రామంలో ఆనందంగా జీవనం గడుపుతున్న అమాయకుడైన అచ్చారావు (రాజేంద్ర ప్రసాద్) తో ప్రారంభమవుతుంది. అతను కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. దుర్మార్గుడైన స్టేషన్ SI (వల్లభనేని జనార్ధన్) వద్ద బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇక్కడ, వారి హెడ్ కానిస్టేబుల్ (పిఎల్ నారాయణ) అచ్చారావు స్నేహపూర్వక స్వభావాన్ని ప్రేమిస్తాడు. అతనికి తన ఇంట్లో ఆశ్రయ మిస్తాడు. అతని కుమార్తె సీత (కనక) అచ్చారావును ప్రేమిస్తుంది. ఇంతలో, అతి తక్కువ ధరకు గృహోపకరణాలను అమ్మే సంస్థ ఒకటి ఆ పట్టణంలో కొత్త పథకం ప్రారంభిస్తుంది. కంపెనీ ఏజెంట్ పీటర్ (సాయి కుమార్) ప్రజల నుండి ముందస్తుగా భారీ మొత్తాలను సేకరిస్తాడు. ఆ తరువాత, ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. సంస్థ యజమాని కుమారుడు డబ్బుతో తప్పించుకోవడానికి ప్రయత్నించినపుడూ పీటర్ అతణ్ణి అడ్డుకుంటాడు. ఆ గొడవలో, అనుకోకుండా, అతను పీటర్ చేతిలో చనిపోతాడు. SI అతన్ని అదుపులోకి తీసుకొని భయంకరంగా హింసిస్తాడు. అచ్చారావు పీటర్ పట్ల చూపిన సానుభూతిని వాడుకుని తప్పించుకుని పారిపోతాడు. అచ్చారావును రక్షించడానికి, హెడ్ కానిస్టేబుల్ ఆ తప్పును తనపై వేసుకుంటాడు.

తనపై వచ్చిన నిందను బాపుకోడానికి అచ్చారావు, సీతతో పాటు పీటర్‌ను పట్టుకోవటానికి బయల్దేరుతాడు. అచ్చారావు, పీటర్ల‌ను తన ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీ (కోట శంకర్ రావు) ఎస్‌ఐని ఆదేశిస్తాడు. సమాంతరంగా, కంపెనీ యజమాని (ఎంఎస్ గోపీనాథ్) వారిని చంపేయమని చెప్పి SI ని కొనేస్తాడు. ఆ ప్రక్రియలో, అచ్చారావు తన తల్లిని (రాధా కుమారి) కలుస్తాడు. పీటర్ భార్య (శైలజ) అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉందని తెలుసుకుంటాడు. దీనిపై ఆందోళన చెందిన అచ్చారావు వారిని జాగ్రత్తగా చూసుకుంటాడు. పీటర్ ఆచూకీ కనుగొని అతన్ని భార్యతో కలుపుతాడు. ఆ తరువాత, పీటర్ పోలీసులకు లొంగిపోతాడు. అదే సమయంలో అచ్చారావు, కంపెనీ యజమాని అదుపులోకి వెళ్తాడు. వారిద్దరూ అచ్చా రావు, పీటర్ ల‌ను చంపడానికి ప్రయత్నిస్తారు. కాని అచ్చారావు అడ్డు తొలగించుకుని పీటర్ వైపు పరుగెత్తుతాడు. ఆ సమయానికి, SI పీటర్‌ను చంపి, అచ్చారావును కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అదృష్టవశాత్తూ, ఎస్పీ దీనిని చూసి, ఎస్‌ఐని పడగొడతాడు. చివరగా, అచ్చారావుకు ఎస్‌ఐగా పదోన్నతి లభిస్తుంది. అచ్చారావు, సీతల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • కళ: ఎపి రాజు
 • నృత్యాలు: తారా, శివ సుబ్రహ్మణ్యం, ప్రమీలా
 • స్టిల్స్: జి. నారాయణరావు
 • పోరాటాలు: విక్కీ
 • స్క్రిప్ట్: ఎంవివిఎస్ బాబు రావు
 • సంభాషణలు: వి. ఆనంద శంకరం
 • సాహిత్యం: భువన చంద్ర
 • నేపథ్య గానం: ఎస్పీ బాలూ, చిత్ర, మాల్గాడి శుభా
 • సంగీతం: ప్రసన్న సర్రాజ్
 • కూర్పు: త్రినాథ్
 • ఛాయాగ్రహణం: బాబు
 • నిర్మాత: గుత్తా మధుసూదనరావు
 • కథ - చిత్రానువాదం - దర్శకుడు: విజయ బాపినేడు
 • బ్యానర్: MRC మూవీ క్రియేషన్స్
 • విడుదల తేదీ: 1992 ఫిబ్రవరి 21

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "పెద్ద వీధి చిన్న వీధి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:59
2. "గోళీ సోడా తాగిస్తా"  మాల్గాడి శుభ 2:57
3. "గంగరావి చెట్టుకాడ"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చిత్ర 3:06
4. "అబ్బ ఏం గాలి"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 3:54
మొత్తం నిడివి:
13:56

మూలాలుసవరించు

 1. Valu Jada Tolu Beltu. gomolo.com. URL accessed on 2014-09-19.
 2. Valu Jada Tolu Beltu. thecinebay.com. URL accessed on 2014-09-19.