వాసుదేవ బల్వంత ఫడ్కే

భారత విప్లవకారుడు

వాసుదేవ బల్వంత ఫడ్కే (About this sound ఉచ్ఛారణ ) (4 నవంబర్ 184517 ఫిబ్రవరి 1883) బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రిటీష్ పరిపాలనలో రైతుల దుస్థితి ఆయనను కదిలించింది. ‘స్వరాజ్’ ఈ సమస్యలన్నిటీకీ సరైన విరుగుడు అని ఫడ్కే నమ్మారు. మహారాష్ట్రలోని కోలీలు, భిల్లులు, ధాంగర్లు మొదలైన తెగల సహకారంతో రామోషీ అనే విప్లవ బృందం తయారుచేశారు. బృందం బ్రిటీష్ పరిపాలనను అంతం చేయడానికి సాయుధ పోరాటం ప్రారంభించింది. వీరు ఆంగ్ల వ్యాపారవేత్తలపై దాడులు చేసి, దోచుకుని వారి విముక్తి పోరాటానికి నిధులు సమకూర్చుకున్నారు. బ్రిటీష్ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించి కొద్దిరోజులు నిలబెట్టుకోవడంతో ఆయన వెలుగులోకి వచ్చారు.

వాసుదేవ బలవంత ఫడ్కే
VasudevBalwantPhadkebust.jpg
ముంబైలో వాసుదేవ బలవంత ఫడ్కే విగ్రహం
జననం(1845-11-04)1845 నవంబరు 4
షిర్ధాన్ గ్రామం, పాన్వెల్ తాలూకా, రాయిఘర్ జిల్లా, మహారాష్ట్ర(భారతదేశం)
మరణం1883 ఫిబ్రవరి 17(1883-02-17) (వయస్సు 37)
వృత్తివిప్లవకారుడు

తొలినాళ్ళ జీవితంసవరించు

ఫడ్కే 1845-11-04లో మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాకు చెందిన పన్వెల్ తాలూకా షిర్ధాన్ గ్రామంలో మరాఠీ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న కాలంలో కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. అటుపైన పాఠశాల చదువు మధ్యలో వదిలివేశారు. పుణే నగరం చేరుకుని మిలటరీ అక్కౌంట్స్ డిపార్టుమెంటులో గుమస్తాగా 15 సంవత్సరాల పాటు పనిచేశారు.[1]

మూలాలుసవరించు

  1. రిపోర్ట్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బాంబే ప్రెసిడెన్సీ. p. 36.

ఇతర లింకులుసవరించు