వాసిరెడ్డి నారాయణరావు

వాసిరెడ్డి నారాయణరావు తెలుగు సినిమా నిర్మాత.

జీవిత విశేషాలు

మార్చు

ఆయన బాల్యం కృష్ణా జిల్లా వీరులపాడులో గడిచింది. విజయవాడలో విద్యాభ్యాసం చేస్తుండగానే జాతీయోద్యమానికి చేరువయ్యారు. కమ్యూనిస్టు రాజకీయ సభల్లో ఎక్కువగా పాల్గొంటూ వచ్చారు. 1937లో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలో పాల్గొన్నందుకు కొంతకాలం రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవించారు. తర్వాత వీరులపాడుకు తిరిగి వచ్చి రైతు కూలీ ఉద్యమంలో చురుకుగా పనిచేసారు. కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం విధించడంతో ఆయన సినిమా రంగం వైపుకు పయనించారు. తెనాలిలో సత్యనారాయణ టాకీస్ ను నిర్మించారు. సినీ నిర్మాణంపై దృష్టి సారించారు. 1949లో "నీరా ఔర్ నందా" అనే హిందీ సినిమాను "ఆహుతి" పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు. తొలి తెలుగు డబ్బింగ్ సినిమా తీసిన నిర్మాతగా చరిత్రకెక్కారు. ఆ అనుభవంతోటే 1959లో నందమూరి తారక రామారావుతో "జయభేరి" అనే సినిమాను తీసారు. ఈ చిత్రానికి ప్రభుత్వం నుండి పురస్కారాలను అందుకున్నారు [1]

మూలాలు

మార్చు
  1. సాక్షి, 20 డిసెంబరు 2016, మీకు తెలుసా - తొలి డబ్బింగ్ చిత్ర నిర్మాత నారాయణరావు.

ఇతర లింకులు

మార్చు