వికీపీడియా:అనువాద పరికరం వాడుకలో ఎదురైన అనుభవాలు

అనువాద ఉపకరణం వాడేటపుడు వాడుకరులకు ఎదురైన అనుభవాలను కలబోసుకునేందుకు సృష్టించుకున్న పేజీ ఇది. ఇది విధాన నిర్ణయాలు చేసే/మార్చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పేజీ కాదు. కేవలం వాడుకరులు తమ అనుభవాలను, ఎదురైన సమస్యలను, వాటికి కనుక్కున్న పరిష్కారాలనూ తెలుపుతూ పరస్పరం ఉపయోగపడేలా ఏర్పాటు చేసుకున్న పేజీ. ఇక్కడ వెలుగులోకి తెచ్చిన సమస్యలు పరిష్కారాలను క్రోడీకరించి ఒకచోట పెడితే, ఇతర వాడుకరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిష్కారాలు లభించని సమస్యలు - అవి సాంకేతిక సమస్యలైతే వాటిని సంబంధిత సాంకేతికులకు తెలపవచ్చు. ఇతర సమస్యలైతే అందరం కలిసి పరిష్కారాల కోసం వెదకవచ్చు. పరిష్కారం దొరికినా దొరక్కున్నా కనీసం సమస్యల జాబితా అయినా మనకు అందుబాటులో ఉంటుంది. గమనిక: చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇక్కడ మన అనుభవాలు ముఖ్యం. దాన్ని బట్టి చేసే సూచనలు ముఖ్యం. మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలూ, తదితరాలూ వాటి తరువాతే.

అనువాద పరికరం వాడుకలో ప్రగతి

మార్చు

ఈమధ్య కాలంలో అనువాద పరికరం వాడుక బాగా పెరిగింది. పరికరం వాడి ప్రచురించిన పేజీల గణాంకాలను ఈ విభాగంలో చూడవచ్చు

సంవత్సరం 2015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024

మే 1 వరకు

మొత్తం
ప్రచురించిన

వ్యాసాల సంఖ్య

43 309 257 195 274 653 1575 1261 3614 2556 10,737
  • గమనిక: పరికరం ద్వారా ఒకే వ్యాసాన్ని పదేపదే ప్రచురించే అవకాశం కూడా ఉంది. అనువాద పరికరం చూపే గణాంకాల్లో ఎన్నిసార్లు ప్రచురణ జరిగితే అన్ని సార్లూ చూపిస్తుంది. కానీ పైన చూపిన గణాంకాల్లో మాత్రం, మొదటిసారి చేసిన ప్రచురణను మాత్రమే చూపించాం. ఈ కారణం వలన ఈ రెండు గణాంకాల్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.
  • మరో గమనిక: అనువాద పరికరం నుండి ఒక వ్యాసాన్ని ఎన్నిసార్లైనా ప్రచురించవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఒక్కసారే ప్రచురించడంలో ప్రత్యేకమైన గొప్పేమీ లేదు. ఎన్నిసార్లు ప్రచురించాలనేది వాడుకరి వీలును బట్టి ఉంటుంది.

అనువాద పరికరం వాడి చాలా వేగంగా అనువాదాలు చెయ్యవచ్చు. ప్రచురించే ముందు భాషను సహజంగా ఉండేలా సవరణలు చేసినప్పటికీ ఈ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది.2023 ఆగస్టు16 న జరిగిన కొన్ని అనువాదాలను కింది పట్టికలో చూడవచ్చు. నిమిషానికి దాదాపు1,000 బైట్లు అనువదించారు. ఇవి మచ్చు మాత్రమే, ఇంతకంటే వేగంగా చేసిన దృష్టాంతాలు కూడా ఉండవచ్చు.

కింది పట్టికలో ఇచ్చిన సమయాలు సుమారుగా ఇచ్చినవి కాదు, ఖచ్చితమైనవి. తేడా ఏమైనా ఉంటే అది ఒక పది పదిహేను సెకండ్లు ఉంటుందంతే. ఇవన్నీ, అనువాదం మొదలుపెట్టిన సమయం, ముగించిన సమయం - ఈ రెంటిని తీసుకుని లెక్కించినవి. ఈ సమయం పూర్తిగా - సంపూర్ణంగా - అనువాదానికే కేటాయించారని భావిస్తే వచ్చే సమయం ఇది. కానీ వాస్తవంలో అన్నిసార్లూ అలా ఏకబిగిన చేసెయ్యం. మొదలుపెట్టి ఆపేస్తాం. ఒక అరగంట వాకింగుకెళ్ళొచ్చి మళ్ళీ మొదలెడతాం. మళ్ళీ ఆపి కాఫీ తాగి మళ్ళీ మొదలెడతాం. మళ్ళీ ఆపుతాం, మొదలెడతాం.. ఇలా జరుగుతుంది. అయినా సరే.., ఈ వ్యాసాలు చిటికెల్లో అయిపోయాయ్. సగటున ఒక్కో నిమిషానికీ780 బైట్లు అనువదించారు. అంటే ఒక పది వేల బైట్ల పేజీని అనువదించాలంటే పావుగంట పడుతుంది. మరింత కులాసాగా, ఆడుతూ పాడుతూ చేద్దాం అని అరగంట పెట్టుకుందాం ఒక్కోదానికీ. రోజుకు రెండు గంటలు ఈ పనిపై ఖర్చు పెట్టగలిగితే నాలుగు పేజీలు సరదాగా రాసెయ్యొచ్చన్నమాట. ఆ విధంగా నెలకు ఒక వంద కొత్త వ్యాసాలు రాయొచ్చు.

వేగానికి సంబంధించి ఆయా వాడుకరుల అనుభవాలేంటో కింద చూపిన విభాగంలో చెప్పవలసినది.

సం ఇంగ్లీషు పేజీ తెలుగు పేజీ అనువదించిన

వాడుకరి

తెలుగు పేజీ

పరిమాణం

అనువాదానికి

పట్టిన సమయం నిమిషాల్లో

సగటున

ఒక్కో నిమిషానికి చేసిన అనువాదం, బైట్లలో

మానవిక

అనువాద శాతం

1 Priyanjali Jain ప్రియాంజలి జైన్ వెంకటరమణ 4,100 3 1,367 44%
2 Chaturi Thalagalage చతురి తలగలగే ప్రణయ్ రాజ్ 4,800 5 960 30%
3 One-Test wonder ఒన్-టెస్ట్ వండర్ వెంకటరమణ 16,000 11 1,455 32%
4 Geeta Mahalik గీత మహాలిక్ Divya4232 11,700 12 975 38%
5 Chindodi Leela చిందోడి లీల Divya4232 10,300 10 1,030 43%
6 Vijay Rajindernath విజయ్ రాజేంద్రనాథ్ వెంకటరమణ 7,000 7 1,000 37%
7 Sanju Samson సంజు శాంసన్ ప్రణయ్ రాజ్ 15,000 11 1,364 39%
8 Wicket-keeper వికెట్ కీపర్ వెంకటరమణ 31,000 52 596 33%
9 Deepak Hooda దీపక్ హుడా ప్రణయ్ రాజ్ 15,000 11 1,364 60%
10 R. Nagarathnamma ఆర్.నాగరత్నమ్మ Divya4232 10,000 14 714 39%
11 Sunita Sharma (cricket coach) సునీతా శర్మ (క్రికెట్ కోచ్) వెంకటరమణ 13,000 11 1,182 48%
12 Janardan Navle జనార్దన్ నవ్లే వెంకటరమణ 6,000 20 300 48%
13 B. Jayashree బి. జయశ్రీ Divya4232 13,200 16 825 53%
14 Indrani Roy ఇంద్రాణి రాయ్ వెంకటరమణ 10,400 6 1,733 34%
15 Jason Mohammed జాసన్ మొహమ్మద్ Divya4232 10,475 39 269 70%
మొత్తమ్మీద, ఈ15 అనువాదాల్లోనూ సగటున ఒక్కో నిమిషానికి చేసిన అనువాదం, బైట్లలో 781

వేగం విషయంలో మన అనుభవాలు, సూచనలు

మార్చు

పరికరంతో అనువాదం వేగంగా అవుతోంది. పరికరం అందరికీ ఒకటే. వేగాన్ని సాధించడం అనేది మన చేతుల్లోనే ఉంది. మీరు ఎలా సాధించారు? కిటుకులేమైనా ఉన్నాయా? ఉంటే ఏంటవి? ఉదాహరణకు కొన్ని అనువాదాలను పరికరం సరిగా చెయ్యదు, చేసినా సరిగా చెయ్యదు. అక్కడ మానవికంగా చెయ్యాలంటే టైం పట్టొచ్చు. ఆలా టైం వేస్టు చేసుకునే బదులు, అలాంటి అనువాదాలను ప్రచురించాక చేసుకోవడం ఉత్తమం. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పండి.

నాణ్యత విషయంలో మన అనుభవాలు

మార్చు

యాంత్రిక అనువాదాన్ని సవరించి సాధ్యమైనంత సహజంగా ఉండేలా భాషను సరిచెయ్యడంలో మన అనుభవాలు, సూచనలు ఇక్కడ రాద్దాం.

30% కనీస మానవిక అనువాద పరిమితిపై మన అనుభవాలు, సూచనలు

మార్చు

అనువాద పరికరంలో స్వంతంగా చూసి నేర్చుకునే స్వభావం, నేర్పు అంతర్గతంగా ఇమిడి ఉన్నాయి. అది నేర్చుకుంటుంది, మెరుగు పడుతుంది. పడుతోంది కూడా. ఒక ఐదారేళ్ళ కిందటి భాషా నాణ్యత కంటే, ఇప్పటి నాణ్యత బాగా మెరుగుపడింది. మరి ఇప్పుడు 30% పరిమితి ఎలా ఉందనిపించింది? అలాగే ఉంచాలా? ఇంకా పెంచాలా? కొంచెం తుంచాలా? దీనిపై మన అనుభవాలు సూచనలూ చెప్పుకుందాం.

గమనిక:సముదాయం నిర్ణయం మేరకు 25%కు తగ్గించబడింది

ఇతర సమస్యలు

మార్చు

అనువాద పరికరం గురించి వేరే ఇతర అంశాలు, సమస్యలూ, సాంకేతిక ఇబ్బందులూ వగైరాల గురించి చెప్పాలంటే ఇక్కడ రాయండి.

యర్రా రామారావు గమనించినవి

మార్చు

అసందర్భ తికమక పదాలు చేరిక కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది.మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దిపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.

నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్భ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించుట జరిగింది. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రాపదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్భంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు, కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్యం సందర్బానికి తగిన సరియైన పదం ఉంటేనే బాగుంటుంది.

ఆంగ్లపదం అనువాద పదం ఉండాలిసిన పదం వివరం
Adoor తలుపు ఆదూర్ కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం
Praful Patel డస్ట్ పటేల్ ప్రఫుల్ పటేల్ రాజకీయ నాయకుడు
Showaless K Shilla ప్రదర్శన లేని కె షిల్లా షోవేలెస్ కె షిల్లా ఒక రాజ్యసభ సభ్యుడు
Jagadambi Mandal జగదాంబి మండలం జగదాంబి మండల్ ఒక రాజ్యసభ సభ్యుడు
votes swing ఓట్లు ఊపుతాయి ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ ఇలాంటి సందర్భంలో అలా రాస్తేనే బాగుంటుంది
Disqua (Disqualified) డిస్క్వల్ అనర్హత లేదా అనర్హుడు
Dissolved కరిగిపోయింది రద్దుఅయింది లేదా రద్దైంది
Incumbent నిటారుగా పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం
Acting నటన తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్భాన్నిబట్టి రాయాలి
14th ,15th 14వ, 15వ 14వ తేదీ, 15వ తేదీ
Akola చేసాడు అకోలా ఇది ఒక జిల్లా
Raigad కిరణాలు రాయిగఢ్ ఇది ఒక జిల్లా
Beed మంచం బీడ్ ఇది ఒక జిల్లా
Latur సోమరితనం లాతూర్ ఇది ఒక జిల్లా
రోమన్ అంకెలు వరస సంఖ్యలుగా ఉన్నచోట I ,  నేను గాను V ,  వి గానూ అనువదిస్తుంది.
res (సింపుల్ గా రాసారు) రెస్ రాజీనామా అని ఉండాలి resignation సందర్భంలో అలా రాసారు
bye (సింపుల్ గా రాసారు) బై ఉప ఎన్నిక అని ఉండాలి bye election సందర్భంలో అలా రాసారు

నాకు తెలిసినంతవరకు దీనికి కారణం వ్యాసం సృష్ట్టించిన తరువాత ఒకసారి పరిశీలనాదృష్టితో చదివి సవరించకపోవటం ప్రధాన కారణం అని నేను భావిస్తున్నాను.