వికీడేటా

ఉచిత జ్ఞాన భాండాగారం
(వికీడేటా(Wikidata) నుండి దారిమార్పు చెందింది)

వికీడేటా అనేది వికీమీడియా ఫౌండేషన్ అందచేస్తున్న సహకారంతో సవరించగల జ్ఞాన భాండారము. ఇది ఒక సాధారణ స్వేచ్ఛా డేటా మూలం. దీనిని వికీపీడియా లాంటి వికీమీడియా ప్రాజెక్టులలో వాడతారు, [5][6] ఇది ప్రజోపయోగ పరిధి షరతులతో అందుబాటులో ఉంది. మీడియా ఫైళ్ళకు నిల్వ ప్రాజెక్టు వికీమీడియా కామన్స్లాగా, ఇది అన్ని వికీమీడియా ప్రాజెక్టుల కోసం జ్ఞాన భాండాగారం. వికీడేటా సాఫ్ట్‌వేర్ ను వికీబేస్(Wikibase) గా వ్యవహరిస్తారు.[7]

వికీడేటా
వికీడేటా ప్రధాన పేజీ
Type of site
Available inmultiple languages
Ownerవికీమీడియా ఫౌండేషన్[1][2]
Created byWikimedia community
Commercialకాదు
Registrationఐచ్ఛికం

ప్రాథమిక సూత్రాలు

మార్చు
తెరపట్టులు
అంగారక గ్రహం గురించిన వికీడేటా అంశం నుండి మూడు సత్యాలు. విలువలు ఇతర అంశాలకు లేక వికీమీడియా కామన్స్ కు లింకులుగా వుంటాయి.
పేరు, వివరణ, ఇతర పేర్లు, వికీపీడియా భాష లింకుల తో కూడిన పటం (వికీడేటా తొలిదశది).
వికీడేటా ప్రారంభించక ముందు,సవరణ పెట్టెలో ఇతర వికీపీడియా భాషలలో వ్యాస లింకులు కనబడే విధం (ఎడమ), వ్యాసం చదివేటప్పుడు కనబడే విధం(కుడి). ఈ జాబితాలోని ప్రతి లింకు గల వ్యాసంలో ఇలాగే ఇతర భాషల వ్యాసాల లింకులు చేర్చవలసివచ్చేది. వికీడేటా వలన ఈ సమాచారమంతా కేంద్రీకృతమైంది.
ఎడిట్ లింక్స్ ("Edit links") అనే లింకు ద్వారా వికీడేటాకు వెళ్లి వికీపీడియా భాష లింకులను సవరించవచ్చు.

అంశాలు

మార్చు
 
ఈ రేఖాచిత్రం వికిడేటాలో ఉపయోగించిన అతి ముఖ్యమైన పదాలను చూపిస్తుంది

వికిడేటా అనేది దస్త్రం-ఆధారిత డేటాబేస్. దీనిలోని అంశాలు ప్రధానంగా విషయాలు, భావనలు లేదా వస్తువులను సూచిస్తాయి. వస్తువులకు ఉదాహరణలు 1988 సమ్మర్ ఒలింపిక్స్ (Q 8470), లవ్ (Q316), ఎల్విస్ ప్రెస్లీ (Q303), గొరిల్లా (Q36611). ప్రతి అంశం "QID"గా పిలువబడే Q అక్షరంతో ఒక నిర్దిష్ట సంఖ్య ద్వారా గుర్తించబడుతుంది. ఏ భాషకు అనుకూలంగా లేకుండా, అనువదించడానికి సమాచారం అందచేసే అంశాన్ని గుర్తించడానికి అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని దీనిద్వారా వీలవుతుంది.

ఒక పేరుకు అంశ గుర్తింపు సంఖ్యలు నిర్దిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. ఉదాహరణకు, "ఎల్విస్ ప్రెస్లీ" అనే రెండు అంశాలు ఉన్నాయి: ఎల్విస్ ప్రెస్లీ (Q303) అమెరికన్ గాయకుడు, నటుడిని సూచిస్తుంది, ఎల్విస్ ప్రెస్లీ (Q610926) అతని స్వీయ-పేరు గల ఆల్బమ్‌ను సూచిస్తుంది .

ప్రాథమికంగా, ఒక అంశం పేరు(లేబుల్), వివరణ, కొన్ని సత్యాలను(నిర్ధారించగల సమాచారం) కలిగి ఉంటుంది.


దావాలు

మార్చు

వికీడేటాలో ఒక వస్తువు గురించి తెలిసిన సమాచారం ఎలా నమోదు చేయబడుతుందో, దానిని 'సత్యాలు' లేక 'సత్యమైనవిగా దావా వేసినవి' అని అంటారు. అధికారికంగా, అవి కీ(నిర్దిష్ట లక్షణాన్ని తెలిపేది)-విలువ జతలను కలిగి ఉంటాయి, ఇవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విలువలతో (" సర్ ఆర్థర్ కోనన్ డోయల్ " లేదా "1902" వంటివి), ఆస్తికి ("రచయిత" లేదా "ప్రచురణ తేదీ" వంటివి) సరిపోలుతాయి. ఉదాహరణకు, అనధికార ఆంగ్ల దావా "పాలు తెలుపు రంగులో వుంటుంది" రంగు (P462) కు తెలుపు విలువగా(Q23444) పాలు (Q8495)అనే అంశంతో జత చేయబడివుంటుంది..

దావాల ద్వారా ఒక లక్షణాన్ని ఒకటి కంటే ఎక్కువ విలువలకు జత చేయవచ్చు. ఉదాహరణకు, మేరీ క్యూరీ కోసం "వృత్తి" 'కీ' ని, "భౌతిక శాస్త్రవేత్త", "రసాయన శాస్త్రవేత్త" విలువలతో అనుసంధానించవచ్చు, ఆమె రెండు వృత్తులలో నిమగ్నమైందనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. [8]

విలువలు ఇతర వికీడేటా అంశాలు, పదబంధాలను(string), సంఖ్యలను లేదా మీడియా ఫైల్‌లతో సహా అనేక రకాలను తీసుకోవచ్చు. లక్షణాలు ఏ రకమైన విలువలతో జత చేయవచ్చో సూచిస్తాయి. ఉదాహరణకు, అధికారిక వెబ్‌సైట్ లక్షణము (P856) వెబ్సైట్ చిరునామ ("URL") రకం విలువలతో మాత్రమే జతచేయబడుతుంది. [9] లక్షణాలు వాటి ఉద్దేశించిన ఉపయోగం గురించి మరింత సంక్లిష్టమైన నియమాలను నిర్వచించవచ్చు, వీటిని పరిమితులు అని పిలుస్తారు. ఉదాహరణకు, రాజధాని (P36) లక్షణంతో "ఒకే విలువ పరిమితి" ఉంటుంది, ఇది (సాధారణంగా) భూభాగాలకు ఒకే రాజధాని నగరం మాత్రమే అనే వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. పరిమితులను ఉల్లంఘించలేని నియమాలుగా కాక సూచనలుగా పరిగణిస్తారు. [10]

ఐచ్ఛికంగా, దావా యొక్క పరిధికి వర్తించే అదనపు సమాచారాన్ని అందించడం ద్వారా, దావా యొక్క అర్ధాన్ని మెరుగుపరచడానికి విశేషణాలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, "జనాభా" లక్షణాన్ని "2011 నాటి" వంటి అర్హతతో సవరించవచ్చు. దావా యొక్క సమాచారాన్ని ఆధార మూలాన్ని సూచిస్తూ చేర్చవచ్చు.[11]

భాషవేరులు(లెక్సిమ్)

మార్చు
కేరళలో వికీడేటా పుట్టినరోజు ఆచరణ

భాషాశాస్త్రంలో, 'లెక్సిమ్' అనేది భాషాశాస్త్రంలో అర్ధయుక్త ప్రాథమిక అంశం(భాషవేరు). వికేడేటా భాషావేరులను భాషానిర్మాణశాస్త్రానికి అనువుగా మరింత అనుకూలంగా నిల్వ చేస్తుంది. లెక్సీమ్ సూచించే భాషను నిల్వ చేయడంతో పాటు, వాటికి రూపాల కోసం ఒక విభాగం, క్రియాకాలరీతులకు ఒక విభాగం ఉన్నాయి. [12]


అభివృద్ధి చరిత్ర

మార్చు

కృత్రిమ మేధస్సు పరిశోధన కోసం అలెన్ ఇన్స్టిట్యూట్, గోర్డాన్, బెట్టీ మూర్ ఫౌండేషన్, గూగూల్ సంస్థలు 13 లక్షల €లు [13] [14] ఇవ్వగా ప్రాజెక్టు పని ప్రారంభమైంది. ప్రాజెక్టు అభివృద్ధి ప్రధానంగా వికీమీడియా డ్యూచ్‌ల్యాండ్ చేసింది. తొలిగా మూడు దశలలో పనిజరిగింది: [15]

  1. వ్యాసాలకు వివిధ వికీపీడియా భాషా లింకులను కేంద్రీకరించటం
  2. అన్ని వికీపీడియాలకు సమాచారపెట్టెలో వివరాలకు కేంద్ర స్థలాన్ని పనిచేయడం
  3. వికీడేటాలోని డేటా ఆధారంగా జాబితా కథనాలను సృష్టించడం, నవీకరించడం

ప్రారంభం, ప్రాజెక్టులలో అమలు కాలక్రమం

మార్చు

ఇది 2006 తరువాత వికీమీడియా ఫౌండేషన్ ప్రారంభించిన మొదటి కొత్త ప్రాజెక్ట్ గా 2012 అక్టోబరు 29 న ప్రారంభించబడింది.. [5] [16] [17] ఈ సమయంలో, భాషా లింకుల కేంద్రీకరణ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది అంశాలను సృష్టించడానికి, ప్రాథమిక సమాచారంతో నింపడానికి వీలు కల్పించింది అనగా ఒక లేబుల్ - పేరు లేదా శీర్షిక, మారుపేర్లు - లేబుల్‌కు ప్రత్యామ్నాయ పదాలు, వివరణ, వికీపీడియా యొక్క అన్ని వివిధ భాషా సంచికలలో అంశం గురించి వ్యాసాలకు లింకులు.

చారిత్రాత్మకంగా, వికీపీడియా వ్యాసంలో భాషా లింకుల జాబితాను కలిగి ఉంటుంది, వికీపీడియా యొక్క ఇతర సంచికలలో అదే అంశంపై వ్యాసాలకు లింకులు ఉన్నాయి. ప్రారంభంలో, వికిడేటా అనేది భాషా లింకుల స్వీయ-నియంత్రణ నిల్వ. తొలిగా వికీపీడియా భాషా సంచికలు అప్పుడు వికీడేటాను వాడుకో లేకపోయాయి, కాబట్టి అవి వారి స్వంత భాషా లింకుల జాబితాలను కొనసాగించాయి.

2013 జనవరి 14 న,మొదటిగా హంగేరియన్ వికీపీడియా, వికిడేటా ద్వారా భాషా లింకుల సదుపాయాన్ని పొందినది.[18] ఈ కార్యాచరణను జనవరి 30 న హిబ్రూ, ఇటాలియన్ వికీపీడియాలకు, ఫిబ్రవరి 13 న ఇంగ్లీషు వికీపీడియాకు, మార్చి 6 న అన్ని ఇతర వికీపీడియాలకు విస్తరించబడింది. [19] [20] [21] [22] ఇంగ్లీషు వికీపీడియా వ్యాసాల నుండి భాషా లింకులు తొలగింపు ప్రతిపాదన పై ఏకాభిప్రాయం కుదరకపోయినా,[23] ఇంగ్లీష్ వికీపీడియాలో వికీడేటా చేతనం చేయబడింది. 2013 సెప్టెంబరు 23 న, వికీమీడియా కామన్స్‌లో భాషా లింక్‌లు ప్రత్యక్షమయ్యాయి. [24]

దావాలు, డేటా అందుబాటు (యాక్సెస్)

మార్చు

2013 ఫిబ్రవరి 4 న వికీడేటా అంశాలకు దావాలు ప్రవేశపెట్టబడ్డాయి. లక్షణాల కోసం సాధ్యమయ్యే విలువలు మొదట్లో రెండు డేటా రకాలకు (వికీమీడియా కామన్స్ లోని అంశాలు, చిత్రాలు) పరిమితం చేయబడ్డాయి, తరువాత ఎక్కువ డేటా రకాలు (కోఆర్డినేట్లు, తేదీలు వంటివి) అనుమతించబడ్డాయి. మొదటిగా పదబంధం (String), మార్చి 6 న మోహరించబడింది. [25]

వివిధ వికీపీడియా భాషా సంచికలకు వికీడేటా నుండి డేటాను అందుకోగల సామర్థ్యం మార్చి 27- 2013 ఏప్రిల్ 25 మధ్య క్రమంగా రూపొందించబడింది. [26]

2015 సెప్టెంబరు 16 న, వికీడేటా ఏకపక్ష ప్రాప్యత అని పిలవడం లేదా ఇచ్చిన వికీడేటా అంశం నుండి నేరుగా అనుసంధానం కాని వస్తువుల లక్షణాలకు ప్రాప్యత చేయడం ప్రారంభించింది. ఉదాహరణకు, బెర్లిన్ వ్యాసం నుండి జర్మనీ గురించి డేటాను చదవడం సాధ్యమైంది, ఇంతకు ముందు ఇలా సాధ్యం కాలేదు. [27] 2016 ఏప్రిల్ 27 న వికీమీడియా కామన్స్‌లో ఏకపక్ష ప్రాప్యత సక్రియం చేయబడింది. [28]

ప్రశ్న సేవ(క్వెరీ సేవ)

మార్చు

2015 సెప్టెంబరు 7 న, వికీమీడియా ఫౌండేషన్ వికీడేటా ప్రశ్న సేవను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.[29] ఇది వికీడేటాలో ఉన్న డేటాపై ప్రశ్నలను సంధించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.[30] ఈ సేవ స్పార్కిల్(SPARQL) ను ప్రశ్న భాషగా ఉపయోగిస్తుంది. 2018 నవంబరు నాటికి, డేటాను వివిధ మార్గాల్లో ప్రశ్నించడానికి అనుమతించే కనీసం 26 వేర్వేరు సాధనాలు ఉన్నాయి. [31]

గుర్తింపులు, వాడుక

మార్చు

2014 నవంబరు లో, వికీడేటా ఓపెన్ డేటా ఇన్స్టిట్యూట్ నుండి “పరిపూర్ణ స్థాయికి, అంతర్నిర్మిత బహిరంగతకు” ఓపెన్ డేటా పబ్లిషర్ అవార్డును అందుకుంది. [32]

2018 నవంబరు నాటికి, వికీడేటా సమాచారం ఉపయోగం ఇంగ్లీషు వికీపీడియా వ్యాసాలలో 58.4%గావుంది. ఈ వాడుక బాహ్య గుర్తింపు వివరాలు లేదా భౌగోళిక స్థానాల కోసం ఎక్కువగా ఉంది. మొత్తంమీద వికీడేటా నుండి డేటా, వికీపీడియాలో 64%, వికీవాయేజ్ లో 93%, వికీకోట్ లో 34%, వికీసోర్స్ లో 32%, వికీమీడియా కామన్స్ లో 27% పేజీలలో వాడబడింది. ఇతర వికీమీడియా ఫౌండేషన్ ప్రాజెక్టులలోనూ వాడబడుతుంది. [33]

2018 నవంబరు నాటికి, వికీడేటా డేటా కనీసం 20 ఇతర బాహ్య సాధనాల ద్వారా దృశ్యమానం చేయబడింది,[34] వికీడేటా గురించి కనీసం 100 పరిశోధన పత్రాలు ప్రచురించబడ్డాయి. [35] దీని ప్రాముఖ్యతను అనేక సాంస్కృతిక సంస్థలు గుర్తించాయి. [36]

చిహ్నం

మార్చు

పట్టీల చిహ్న, "వికీ" పదం మోర్స్ కోడ్లో చూపబడింది.[37]

ప్రస్తావనలు

మార్చు
  1. https://www.wikidata.org/wiki/Wikidata:Introduction. {{cite web}}: Missing or empty |title= (help)
  2. Error: Unable to display the reference from Wikidata properly. Technical details:
    • Reason for the failure of {{Cite web}}: The output template call would miss the mandatory parameter url.
    • Reason for the failure of {{Cite Q}}: The Wikidata reference contains the property quotation (P1683), which is not assigned to any parameter of this template.
    See the documentation for further details.
  3. "Wikidata.org Traffic, Demographics and Competitors - Alexa". www.alexa.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 నవంబరు 2012. Retrieved 4 February 2019.
  4. "Wikidata's tenth anniversary has been celebrated in Tamale, Ghana, by the Dagbani Wikimedians User Group and two of its sister communities". 18 నవంబరు 2022. Retrieved 4 అక్టోబరు 2024. Wikidata went live on October 29, 2012
  5. 5.0 5.1 Wikidata( Archived 2012-10-27 at the Wayback Machine)
  6. "Data Revolution for Wikipedia". Wikimedia Deutschland. March 30, 2012. Archived from the original on 2012-09-11. Retrieved September 11, 2012.
  7. "Wikibase — Home".
  8. "Help:Statements".
  9. "Help:Data type".
  10. "Help:Property constraints portal".
  11. "Help:Sources".
  12. "Wikidata - Lexicographical data documentation".
  13. Dickinson, Boonsri (March 30, 2012). "Paul Allen Invests In A Massive Project To Make Wikipedia Better". Business Insider. Retrieved September 11, 2012.
  14. Perez, Sarah (March 30, 2012). "Wikipedia's Next Big Thing: Wikidata, A Machine-Readable, User-Editable Database Funded By Google, Paul Allen And Others". TechCrunch. Archived from the original on 2012-09-11. Retrieved September 11, 2012.
  15. "Wikidata - Meta".
  16. Pintscher, Lydia (October 30, 2012). "wikidata.org is live (with some caveats)". wikidata-l mailing list. http://lists.wikimedia.org/pipermail/wikidata-l/2012-October/001151.html. Retrieved November 3, 2012. 
  17. Roth, Matthew (March 30, 2012). "The Wikipedia data revolution". Wikimedia Foundation. Archived from the original on 2012-09-11. Retrieved September 11, 2012.
  18. "First steps of Wikidata in the Hungarian Wikipedia".
  19. "Wikidata coming to the next two Wikipedias".
  20. "Wikidata live on the English Wikipedia".
  21. "Wikidata now live on all Wikipedias".
  22. "Wikidata ist für alle Wikipedien da" (in German). Golem.de. Retrieved 29 January 2014.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  23. "Wikipedia talk:Wikidata interwiki RFC".
  24. Pintscher, Lydia (23 September 2013). "Wikidata is Here!". Commons:Village pump.
  25. Pintscher, Lydia. "Wikidata/Status updates/2013 03 01". Wikimedia Meta-Wiki. Wikimedia Foundation. Retrieved 3 March 2013.
  26. "Wikidata goes live worldwide". The H. 2013-04-25. Archived from the original on 2014-01-01.
  27. Lydia, Pintscher (16 September 2015). "Wikidata: Access to data from arbitrary items is here". en:Wikipedia:Village pump (technical). Retrieved 30 August 2016.
  28. Lydia, Pintscher (27 April 2016). "Wikidata support: arbitrary access is here". Commons:Village pump. Retrieved 30 August 2016.
  29. https://query.wikidata.org/
  30. "Announcing the release of the Wikidata Query Service".
  31. "Wikidata Query Data tools".
  32. "First ODI Open Data Awards presented by Sirs Tim Berners-Lee and Nigel Shadbolt". Archived from the original on 2016-03-24. Retrieved 2019-07-24.
  33. "Percentage of articles making use of data from Wikidata". Archived from the original on 2018-11-15.
  34. "Wikidata Tools - Visualize data".
  35. "Scholia - Wikidata".
  36. "International Semantic Web Conference 2018".
  37. commons:File talk:Wikidata-logo-en.svg#Hybrid. Retrieved 2016-10-06.

మరింత చదవడానికి

మార్చు

ఇవీ చూడండి

మార్చు

వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీడేటా

బాహ్య లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వికీడేటా&oldid=4330811" నుండి వెలికితీశారు