వాసంతి కృష్ణన్ ఒక భారతీయ మోడల్ మరియు నటి. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె తొలుత కన్నడ సినిమాల్లో నటించింది. ఆ తరువాత తెలుగు టీవి ధారావాహిక సిరి సిరి మువ్వలు (2019) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సంపూర్ణేష్ బాబు సరసన నటించిన ఆమె క్యాలీఫ్లవర్ (2021) సినిమాతో ఆకట్టుకుంది. అలాగే దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో నటించింది. స్టార్ మా ప్రసారం చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6లో ఆమె తన డ్రెస్సింగ్ సెన్స్ తో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తోంది.[1]

వాసంతి కృష్ణన్
వాసంతి
జననం1997 మే 25
జాతీయతఇండియన్
విద్యఏరోనాటికల్ ఇంజనీరింగ్
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బిగ్ బాస్ తెలుగు 6
తల్లిదండ్రులుకృష్ణ (తండ్రి)
సుధారాజ్యం (తల్లి)

బాల్యం, విద్య మార్చు

వాసంతి కృష్ణన్ తిరుపతిలో 1997 మే 25న కృష్ణ, సుధారాజ్యం దంపతులకు జన్మించింది. అక్కడే హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసిన ఆమె బెంగళూరులో ఏవియేషన్‌లో కోర్సును అభ్యసించింది.

కెరీర్ మార్చు

ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్న ఆమె మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత 2019లో స్టార్ మా తెలుగు టెలివిజన్ షో సిరి సిరి మువ్వలు తో నటనవైపు అడుగులు వేసింది. ఆమె గోరింటాకు (2021), గుప్పెడంత మనసు (2020) వంటి వివిధ తెలుగు టెలివిజన్ సీరియల్స్ చేసింది. 2021లో వచ్చిన తెలుగు చిత్రం క్యాలీఫ్లవర్ తో సినీ రంగ ప్రవేశం చేసింది.

మూలాలు మార్చు

  1. "Bigg Boss 6 Telugu Launch Updates: Vasanthi Krishnan Entered As BB6 13th Contestant - Sakshi". web.archive.org. 2022-11-14. Archived from the original on 2022-11-14. Retrieved 2022-11-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)